twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam సౌందర్య ఉచ్చులో చిక్కి మోనిత అరెస్ట్.. 10 ఏళ్లు జైలులోనే.. కార్తీకదీపంలో మరో ట్విస్టు!

    |

    సౌందర్య ఇంటి నుంచి బయటపడిన మోనిత నేరుగా తన బోటిక్‌కు వచ్చింది. మోనితను చూడగానే.. ఇన్ని రోజులు ఏమైపోయారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనెక్ట్ కాలేదు అని పనిమనిషి అంటే... నన్ను ఇంటిలో కట్టిపడేసింది. అందుకే ఏం చేయలేకపోయాను. ఇంతకు కార్తీక్ వచ్చాడా? వంటలక్క ఉందా? అని మోనిత అడిగితే.. వారిద్దరూ రాలేదు. గుర్తు కనిపించడం లేదు అని పనిమనిషి చెప్పింది. దాంతో వారిద్దరూ తోడుదొంగలు.. దుర్గ చాప్టర్ క్లోజ్ అయింది. ఇక వాడు కనిపించడు అని మోనిత చెప్పింది. కార్తీకదీపం సీరియల్‌లో 1527 ఎపిసోడ్‌లో ఇంకా ఏమైందంటే?

    సౌందర్యను చూసి మోనిత

    సౌందర్యను చూసి మోనిత

    పనిమనిషితో మాట్లాడుతూనే ఇంట్లోకి వెళ్లి బ్యాగ్, పిస్టల్‌తో బయటకు వచ్చింది. కార్తీక్‌కు యాక్సిడెంట్ అయితే కాపాడాను. కంటికి రెప్పలా చూసుకొన్నాను. కానీ ఇప్పుడు వంటలక్కతో కలిసిపోయాడు. ఇక వారిద్దరిని వదిలేదు. నా బిడ్డను ఒకచోట పెట్టాను. వాడి అడ్రస్ మెసేజ్ చేస్తాను. ఈ బోటిక్ నువ్వే తీసుకో. అకౌంట్ల ఉన్న డబ్బులు నీవే.

    నా కొడుకును అప్పుడప్పుడు వెళ్లి చూసుకో అని మోనిత అంటే.. ఎందుకు మేడమ్.. ఇవన్నీ అని అడిగింది. దాంతో నాకు కార్తీక్ కావాలి అంటూ మోనిత అడుగు ముందుకు వేయగానే.. ఎందురుగా సౌందర్య ఉండటంతో షాక్ తిన్నది.

    సౌందర్యతో పోలీస్ ఆఫీసర్‌ను చూసి

    సౌందర్యతో పోలీస్ ఆఫీసర్‌ను చూసి

    మోనితను చూసి.. అనుకొన్నాను.. నీవు ఇక్కడికే వస్తావని అనుకొన్నాను. ఇంతకు నీవు ఏం చేస్తున్నావు అని సౌందర్య అంటే.. నా వెనుక ఎందుకు పడుతున్నావు అంటీ.. అని మోనిత అంటే.. ఎవరిని చంపడానికి వెళ్తున్నావు అని సౌందర్య ప్రశ్నిస్తే.. ముందు నిన్ను చంపి.. తర్వాతే మరెవరినైనా చంపుతాను.

    నా వెంటపడి తెలిసి తప్పు చేయకండి.. నన్ను ఏమనుకొంటున్నావు.. నాతో పెట్టుకొంటే ముందు నిన్ను చంపుతాను అని సౌందర్య తలకు గురిపెట్టింది. మౌనంగా మోనిత మాటలు ఉన్న సౌందర్య.. పక్కకు తప్పుకోగానే పోలీస్ ఆఫీసర్ వెనుకు నుంచి ముందుకు వచ్చింది. దాంతో మోనిత షాక్ తిన్నది.

    ఎవరిని చంపడానికి వెళ్తున్నావు అంటూ

    ఎవరిని చంపడానికి వెళ్తున్నావు అంటూ

    మోనిత ఇంకా షాక్ నుంచి తేరుకోక ముందే.. పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ.. పోవాల్సింది ఆమె కాదు.. నువ్వు.. జైలుకు. పెరోల్ మీద బయటకు వచ్చి.. తప్పించుకు తిరుగుతున్నావు. జైలుకు వెళ్లకుండా ఇలాంటి వేషాలు వేస్తున్నావు. ఒకరిని చంపిన పాపానికి జైలుకు వెళ్లావు. ఇప్పుడు ఎవరిని చంపుదామని అనుకొంటున్నావు అని ప్రశ్నించింది.

    చేతిలో ఉన్న పిస్టల్ చేతిలోకి తీసుకొని.. ఇది ఎక్కడిది? అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు అరెస్ట్ చేసి.. 10 సంవత్సరాలు జైలులో పెట్టొచ్చు. డాక్టర్ వృత్తి చేయాల్సిన నీవు.. బోటిక్ నడపడం ఏంటి? బటోటిక్ నడపడం వెనుక కారణం ఏమిటి? ఎవరిని చంపడానికి వెళ్తున్నావు అని పోలీస్ ఆఫీసర్ అన్నారు.

    మోనితను అరెస్ట్ చేసి..

    మోనితను అరెస్ట్ చేసి..

    మోనితతో పోలీస్ ఆఫీసర్ ప్రశ్నిస్తూ.. కార్తీక్‌ను ఇంకా మరిచిపోలేదా? అని అంటే.. మీరు డ్యూటీ మరిచిపోవచ్చు.. నీవు లాఠీ మరిచిపోవచ్చు. కానీ నేను కార్తీక్‌ను మరిచిపోను అని మోనిత అంటే.. ఆగండి పోలీస్ ఆఫీసర్.. ముందు ఆనంద్ ఎక్కడున్నాడో చెప్పు.. నీవు చేసిన పాపానికి వాడు శిక్ష అనుభవించొద్దు అని సౌందర్య అంటే.. వాడు ఎవరి వద్ద పెరిగినా సరే.. నీ వద్ద పెరుగొద్దు.. అలా పెరిగితే.. వాడి దృష్టిలో నేను రాక్షసి అవుతాను.

    నేను అరెస్ట్ చేయించావని సంబరపడకు. మళ్లీ వస్తాను అని మోనిత అంటే.. అది తేల్చాల్సింది మేము అంటూ పోలీస్ ఆఫీసర్ మోనితను అరెస్ట్ చేసి.. కారు ఎక్కించారు.

    దీపకు మరో అరుదైన జబ్బు

    దీపకు మరో అరుదైన జబ్బు

    ఇదిలా ఉండగా, కార్తీకదీపం సీరియల్‌లో మరో ట్విస్టు కనిపించింది. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లిన కార్తీక్‌కు మోనిత అరెస్ట్ విషయం తెలిసిందే. పోలీస్ ఆఫీసర్, మరో పెద్దావిడ వచ్చి తీసుకెళ్లారు అని చెప్పారు. దాంతో బ్యాగ్ తీసుకొని దీప వద్దకు వచ్చి.. వెళ్లిపోదామని చెప్పారు. ఈ రోజే డిశ్చార్జ్ చేయమని అంటే.. రెండు రోజులు ఆగి డిశ్చార్జ్ చేద్దాం. కొన్ని టెస్టులు చేశాం.. వాటి రిపోర్టులు వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అని డాక్టర్ చెప్పింది. అయితే రిపోర్టులు చూడగానే డాక్టర్ షాక్ తిన్నది. ఈ విషయం కార్తీక్‌కు చెబితే తట్టుకోగలడా? అని సందేహంలో పడింది.

    English summary
    Karthika Deepam December 5th Episode number 1527.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X