twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam వంటలక్కకు గుండెపోటు.. చావుబతుకుల్లో దీప.. కార్తీక్ కంటతడి

    |

    దీపకు మందులు ఇవ్వమని చెప్పాను. సరిగా ఇస్తున్నదో లేదో ఫోన్ చేయాలి అని మొబైల్ తీసుకోగానే.. పనిమనిషి పండరి అక్కడికి వచ్చింది. దీపకు మందులు సరిగానే ఇస్తున్నావా? అని చారుశీల అంటే.. అవును.. ఇస్తున్నాను.. కానీ గుండెలో నొప్పి, మంట అంటున్నది అని పండరి చెప్పింది. అయితే నేను ఇచ్చిన మందులు సరిగానే పనిచేస్తున్నాయన్న మాట అని చారుశీల మనసులో అనుకొన్నది. అయితే మందులు వాడిన తర్వాత మంట ఎందుకు వస్తున్నదని పండరి అంటే.. మందులు వాడుతున్నాం కదా.. మంట అలా వచ్చి వెళ్లిపోతుంది. గుండెలో మంట విషయం గురించి కార్తీక్‌కు ఏమైనా చెప్పిందా? అని చారుశీల అడిగితే.. అవును చెప్పింది.. అయితే ఎసిడిటి వల్ల వచ్చిందని కార్తీక్ చెప్పాడు పండరి చెప్పింది. అయితే గుండెల్లో నొప్పి అనగానే పండరి ఉరికి వచ్చింది. ఆ గుండె ఆగిపోతే ఏమైపోతుందో.. మందులు పనిచేయడం మొదలు పెట్టింది కాబట్టి.. ఇవ్వాళో.. రేపో.. దీపకు హార్ట్ ఎటాక్ రావాలి అని చారుశీల మనసులో అనుకొన్నది. కార్తీకదీపం సీరియల్‌లో 1546 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

    కార్తీక్, దీప తప్పించుకు తిరగడంపై

    కార్తీక్, దీప తప్పించుకు తిరగడంపై


    కార్తీక్, దీప ఇక్కడే ఉండి మనకు కనిపించకుండా తప్పించుకొంటున్నారేమో అనే అనుమానం వస్తున్నది అని తండ్రి ఆనందరావు అన్నాడు. దాంతో మనల్ని తప్పించుకోని తిరుగాల్సిన అవసరం వాళ్లకు ఏమున్నది అని సౌందర్య సమాధానం చెప్పింది. ఇందులో అదే అర్ధం కాని ప్రశ్నగా మారింది. వాళ్లిద్దరూ కనిపించకుండా ఉండటానికి ఏదో కారణం ఉంది అని ఆనందరావు అన్నాడు. అయితే మనం వారిద్దరి ఫోటోలు చూపిస్తూ అందర్నీ అడుగుతున్నాం కదా.. జనం చూసినా చెప్పే వారు కదా అని సౌందర్య చెప్పింది. అయితే కార్తీక్, దీప గురించి శివలీల గురించి అడిగితే అసలు విషయం తెలుస్తుందని సౌందర్య, ఆనందరావు ఓ నిర్ణయానికి వచ్చారు.

    యాక్సిడెంట్ తర్వాత అంత పెద్ద ప్రమాదం

    యాక్సిడెంట్ తర్వాత అంత పెద్ద ప్రమాదం

    ఇంద్రుడిని కలిసిన కార్తీక్, దీప.. ఆయనతో మాట్లాడుతూ.. నిన్ను తప్పుగా అపార్థం చేసుకొన్నాం. కానీ మా పాపను మీరు బాగా చూసుకొంటున్నాం. మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది అని దీప చెప్పింది. అయితే మీ పరిస్థితి చూస్తేనే దారుణంగా ఉంది. పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత మళ్లీ అంత పెద్ద ప్రమాదం వచ్చిందంటే చాలా బాధగా ఉంది అని ఇంద్రుడు అంటే.. అలా చెప్పకూడదని కార్తీక్ సైగ చేశాడు. అలాంటి పరిస్థితి నాకు రావడం దురదృష్టకరం అని కార్తీక్ అంటే... గుండె జబ్బు దీపకు కదా.. ఈయన తన మీద వేసుకొన్నాడా? అని ఇంద్రుడు మనసులో అనుకొన్నాడు.

    శౌర్య మీ కుటుంబంతోనే ఉంది అంటూ

    శౌర్య మీ కుటుంబంతోనే ఉంది అంటూ

    శౌర్య గురించి దీప మాట్లాడుతూ.. కనీసం తాత, అమ్మమ్మ వద్ద ఉంచినా బాగుండేది అని అంటే.. ప్రస్తుతం వాళ్లతోనే ఉంటున్నది అని ఇంద్రుడు చెప్పాడు. దాంతో వాళ్లు ఎప్పుడు వచ్చారు అని దీప, కార్తీక్ అడిగితే.. నిన్ననే వచ్చారు. శౌర్య వాళ్లతోనే ఉంటుంది. ఇప్పుడు మీ బిడ్డ పేద వాళ్ల ఇంట్లో ఉండటం లేదు. పెద్ద ఇల్లు తీసుకొన్నారు. వాళ్లతోనే మేము ఉంటున్నాం అని ఇంద్రుడు చెప్పాడు. శౌర్య నానమ్మ, తాతతో ఉంటున్నదంటే.. ప్రాణం లేచి వచ్చిందనిపిస్తున్నది. అందరూ వచ్చారా అని దీప అంది. దాంతో అవును.. అందరూ వచ్చారు అని ఇంద్రుడు చెప్పాడు. అత్త, మామ, హిమను చూడాలని ఉంది అంటే.. ఎప్పుడుపడితే అప్పుడు చూడటానికి కుదరదు అని కార్తీక్ చెప్పాడు. అంతలోనే హిమ అటువైపుగా రావడాన్ని ఇంద్రుడు చూసి కంగారు పడ్డాడు. హిమ ఇటువైపుగా వస్తున్నది మీరు పక్కకు వెళ్లండి అని ఇంద్రుడు అంటే.. వెంటనే దీపను కార్తీక్ పక్కకు తీసుకెళ్తుంటే.. హిమ చూసి.. అమ్మ, డాడీ అంటూ పరుగులు పెట్టింది.

    కార్తీక్, దీపను చూసిన హిమ.. పరుగులు పెట్టి

    కార్తీక్, దీపను చూసిన హిమ.. పరుగులు పెట్టి

    హిమ తమను వెంటాడుతుండటంతో కార్తీక్, దీప చెట్ల మాటున దాక్కున్నారు. అయితే హిమ పరుగులు పెడుతూ వచ్చి.. అమ్మ, డాడీ అంటూ ఏడుస్తూ అటు ఇటూ చూసింది. అయితే హిమను చూసి దీప తట్టుకోలేకపోయింది. హిమను చూడాలి అంటే దీప పట్టుబట్టింది. దాంతో హిమను చూపించలేక తాను తప్పు చేస్తున్నానా అని కార్తీక్ మనసులో అనుకొన్నాడు. అయితే త్వరలోనే మనం మన కుటుంబాన్ని కలుస్తామని కార్తీక్ చెప్పి దీపను ఊరడించే ప్రయత్నం చేశాడు.

    ఈ రోజు దీపకు కచ్చితంగా గుండెపోటు

    ఈ రోజు దీపకు కచ్చితంగా గుండెపోటు

    ఇదిలా ఉండగా, దీపకు నొప్పి వచ్చిందా? ఆమె పరిస్థితి ఎలా ఉందని డాక్టర్ చారుశీల అడిగింది. దాంతో నొప్పి అని ఏమీ చెప్పలేదుని అంటే చారుశీల కంగారు పడింది. నేను ఇచ్చే మందులకు ఈ రోజో.. రేపో.. గుండెపోటు రావాలి. ఎందుకు రాలేదు అని చారుశీల కంగారుపడింది. నేను గుండెపోటు కచ్చితంగా వస్తుందని జైల్లో ఉన్న మోనితకు చెప్పాను. మోనిత ఎదురు చూస్తుంటుందని చారుశీల మనసులో అనుకొన్నది. అయితే చారుశీల ఊహించినట్టే.. దీపకు గుండెపోటు వచ్చింది. అపస్మారక స్థితిలో ఉన్న దీపను పండరి, కార్తీక్ కలిసి హస్పిటల్‌కు తీసుకెళ్లారు.

    గుండెపోటుతో చావు బతుకుల్లో దీప

    గుండెపోటుతో చావు బతుకుల్లో దీప


    కార్తీకదీపం తాజా ప్రోమోలో దీపను హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే దీప ఆరోగ్యం నిలకడగా ఉంది. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు టైమ్ ఉంది. ఈలోగా హార్ట్ దొరుకుతుంది. దీప ప్రాణాలు కాపాడుకోవచ్చు కార్తీక్ అని చారుశీల అంటే.. ష్ ష్ అని కార్తీక్ సైగ చేసి.. దీప వింటుందని అన్నాడు. అయితే దీప ఇప్పుడు స్పృహలో లేదు. ఇంకా మత్తులోనే ఉంది. మనం మాట్లాడుకొనేది వినపడదు అని చారుశీల అంటే.. దీప తను ప్రాణాలతో ఉండదనే విషయం తెలియకూడదు అని కార్తీక్ కంటతడి పెట్టుకొని బయటకు వెళ్లిపోయాడు. అయితే దీప మత్తులో లేదు. అంతా వినపడుతుంది అని చారుశీల మనసులో అనుకొన్నది. ఆ సమయంలో దీప కంటి నుంచి కన్నీరు రావడం కనిపించింది. తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

    English summary
    Karthika Deepam December 27th Episode number 1546
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X