బిగ్‌బాస్‌లో సంపూకి షాక్.. అప్పుడే బయటకు పంపించే కుట్ర!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా బిగ్‌బాస్ తెలుగు వెర్షన్ రియాలిటీ షో బ్రహ్మండంగా ప్రారంభమైంది. తొలిసారి ఎన్టీఆర్ బుల్లితెర మీద హోస్ట్‌గా కనిపిస్తూ చేస్తున్న కార్యక్రమానికి మంచి స్పందన కనిపిస్తున్నది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా బిగ్‌బాస్ తెలుగు వెర్షన్ రియాలిటీ షో బ్రహ్మండంగా ప్రారంభమైంది. తొలిసారి ఎన్టీఆర్ బుల్లితెర మీద హోస్ట్‌గా కనిపిస్తూ చేస్తున్న కార్యక్రమానికి మంచి స్పందన కనిపిస్తున్నది. ఇక నుంచి ప్రసారం కానున్న ఎపిసోడ్స్ మరింత రంజుగా మారే అవకాశం కనిపిస్తున్నది. తొలి రోజు ఎపిసోడ్స్‌లో సెలబ్రిటీల పరిచయం, బిగ్‌బాస్ హౌస్‌లో వారికి వారు పరిచయం చేసుకోవడం ఆకట్టుకొన్నది. ప్రతీవారం గానీ, మరి కొన్ని వారాలకు గానీ ఎవరో బిగ్‌బాస్ షో నుంచి వైదోలగాల్సి ఉంటుంది. బిగ్‌బాస్‌లో ఆయ సెలబ్రిటీల ఫెర్ఫార్మెన్స్ ఆధారంగా వారి కొనసాగింపు ఉంటుంది. అయితే బిగ్‌బాస్ తొలి ఎపిసోడ్‌లోనే ఆసక్తికరమైన అంశాన్ని ప్రేక్షకుల మీద వదిలి నిర్వాహకులు షాకింగ్ గురిచేశారు. ఆ షాకింగ్ విషయం ఏమిటంటే..

తొలివారం సంపూ ఎలిమినేట్?
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో మొత్తం 14 మంది సెలబ్రిటీలు ఉంటారు. ఆ కార్యక్రమంలో ఎవరిని తొలగించాలన్నది ఆయా సెలబ్రిటీలు వ్యక్తం చేసే మెజారిటీ అభిప్రాయం మరో సెలబ్రిటీ షో నుంచి బయటకు వెళ్లడానికి కారణమవుతుంది. ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లే ముగ్గురు పేర్లను ప్రకటించి బిగ్‌బాస్ షోను కొంత ఆసక్తి రేపారు. అందులో హీరో సంపూర్ణేష్ బాబు ఒకరు.
Recommended Video


సంపూకి వ్యతిరేకంగా ముగ్గురు..
హీరో సంపూర్ణేశ్ బాబుకు వ్యతిరేకంగా మరో ముగ్గురు సెలబ్రిటీలు ఓటు వేశారు. ఈ కార్యక్రమం నుంచి ఎవరిని బయటకు పంపించవచ్చు అని బిగ్‌బాస్ అడిగిన ప్రశ్నకు ఎక్కువ మంది సంపూర్ణేష్ బాబు పేరును సూచించడం గమనార్హం. సాధారణంగా బలమైన పోటీదారుడిని బయటకు పంపించడానికి ఓ రకమైన వ్యూహాన్ని ఇతర సెలబ్రిటీలు అనుసరిస్తారు. ఆ వ్యూహంలో భాగంగానే సంపూను ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

షాక్‌కు గురైన సంపూ
తనకు వ్యతిరేకంగా మరో ముగ్గురు నలుగురు సెలబ్రిటీలు ఓటు వేయడంపై సంపూ ఓ రకమైన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. తొలి వారంలోనే బయటకు పంపించాలన్న ఇతర సెలబ్రిటీల వ్యూహంల అర్థం కాక సంపూ తికమకకు గురైనట్టు కనిపించారు. బిగ్‌బాస్ కార్యక్రమంలో మొట్టమొదటగా ఎలిమినేట్ అయ్యేది సంపూనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సంపూ ఇంటిదారి పట్టడం తథ్యమా?
ఏది ఏమైనా ఇతర సెలబ్రిటీల నుంచి గట్టిపోటిని సంపూ ఎలా ఎదుర్కొన్నాడు. లేదా సంపూ తొలివారంలో ఇంటిదారి పడుతాడా అనే అంశాన్ని తెలుసుకోవడానికి వచ్చే వారం వరకు ఆగాల్సిందే. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారనే వాదన ఓ వైపు.. సెలబ్రిటీ ఎంపిక సరిగా లేదనే మరో వాదన వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











