Jabardasth టాప్ యాంకర్‌తో పొలిటీషియన్ డేటింగ్.. భారీ గిఫ్టు వ్యవహారంపై రచ్చ!
ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లి చేసుకోకుండా డేటింగ్ వ్యవహారం నడుపుతున్న విషయం తెలిసిందే. సెలబ్రేటీలు చాలా మంది పెళ్లి చేసుకోకుండా.. డేటింగ్ చేస్తున్నారు. అయితే తాజాగా మరో డేటింగ్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుల్లితెరపై ప్రేక్షకులను అలరించే ఓ టాప్ యాంకర్.. బడా పొలిటీషియన్ తో డేటింగ్ లో ఉన్నట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతే కాదు ఆ యంకర్ కు బడా పొలిటీషియన్ భారీ గిఫ్టును కూడా ఇచ్చారట. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇటీవల కాలంలో డేటింగ్ అనేది సెలబ్రేటీలకు కామన్ గా మారిపోయింది. ఇక చాలా మంది బడా సెలబ్రెటీలు.. పెళ్లి చేసుకోకుండా డేటింగ్ వ్యవహారం నడిపిస్తున్నది చూస్తునే ఉన్నాం. ఇప్పుడు తాజాగా మరో సెలబ్రేటీ.. బడా పొలిటీషియన్ తో డేటింగ్ చేస్తున్నట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆ వ్యక్తితో డేటింగ్ చేస్తూ.. అతని నుంచి భారీగానే గిఫ్టులు తీసుకుంటున్నట్లు వార్తలు వైరల్ గా మారాయి.'

బుల్లితెర ప్రేక్షకులకు చాలా మంది లేడీ యాంకర్లు దగ్గరయిన విషయం తెలిసిందే. చాలా మంది యాంకర్లు బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూ.. దూసుకుపోతున్నారు. ఇక వారిలో టాప్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓ లేడీ హోస్టు... ఇప్పుడు ఆమె బడా పొలిటీషియన్ తో డేటింగ్ లో ఉన్నారట. దాదాపు ఎన్నో ఏళ్లుగా ఆమె బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. నటిగానే కెరీర్‌ను మొదలు పెట్టిన ఆమె.. యాంకర్‌గా మారిన తర్వాతనే ఫేమస్ అయింది. దీంతో దశాబ్ద కాలంగా హవాను చూపిస్తూ బుల్లితెర, వెండితెరపై దూసుకుపోతుంది.

ప్రస్తుతం ఆ టాప్ యాంకర్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ యాంకర్ కు ఓ పొలిటికల్ లీడర్ ఆరు లక్షల విలువ చేసే బంగారు నగలను బహుమతిగా ఇచ్చారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. నిజానికి.. మొదటి నుంచి ఆ యాంకర్ కు సంబంధించిన వార్తలంటే జనాలకు బాగా ఆసక్తి. ఈ క్రమంలోనే ఓ రాజకీయ నాయకుడు ఆమెకు బంగారం బహుమతి ఇవ్వడంతో ఈ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది.
టాప్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ యాంకర్.. ఇటీవల ఓ జ్యూవెలరీ షాప్ కు వెళ్లిందని తెలుస్తోంది. ఆ షాపులో ఆమె దాదాపు అక్కడ ఆరు లక్షలు విలువ చేసే బంగారం... తదితర ఆభరణాలు కొనుగోలు చేసిందని సమాచారం. కానీ అక్కడ బిల్లు మాత్రం తాను కట్టలేదట... ఆ బిల్లును ఓ ప్రముఖ పొలిటికల్ లీడర్ సదరు జ్యుయలరీ షాప్ వాళ్లకు ఆన్ లైన్లో ట్రాన్స్ ఫర్ చేశారని ఓ న్యూస్ వైరల్ గా మారింది. దీంతో ఆ గిప్టు వ్యవహారం నెట్టింట వైరల్ గా మారింది.

టాప్ యాంకర్.. బడా పొలిటీషియన్ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. అందుకే ఆమెకు అన్ని లక్షల విలువైన నగలు కొనిచ్చారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి వ్యవహారం తెగ చర్చ నడుస్తోంది. అయితే ఇదంతా నిజమా.. కాదా అనేది తెలియాల్సి ఉంది. నిజంగానే ఆ టాప్ యాంకర్ ఆ నాయకుడితో డేటింగ్ లో ఉందా... ఈ వార్తలకు ఆమె స్పందించి.. చెక్ పెడుతుందా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











