బిగ్ షాకింగ్: బిగ్ బాస్ నుంచి నాగార్జున ఔట్.. రమ్యకృష్ణ ఇన్.. దీని వెనుక అసలు కథ ఇదే

Recommended Video

Queen #RamyaKrishna has arrived to #BiggBossTelugu3 as special host

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' కొద్దిరోజుల క్రితం సీజన్ - 3ని ప్రారంభించింది. 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఈ సీజన్ మొదటి వారం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగింది. గతంలో ఎన్నడూ చూడని కొత్త కొత్త విషయాలు ఈ సీజన్‌లో కనిపిస్తున్నాయి. కంటెస్టెంట్ల మధ్య జరిగే ప్రతి సన్నివేశం షోపై ఆసక్తిని మరింతగా పెంచేస్తుంది. దీంతో బిగ్ బాస్ విజయవంతంగా ఆరు వారాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ రియాలిటీ షో నుంచి నాగార్జున తప్పుకున్నారు. ఆయన స్థానంలో సీనియర్ నటిని తీసుకొచ్చారు. ఇంతకీ ఆయన ఎందుకు తప్పుకున్నారు? నాగ్ స్థానంలో ఎవరు వచ్చారు?

తప్పుకున్న నాగార్జున

తప్పుకున్న నాగార్జున

బిగ్ బాస్ సీజన్ - 3 రోజురోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వారం ముగ్గురు ఎలిమినేట్ అవడానికి నామినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం జరగబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ఇందులో హోస్ట్ నాగార్జున కనిపించలేదు. దీంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు.

నాగార్జున స్థానంలో శివగామి

ఇక, నాగార్జున స్థానాన్ని శివగామి దేవి అలియాస్ రమ్యకృష్ణ భర్తీ చేశారు. ఈ విషయాన్ని స్టార్ మా యాజమాన్యం వెల్లడించింది. ‘బిగ్ బాస్ సీజన్ - 3 కోసం రాణి రమ్యకృష్ణ స్పెషల్ హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు' అని ప్రకటించింది. అందుకే అనుగుణంగానే ఆమెకు సంబంధించిన ప్రోమోను సదరు చానెల్ విడుదల చేసింది.

చరిత్రలోనే తొలిసారి

చరిత్రలోనే తొలిసారి

ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగులో రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్, రెండో దానిని నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. ఈ రెండింటిని వీళ్లు పూర్తిగా హోస్ట్ చేశారు. అయితే, నాగార్జున హోస్ట్ చేస్తున్న మూడో సీజన్‌లో మాత్రం మధ్యలో మరొకరు ఎంటరయ్యారు. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇలా సీజన్ మధ్యలో హోస్ట్ మారడం ఇదే తొలిసారి.

నాగార్జున రాకపోడానికి కారణం ఇదే

నాగార్జున రాకపోడానికి కారణం ఇదే

నాగార్జున ఆగస్టు 29న 60వ పడిలోకి అడుగు పెట్టారు. ఆ పుట్టినరోజు వేడుక కోసం అక్కినేని ఫ్యామిలీ అంతా ఇటీవల విహారయాత్ర కోసం స్పెయిన్‌లోని ఐబిజాకు వెళ్లారు. ప్రస్తుతం నాగచైతన్య, సమంత, అఖిల్‌, నాగార్జున, అమల తదితరులు ఐబిజా ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ కారణంగానే నాగార్జున బిగ్ బాస్ షోకు రాలేకపోయారని తెలుస్తోంది.

రమ్యకృష్ణనే ఎందుకు తీసుకున్నారంటే..

రమ్యకృష్ణనే ఎందుకు తీసుకున్నారంటే..

వాస్తవానికి ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ శుక్రవారమే జరగాల్సి ఉంది. దానికి నాగ్ అందుబాటులో ఉండరన్న నేపథ్యంలో మరో హోస్ట్ ఎవరన్న దానిపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పలువురు హీరోల పేర్లు తెరపైకి వచ్చినా.. నాగార్జున మాత్రం రమ్యకృష్ణ పేరునే ప్రతిపాదించారని సమాచారం. అందుకే ఆమెను తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

వాళ్లకు కూడా సమాధానం చెప్పొచ్చని..

వాళ్లకు కూడా సమాధానం చెప్పొచ్చని..

రమ్యకృష్ణను తీసుకోవడం ద్వారా బిగ్ బాస్ షోపై ఆరోపణలు చేస్తున్న చాలా మందికి సమాధానం చెప్పినట్లు అవుతుందని షో నిర్వహకులు భావించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనికితోడు బిగ్ బాస్ తెలుగులోనే ఆడవాళ్లకు అవకాశం ఇచ్చారన్న పేరును సొంతం చేసుకోవడం కోసమూ ఇలా ఆలోచించి ఉండొచ్చన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X