Exclusive: మోనాల్, అమ్మా రాజశేఖర్ సేఫ్.. ఈ వారం ఎలిమినేషనల్‌లో ఏం జరిగిందంటే..

By Manoj Kumar P

తెలుగులోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మరే షోకూ దక్కని రెస్పాన్స్ అందుకుంది బిగ్ బాస్. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సీజన్లనూ అదే రీతిలో ఆదరించారు ఇక్కడి ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఇటీవల ప్రారంభం అయిన నాలుగో సీజన్‌ను సైతం విజయవంతం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ నోయల్ అనారోగ్య కారణాలతో షో నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీని ప్రభావం ఈ వారం ఎలిమినేషన్ మీద పడింది. దీంతో షోలో ఊహించని పరిణామం జరగబోతుందని ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

అన్నింటినీ మించిన రెస్పాన్స్‌తో స్టార్ట్

అన్నింటినీ మించిన రెస్పాన్స్‌తో స్టార్ట్

బిగ్ బాస్ షో తెలుగులో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే నాలుగో సీజన్‌ను కూడా మొదలెట్టేశారు షో నిర్వహకులు. గత నెలలో మొదలైన ఈ సీజన్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. నాగార్జున సారథ్యంలో అంగరంగ వైభవంగా జరిగిన ప్రీమియర్ ఎపిసోడ్‌ను తెలుగు ప్రేక్షకుల ఆదరించడంతో దీనికి రికార్డు స్థాయిలో రేటింగ్ లభించింది.

రేటింగ్ కోసం ట్రిక్స్.. విమర్శల పాలు

రేటింగ్ కోసం ట్రిక్స్.. విమర్శల పాలు

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో రెట్టించిన వినోదాన్ని చూపిస్తామని నిర్వహకులు షో ఆరంభానికి ముందే చెప్పారు. అందుకు అనుగుణంగానే ఈ సీజన్‌లో మసాలాను ఎక్కువగా చూపిస్తున్నారు. అదే సమయంలో కొంత మందికి ఇబ్బందులు కలిగేలా హైలైట్ చేస్తున్నారు. దీంతో ఆ కంటెస్టెంట్లకు చెడ్డ పేరు వస్తోంది. ఇలా బిగ్ బాస్ చేసే పనులు వల్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎలిమినేషన్ విషయంలో అనుమానం

ఎలిమినేషన్ విషయంలో అనుమానం

గత సీజన్లతో పోలిస్తే ఈ సారి ఎలిమినేషన్ విధానంపై ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. దీనికి కారణం ప్రజాధరణ ఎక్కువగా ఉన్న పలువురు కంటెస్టెంట్లు షో నుంచి బయటకు వెళ్లిపోవడమే. దేవీ నాగవల్లి, కుమార్ సాయి, దివి ఈ జాబితాలోకే వస్తారు. వీళ్ల ముగ్గురి ఎలిమినేషన్ వల్ల బిగ్ బాస్ ఓటింగ్ సిస్టమ్‌పై ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలైన విషయం తెలిసిందే.

షో నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుట్

షో నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుట్

ఈ సీజన్‌లోని టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా ఎంట్రీ ఇచ్చాడు సింగర్ నోయల్. దాదాపు యాభై రోజుల పాటు హౌస్‌లో కొనసాగుతూ వచ్చిన అతడు.. అనారోగ్య కారణాలతో షో నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే, అతడు తిరిగి వస్తాడని అంతా అనుకున్నారు. కానీ, శనివారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్‌లో నోయల్ మొత్తానికి వెళ్లిపోతున్నాడని నాగార్జున వెల్లడించాడు.

బిగ్ బాస్ ఎలిమినేషన్‌లో భారీ ట్విస్ట్

బిగ్ బాస్ ఎలిమినేషన్‌లో భారీ ట్విస్ట్

గత వారం నామినేషన్ ప్రక్రియలో మోనాల్ గజ్జర్, మెహబూబ్, అఖిల్ సార్థక్, లాస్య, అమ్మ రాజశేఖర్, ఆరియానా గ్లోరీ ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. వీరిలో అఖిల్, లాస్య సేవ్ అయినట్లు శనివారం ఎపిసోడ్‌లో నాగ్ పేర్కొన్నాడు. ఇక, మిగిలిన వాళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో షోలో పెద్ద ట్విస్ట్ నెలకొంది.

నోయల్ వెళ్లిపోవడంతో మారిన ఫలితం.!

నోయల్ వెళ్లిపోవడంతో మారిన ఫలితం.!

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఈ వారం ఎలిమినేషన్ జరగడం లేదు. అంటే నామినేషన్‌లో ఉన్న మిగిలిన నలుగురు కంటెస్టెంట్లు మోనాల్, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, ఆరియానా సేవ్ అయ్యారు. దీనికి కారణం హౌస్‌మేట్లలో ఒకడైన నోయల్ బయటకు వెళ్లిపోవడమే అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆదివారం జరిగే ఎపిసోడ్ చివర్లో రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X