Karthika Deepam వంటలక్కను చంపేదుకు చారుశీల కుట్ర.. కాఫీలో విషం పెట్టి..!
కార్తీకదీపం సీరియల్‌లో మోనిత నియమించిన డాక్టర్ చారుశీల తన కుట్రలను దీపపై ప్రయోగిస్తున్నది. దీపను కార్తీక్ దూరం చేయాలనే ప్లాన్‌లో భాగంగా వంటలక్కకు గుండె జబ్బు ఉంది. ఆమెకు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని అబద్ధం ఆడి.. నకిలీ రిపోర్టులు సృష్టించింది. ఇదిలా ఉండగా తల్లిదండ్రుల కోసం శౌర్య అలియాస్ జ్వాలా తపిస్తున్నది. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1544 లో ఇంకా ఏం జరిగిందంటే?

అమ్మ, నాన్న బతికే ఉన్నారా?
అయితే నా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారనిపిస్తుంది. మరి ఎందుకు హైదరాబాద్ వెళ్లడం లేదు అని పిన్ని చంద్రమ్మతో శౌర్య అనుమానం వ్యక్తం చేసింది. అసలు నా తల్లిదండ్రులు బతికే ఉన్నారా? అని అడిగితే.. బతికి ఉన్నారనే నీ నమ్మాన్ని అలాగే కొనసాగించు అని శౌర్య ప్రశ్నకు చంద్రమ్మ సమాధానం ఇచ్చింది. అయితే తండ్రి కోసం వెతకడానికి హాస్పిటల్‌కు వెళ్దామంటే.. ఇప్పుడే వద్దు రేపు వెళ్దామని ఇంద్రుడు దాటవేసేందుకు ప్రయత్నించాడు.

దీపను కాలానికి వదిలేయకూడదు
దీప ప్రాణాలతో ఉండదని నమ్మించి.. మానసికంగా కుంగదీసి.. మెల్లగా చనిపోయేలా చేద్దామనుకొంటే.. కథ ఇలా అడ్డం తిరిగిందేమిటి? అయితే తాను చనిపోతానని కార్తీక్ చెప్పడం ఏమిటి? ఎవరికైనా మొగుడు చనిపోతాడని అనుకొంటారు. కానీ తన ప్రాణాలకు ప్రమాదం లేదంటే.. మానసిక స్థైర్యం ఉంటుంది. కాబట్టి.. దీప జీవితాన్ని కాలానికి వదిలేయకూడదు. నా చేతిలోకి తీసుకోవాలి. దీనికి పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. ఎవరికి అనుమానం రాకూడదు అని డాక్టర్ చారుశీల మనసులో అనుకొన్నది.

మానసికంగా కుంగదీసి.. చంపాలని..
దీప పోతుందనే ఒకే ఒక అబద్దం.. మానసికంగా కుంగదీసి ప్రాణాలు తీద్దామనుకొంటే.. కార్తీక్ ధైర్యం ఇచ్చాడు. అయితే దీప ప్రాణాలు తీసే పనిని నేనే తీసుకొంటాను అని మనసులో అనుకొంటుండగా.. దీప ఇంటిలో పనిమనిషి పండరి వచ్చింది. నేనే వద్దామనుకొంటున్నా.. నీవే వచ్చావా? ఇంతకు దీప ఆరోగ్యం ఎలా ఉందని అడిగితే.. గుండె ఆపరేషన్ తర్వాత బాగుంటుందనుకొంటే.. వారికి అనేక కష్టాలు వస్తున్నాయి. తన భర్త ప్రాణాలతో ఉండడని తెలిస్తే... ఏ భార్యైనా మామూలుగా ఉంటుందా? ఏ ఆడదైనా తట్టుకొంటుందా? అని పండరి అంది. అయితే దీప ఆరోగ్య పరిస్థితి కూడా దిగజారింది. అయితే ఆమె బతకాలంటే.. ఈ మందులు ఇవ్వాలి అని చారుశీల ప్లాన్ వేసింది.

కాఫీలో ఈ మందు కలిపి అంటూ
దీప ఆరోగ్య పరిస్థితి కార్తీక్ తెలియదు. కాబట్టి కార్తీక్‌కు ఆ విషయం చెప్పాలి. కార్తీక్ ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. పరిస్థితి చెప్పి కార్తీక్‌ను బాధపెట్టలేదు. కార్తీక్ తట్టుకొంటాడని చెప్పి.. ట్యాబ్లెట్లు ఇస్తే.. నీవే లేకపోతే నేను ఎందుకు అని దీప అంటుంది. కాబట్టి ఈ ట్యాబ్లెట్లు నీవే ఇచ్చి.. ఆమెను ఆదుకోవాలి. కాబట్టి నేను ఇచ్చే ట్యాబ్లెట్లు కాఫీలో కలిపి ఇవ్వు. ఈ విషయం కార్తీక్‌కు తెలియకూడదు అని చారుశీల చెప్పింది. దాంతో దీప ప్రాణాలు నిలబెట్టేందుకు మూడో కంటికి కూడా తెలియనివ్వను అని పండరి చెప్పింది. పండరి వెళ్లిన తర్వాత.. ఈ మందులు వాడిన తర్వాత దీప గుండె మరింత బలహీనపడి చావు దగ్గరవుతుంది అని చారుశీల తన ప్లాన్‌ను మనసులో అనుకొన్నది. అయితే కాఫీలో మందు కలిపి దీపకు ఇస్తే.. అనుమానం వ్యక్తం చేసింది.

నేను బతకను అని అబద్ధం ఆడి..
నేను ఎంతోకాలం బతుకను అని కార్తీక్ చెప్పిన మాటలను గుర్తు చేసుకొని దీప ఆందోళన పడింది. నీకు బాగాలేదని చెబితే బాగుండదని.. ఆ అబద్దం నాపై ఆడేసుకొన్నాను. నీకు బాగైన తర్వాత నేను అమ్మ, నాన్నలను, పిల్లలను కలిపిస్తాను అని కార్తీక్ మనసులో అనుకొన్నాను. ఇంకా దాని గురించి ఆలోచించకు అని కార్తీక్ అంటే.. నీకు బాగుందనిపిస్తే.. వారినే ఇక్కడికి రమ్మని చెప్పొచ్చుగా అని అంటే.. ఒకసారి నిజం తెలిసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలవా? నీకు, నాకు ఏదైనా అయితే మన కుటుంబం తట్టుకోలేరు అని కార్తీక్ నచ్చజెప్పాడు.


Click it and Unblock the Notifications











