Bigg Boss Telugu 7: కెప్టెన్సీ టాస్కులో బిగ్ ట్విస్ట్ - వీకెస్ట్ ప్లేయర్ వల్లే టీం గెలిచే అవకాశం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ రాత్రి 9 గంటలు అయిందంటే చాలు టీవీల ముందు వాలిపోతూ తెగ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా హౌస్ లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. నామినేషన్లతో పాటు వీకెండ్స్ ఎపిసోడ్ లను మరింత ఆసక్తిగా చూసే ప్రేక్షకులు... కెప్టెన్సీ వార్ ను కూడా అంతకు మించిన ఎగ్జైట్ మెంట్ తో చూస్తున్నారు. అయితే అందుకు తగ్గట్లుగానే బిగ్ బాస్ కూడా అదిరిపోయే టాస్కులు ఇస్తున్నాడు. అందులో ట్విస్టులు కూడా ఇస్తూ అందరినీ తెగ అలరిస్తున్నాడు.
తొమ్మదో వారంలో సాగే కెప్టెన్సీ టాస్కులు అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బిగ్ బాస్ టీం వదిలిన ప్రోమో చూస్తుంటే అయితే మరింత ఆసక్తి రేకెత్తుతోంది. భోలె షవాళి నిన్న గౌతమ్ టీంలో ఉండగా... బ్లాక్ కలర్ లో ఉన్న బాల్ దొరికింది. అయితే ఆ బ్లాక్ కలర్ బాల్ వల్ల ఏదైనా చెడు జరుగుతుందేమోనని ఆ టీం అంతా తెగ భయపడిపోయారు. ఆ బాల్ తెచ్చిన భోలె అన్నకే దాని ఎఫెక్ట్ పడాలని కొందరు.. ఆయన్ను టీంలోంచి పంపించేటప్పుడు ఆ బాల్ ఇచ్చి పంపిద్దామంటూ చాలానే జోకులు వేసుకున్నారు.

ఈక్రమంలోనే నెక్స్ట్ టాస్క్ గెలిచిన తర్వాత స్వాప్ చేసుకునే అవకాశం రాగా... గౌతమ్ కృష్ణ భోలె షవాళిని వీకెస్ట్ ప్లేయర్ అని చెబుతూ ఎదురు టీంలోకి పంపించాడు. అలాగే అంబటి అర్జున్ స్ట్రాంగ్ ప్లేయర్ అంటూ తమ టీంలోకి తెచ్చుకున్నాడు. అయితే బ్లాక్ కలర్ బాల్ ను మాత్రం భోలెతో పంపించే అవకాశం లేకపోయింది. ఏం టీంలో ఉన్న బాల్స్ ఆ టీం వాళ్లకే అని.. కేవలం కంటెస్టెంట్లను మాత్రమే స్వాప్ చేసుకోవచ్చని బిగ్ బాస్ చెప్పారు. ఇలా గౌతమ్ కృష్ణ టీంలో బ్లాక్ కలర్ బాల్ ఉండిపోయింది. అయితే ఆ బ్లాక్ కలర్ బాల్ యే ఇప్పుడు వారి టీం గెలిచేందుకు కారణం అయినట్లు తాజాగా విడుదల అయిన ప్రోమో చూస్తుంటే అర్థం అవుతుంది.

బ్లాక్ కలర్ బాల్ ఉన్న టీం వాళ్లు.. ఎదుటి టీం దగ్గర ఉన్న బాల్స్ అన్నింటినీ స్వాప్ చేసుకోవచ్చని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు. దీనికి గౌతమ్ కృష్ణ టీం ఫుల్ హ్యాపీగా ఫీలవ్వగా.. ఎదుటి టీం వారు మాత్రే ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా వీకెస్ట్ ప్లేయర్ అని నన్ను బయటకు పంపారు, కానీ నేను తెచ్చిన బాల్ వల్ల మంచి జరుగుతుంటే మాత్రం ఎంజాయ్ చేస్తున్నారంటే భోలె ఫీలయ్యాడు. అలాగే శివాజి కూడా గోల్డెన్ బాల్ వాళ్లకే, బ్లాక్ కలర్ బాల్ పవర్స్ వాళ్లకేనా అంటూ కోపం తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ చెప్పినట్లుగానే రెండు టీంల వాళ్లు బాల్స్ స్వాప్ చేసుకోబోతుండగా.. ఆ రెండు మాత్రం ఇవ్వమంటూ శివాజి చెప్పాడు. దీంతో గౌతమ్ కృష్ణ, శివాజిల మధ్య గొడవ చెలరేగింది.

నిన్నటి నుంచి వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ సాగుతూనే ఉంది. ముఖ్యంగా శివాజి అయితే... గౌతమ్ కృష్ణ వాంటెడ్లీ గొడవ పెట్టుకుంటున్నాడని అన్నాడు. అందుకు గౌతమ్.. నీతో గొడవ పెట్టుకోవాలని నాకేం లేదు, నేను ఈ గేమ్ లో ఏం తప్పు చేశానో చెప్పమంటూ ఫుల్ ఫైర్ అయ్యాడు. ఈరోజుటి పూర్తి ఎపిసోడ్ చూస్తే తప్పు ఎందుకోసం వీరి మధ్య గొడవ జరిగిందో తెలియదు. చూడాలి మరి ఏం టీం విన్ అయి.. కెప్టెన్ ఎవరు అవుతారనేది.


Click it and Unblock the Notifications











