Brahmamudi April 8th episode: అనామికని ముగ్గులోకి దింపిన తల్లి కొడుకులు.. భర్త నిర్ణయాన్ని కాదంటున్న కావ్య!

రాజ్, కల్యాణ్ కుటుంబంలో కంపెనీలో అధిపత్య పోరాటం వారి మధ్య విభేదాలకు దారి తీసింది. ఇదిలా ఉండగా, ఓ చిన్నారిని ఇంటికి తీసుకు రావడంతో అందరూ రాజ్ కొడుకే అని ఫిక్స్ అయ్యారు. వెన్నెలకు, రాజ్‌కు పుట్టిన బిడ్డ అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాజ్‌పై తల్లి, భార్య కావ్య అనుమానాలు పెరిగిపోయాయి. రుద్రాణి తన కొడుకును కంపెనీ ఓనర్ చేయాలని ప్లాన్ వేసింది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి.ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 8వ తేదీ ఎపిసోడ్ 378 లో ఏం జరిగిందంటే?

రుద్రాణి, రాహుల్ ఇద్దరూ అనామికకి వినిపించేలాగా గొడవ పడుతూ ఉంటారు. తనకి కంపెనీలో జాబ్ ఇవ్వలేదని రుద్రాణిని తిడుతున్నట్లు నటిస్తాడు రాహుల్. ఆ మాటలు నిజం అనుకొని వారి దగ్గరికి వచ్చిన అనామిక తల్లిని అలా మాట్లాడటం పద్ధతి కాదు అని రాహుల్ కి చెప్తుంది. బయట ఉండి ఎన్ని మాటలు అయినా చెప్పొచ్చు, ఈదే వాడికి తెలుస్తుంది ఆ కష్టం అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాహుల్. ఏం జరిగిందండి అని రుద్రాణిని అడుగుతుంది అనామిక. కళ్యాణ్ ని ఎండిని చేశాను కదా కన్న కొడుకుని కనీసం జనరల్ మేనేజర్ ని కూడా చేయలేవా అని నన్ను తిడుతున్నాడు.

Big Twist in Brahmamudi serial April 8th Episode of 378 Raj Resigns as MD of company

నా మాట ఎవరు వింటారు చెప్పు అని జాలిగా మొహం పెట్టి మాట్లాడుతుంది రుద్రాణి . రాహుల్ బాదలో కూడా అర్థం ఉంది కదా నేను కళ్యాణ్ తో మాట్లాడుతాను, రాహుల్ ని ఎలాగైనా ఆఫీసుకి పంపించేలాగా చేస్తాను అని మాట ఇచ్చి వెళ్ళిపోతుంది అనామిక. ఆ తర్వాత రాహుల్ తల్లి దగ్గరికి వచ్చి అనామిక ఏమంటుంది అని అడుగుతాడు. పిచ్చిది మన మాయలో పడిపోయింది అని నవ్వుతూ చెప్తుంది రుద్రాణి. మరొకవైపు ఏడుస్తున్న బాబుని ఆడిస్తూ ఉంటాడు రాజ్ అమ్మ వస్తుంది పాలు తెస్తుంది అంటాడు.

అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య నేనేమైనా వాడిని కన్నానా? నన్ను ఎందుకు వాడిని తల్లిని చేస్తున్నారు. నన్ను తెలివిగా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ చేసి వాడి చేత ముడ్డి, మూతి అన్ని కడిగిస్తున్నారు. మీకు కావాలంటే మీ అమ్మగారిని నానమ్మ అని పరిచయం చేయండి, అమ్మమ్మ గారిని తాతమ్మ అని పరిచయం అంతేగాని నన్ను అమ్మ అనకండి కావాలంటే మీ నాన్నకి భార్యని అని పరిచయం చేయండి, బ్రతకడం చేతకాని కళావతి అని పరిచయం చేయండి అంటూ భర్తకి క్లాస్ పీకుతుంది కావ్య.

Big Twist in Brahmamudi serial April 8th Episode of 378 Raj Resigns as MD of company

ఆ తర్వాత వెన్నెల అడ్రస్ తెలుసుకోవడం కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్న కావ్య భర్తని ఓ సలహా కావాలి అని అడుగుతుంది. ఏం సలహా అని అడుగుతాడు రాజ్. నా చిన్నప్పటి ఫ్రెండ్ కనిపించడం లేదు ఇప్పుడు తనని పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలో చెప్పండి అంటుంది. ఇప్పుడు అంత అర్జెంటుగా మీ చిన్నప్పటి ఫ్రెండ్ ఎందుకు కలవాలి అనుకుంటున్నావు అంటాడు రాజ్. తన భర్త కూడా మీలాగే చేశాడంట, తను ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలుసుకోవాలి అంటుంది కావ్య.

ఇప్పుడు నీకు సలహా ఇచ్చి నా గొయ్యి నేనే తవ్వుకోవాలా అంటాడు రాజ్. తర్వాత సోషల్ మీడియాలో కానీ కామన్ ఫ్రెండ్స్ ద్వారా కానీ కాంటాక్ట్ అవ్వచ్చు అని సలహా ఇస్తాడు. సోషల్ మీడియాలో ఎప్పుడో ట్రై చేశాను ఇక కామన్ ఫ్రెండ్స్ ద్వారా ట్రై చేయాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. ఆ తర్వాత ఇంటికి లాయర్ గారు వస్తారు. పిలిస్తేనే గాని రారు అలాంటిది పిలవకుండానే ఇంటికి వచ్చారంటే ఏంటి విశేషం, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని ఇంట్లో వాళ్ళందరూ లాయర్ ని అడుగుతారు.

నేనే రమ్మన్నాను అంటాడు రాజ్. ఇప్పుడు లాయర్ ని పిలిపించవలసిన అవసరం ఏమొచ్చింది, కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అంటుంది చిట్టి. ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు నేను తీసుకున్నవి కావు. ఈ ఇంటి పరువుని బజారున పడేస్తానని నన్ను కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకోమన్నారు, కళ్యాణ్ ని ఆ సీట్లో కూర్చోబెట్టారు. కానీ ఎలాంటి అధికారాలు లేకుండా తను ఆ సీట్లో కూర్చున్నా ఏమీ ఉపయోగం ఉండదు.

Big Twist in Brahmamudi serial April 8th Episode of 378 Raj Resigns as MD of company

అందుకే కళ్యాణ్ పేరుమీద పవర్ ఆఫ్ అటార్నీ రాస్తున్నాను అతనికి చెక్ పవర్ ఇస్తాను అంటాడు రాజ్. ఆ మాటలకి ధాన్యలక్ష్మి, అనామిక ఆనందపడతారు. ఒక్క చెక్ తో నా పుట్టింటి అప్పులన్నీ తీర్చేసుకోవచ్చు అనుకుంటుంది అనామిక. రాజ్ మాటలకి కోప్పడుతుంది చిట్టి, నీ భర్త తీసుకునే నిర్ణయానికి నువ్వైనా అడ్డు చెప్పొచ్చు కదా అని కావ్యతో అంటుంది. నా మాటకి విలువ ఎక్కడ ఉంటుంది, నా భర్త శ్రీరామచంద్రుడు తండ్రి మాటని కాదనలేక రాజ్యాన్నే వదిలేసుకున్నాడు.

మా ఆయన కూడా రాముడు లాగే యుగపురుషుడు ఆయనని నేనేమీ శాసించగలను అంటుంది కావ్య. కళావతి అని బాధగా పిలుస్తాడు రాజ్. ఏమండీ నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా, నేనే కాదు ఇంట్లో వాళ్ళు ఎవరైనా తప్పుగా మాట్లాడారా వాళ్ళు కేవలం ఆ బిడ్డ ఎవరు? ఆ బిడ్డ తల్లి ఎవరు అని మాత్రమే అడుగుతున్నారు. ఆ బిడ్డ కోసం తల్లిని, భార్యని కూడా దూరం చేసుకున్నారు, మీ సర్వస్వాన్ని ఆ బిడ్డ కోసం దారపోస్తున్నారు ఎందుకు, ఇప్పటికైనా నిజం చెప్పండి.

నా భర్తని అంత ఎత్తును చూసిన నేను ఇలా సామాన్యుడిగా చూడలేకపోతున్నాను అంటుంది. అంటే కళ్యాణ్ కి చెక్ పవర్ ఇవ్వడం నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది రుద్రాణి. నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు అని కోప్పడుతుంది కావ్య. నా కాపురంలో తుఫాను చెల్లరేగినప్పటికీ ఇంట్లో ఎలాంటి గొడవలు జరిగినప్పటికీ ఈ ఇంటికి నిజమైన వారసుడు మాత్రం నా భర్తే.

కవి గారికి తన ఆస్తి మొత్తం రాసిచ్చిన నాకు అభ్యంతరం లేదు కానీ తను మాత్రం సింహాసనం మీదే ఉండాలి పరివారం మధ్య కాదు. ఆయన తీసుకున్న నిర్ణయానికి కారణం ఆ బిడ్డ కాబట్టి ఆ సమస్యని పరిష్కరించే దిశగా ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడాలి అంటుంది కావ్య. నీ భార్య బాధని అర్థం చేసుకున్నావా, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు భార్య అంతరంగం కూడా తెలుసుకోవాలి అంటాడు సుభాష్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X