Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ ఊహకు అందని ప్లాన్... ఈసారి OTT లవర్స్ కోసం బిగ్ సర్ ప్రైజ్

ఇంకో మూడు రోజుల్లో బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఇక కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్టు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ షోను సెప్టెంబరు 2న షూటింగ్ చేసి.. 3వ తేదీన టెలికాస్ట్ చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ బిగ్ బాస్ షో టైమింగ్స్ కూడా వచ్చేశాయి. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ ఓటీటీ లవర్స్ కోసం బిగ్ సర్ ప్రైజ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే....

బుల్లితెరపై ప్రేక్షకాదరణ పొందిన షో ఏదైనా ఉందంటే.. బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ షో ఇప్పటికే ఆరు సీజన్స్ పూర్తి చేసుకోగా.. ఒక ఓటీటీ వర్షన్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు ఏడో సీజన్ కు సిద్ధం అయింది. ఇటీవల ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయగా... ఈ సీజన్ ఊహకందని రేంజులో ఉండబోతుందని అర్ధం అయింది.

Big Surprise Plan for OTT Lovers in Bigg Boss Telugu Season 7 News Goes Viral

బిగ్ బాస్ సీజన్‌ 7 సెప్టెంబర్ 1, 2 తేదీల్లో షూటింగ్ జరుపుకుని... సెప్టెంబర్‌ 3వ తేదీన అంటే ఆదివారం నాడు టెలికాస్ట్ చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇక ఆదివారం నాడు ఈ షో సాయంత్రం 6 గంటల నుంచి టెలికాస్ట్ అవనుంది. ఇక సోమవారం నుంచి శుక్రవారం వరకు 9.30 నిమిషాలకు టెలికాస్ట్ అవ్వగా... వీకెండ్స్ మాత్రం 9 గంటలకే ప్రసారం చేయనున్నారు.

ఇక బిగ్ బాస్ సీజన్ 7ను సరికొత్తగా ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఈసారి హౌజులో మొత్తంగా 20 మందిని దింపనున్నారని సమాచారం. గత సీజన్స్ లో గుర్తింపు లేనివారిని తీసుకువచ్చారని విమర్శలు వచ్చాయి. దీనితో ఈ సారి పకడ్భందిగా తెలిసిన వారినే, బాగా ఫేం ఉన్న వారినే తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక ఇప్పుడు ఈ బిగ్ బాస్ ఓటీటీ లవర్స్ కోసం కూడా ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ షో పై ఆడియెన్స్ కి సూపర్ గిఫ్టును ప్లాన్ చేసింది. ఇక ఈ షో కి సంబంధించి సర్ప్రైజ్ లు కానీ సస్పెన్స్ లు కానీ స్టార్ మా హాట్ స్టార్ లోనే చూడొచ్చని ముందు నుంచి చెప్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం... స్టార్ మా లో అయితే బిగ్ బాస్ 7 ని గంటల వ్యవధిలో చూడొచ్చు.

ఇక ఓటీటీ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో మాత్రం 24 గంటలు స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందట. ఇక బిగ్ బాస్ లవర్స్ 24 గంటలు ఈ షోను ఓటీటీలో చూసుకోవచ్చు. మరి ఈ సెప్టెంబర్ 3న ఆరంభం కాబోతున్న ఈ సరికొత్త సీజన్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి ఇక.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X