బిగ్ బాస్‌ నుంచి భారీ సర్‌ప్రైజ్: ఈ వారం ఎలిమినేటైన కంటెస్టెంట్‌కు ఊహించని ఆఫర్.!

By Manoj

ఇప్పటి వరకు చూడని సరికొత్త అంశాలతో వచ్చి... సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ప్రేక్షకుల హృదయాలను దోచుకునేందుకు కంటెస్టెంట్లు చేసే ప్రయత్నాలు... వాటిని తిప్పికొట్టేందుకు షో నిర్వహకులు చేసే ప్రయోగాలతో ఇది ఆసక్తికరంగా సాగుతూ ఉంటుంది. ఇలానే తెలుగులో మూడు సీజన్లను పూర్తి చేసుకుని... నాలుగో దానిని సైతం ఇటీవలే మొదలెట్టింది. ఈ సీజన్‌లో ఎన్నో ప్రయోగాలు చేస్తూ బిగ్ బాస్ యూనిట్ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ భారీ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం.!

మూడు వారాలు... డిఫరెంట్ రెస్పాన్స్

మూడు వారాలు... డిఫరెంట్ రెస్పాన్స్

సెప్టెంబర్ ఆరున బిగ్ బాస్ సీజన్ - 4 అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. నాగార్జున సారథ్యంలో వచ్చిన ఈ ఎపిసోడ్ భారీ స్పందనను అందుకుంది. అయితే, మొదటి వారం చాలా చప్పగా సాగింది. రెండో వారమైతే కొన్ని ఆసక్తికరమైన పరిస్థితుల కారణంగా కొంత పుంజుకుంది. ఇక, మూడో వారం ఫిజికల్ టాస్క్‌ వల్ల గొడవలు జరిగడంతో మంచి స్పందన రప్పించుకోగలిగింది.

ఆ ప్లాన్ ఇప్పుడే అమలు చేసేశారేంటి

ఆ ప్లాన్ ఇప్పుడే అమలు చేసేశారేంటి

ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా లేదా అన్న అనుమానాలు షో ప్రారంభంలోనే జరిగాయి. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ సీజన్‌లో మూడో వారం ముగియక ముందే ముగ్గురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. వీరిలో ఒకరు కుమార్ సాయి కాగా మిగిలిన ఇద్దరు జబర్ధస్త్ ఫేం అవినాష్.. హీరోయిన్ స్వాతి దీక్షిత్ కావడం గమనార్హం.

మరిన్ని పరిణామాలు.. బిగ్ బాస్ ప్లాన్

మరిన్ని పరిణామాలు.. బిగ్ బాస్ ప్లాన్

రానున్న రోజుల్లో బిగ్ బాస్ షోను మరింత రక్తి కట్టించేందుకు నిర్వహకులు అదిరిపోయే ప్లాన్లు రెడీ చేస్తున్నట్లు బుల్లితెర వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఫిజికల్ టాస్క్‌లను పెంచడంతో పాటు లవ్ ట్రాకులకు సంబంధించిన సీన్లను ఎక్కువగా చూపించనున్నారట. అలాగే, కొందరు సెలెబ్రిటీలను గెస్టులుగా తీసుకు రాబోతున్నారని అంటున్నారు.

బిగ్ బాస్ నుంచి మరో భారీ సర్‌ప్రైజ్ రెడీ

బిగ్ బాస్ నుంచి మరో భారీ సర్‌ప్రైజ్ రెడీ

సరికొత్త టాస్కులు.. లవ్ ట్రాకులు.. కొట్లాటలు.. వాదోపవాదనల కారణంగా రోజురోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది బిగ్ బాస్ సీజన్ 4. ఈ నేపథ్యంలో మరింత మసాలాను దట్టించడానికి మరో లేడీ కంటెస్టెంట్‌ను కూడా హౌస్‌లోకి పంపించారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రోజుల్లో బిగ్ బాస్ షో నుంచి మరో భారీ సర్‌ప్రైజ్ రాబోతుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

కరాటే కల్యాణీతో అలాంటి ప్లాన్ చేశారు

కరాటే కల్యాణీతో అలాంటి ప్లాన్ చేశారు

గత వారం కరాటే కల్యాణీ బిగ్ బాస్ హౌస్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ సమయంలో ఎప్పటి లానే మిగిలిన కంటెస్టెంట్లపై బిగ్ బాంబ్ ప్రయోగం చేశారు షో నిర్వహకులు. దీని ప్రకారం... హౌస్‌లోని ఒక కంటెస్టెంట్‌ను నేరుగా నామినేట్ చేసే అధికారం ఆమెకు కల్పించారు. బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం... కల్యాణీ... దేవీ నాగవల్లిని గడిచిన వారానికి నామినేట్ చేశారు.

Recommended Video

Actor Abhinav Sardar Speech |The Ghost Resort
ఎలిమినేటైన కంటెస్టెంట్‌‌తో ఇప్పుడిలా.!

ఎలిమినేటైన కంటెస్టెంట్‌‌తో ఇప్పుడిలా.!

గత వారం కల్యాణీతో బిగ్ బాంబ్ ద్వారా నేరుగా నామినేట్ చేస్తే.. ఈ వారం హౌస్‌లోని ఒక కంటెస్టెంట్‌ను సేవ్ చేయబోతున్నారట. ఎలిమినేట్ అయిన వ్యక్తి కోరిక మేరకు ఒకరికి ఒక వారం నామినేషన్‌ నుంచి విముక్తి కల్పించనున్నారని ఇన్‌సైడ్ టాక్. ఇదిలాఉండగా... ఈ వారం నామినేషన్‌లో ఉన్న వారిలో మెహబూబ్, దేవీ నాగవల్లి, ఆరియానా డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X