Guppedantha Manasu నేను నమ్మిన వారే మోసగించారు.. వసుధార, ఏంజెల్‌కు మధ్య నలిగిన రిషి

వసుధార ఇచ్చిన ప్లాన్ ప్రకారం రిషిని క్యాండిల్ లైట్ డిన్నర్‌కు ఆహ్వానించిన ఏంజెల్‌కు చేదు అనుభవం ఎదురైంది. విందుకు ఆహ్వానించడంతో నొచ్చుకొన్న రిషి.. ఎవరి హద్దుల్లో వారు ఉండాలని హెచ్చరించడంతో ఏంజెల్ మనస్తాపానికి గురైంది. దాంతో వసుధార ఇచ్చే ప్లాన్స్ బాగున్నాయి. కానీ ఎందుకు వర్కవుట్ కావడం లేదనే ఆలోచనల్లో పడింది. అంతలోనే తన పెంపుడు తండ్రి విశ్వం రావడం.. ఏంజెల్‌ను ఏదో ఆలోచనల్లో ఉన్నావని పలకరించాడు. అయితే ఏమీ లేదని చెప్పడంతో.. నీ తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి నీ బాగోగులు చూసుకోవాల్సిన పని నాదే. అందుకే నేను అడిగాను అంటే.. నాకు బాగోగులు చూసుకొంటున్న నీకు నేను కూడా ఆసరాగా ఉండాలి కదా.. నీ ఆరోగ్యం ఎలా ఉందని పలకరించింది. బీపీ చెక్ చేస్తానంటూ ప్రేమను కురిపించింది. విశ్వం వెళ్లిన తర్వాత వసుధార సాయం తీసుకోవాలి అంటూ ఫోన్ కలిపే ప్రయత్నం చేసింది. గుప్పెడంత మనసు సీరియల్‌లోని 854 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

రిషి గురించి ఏంజెల్ ఆలోచిస్తూ.. ఎలాగైనా పెళ్లి విషయం గురించి చెప్పాలి. పెళ్లి చేసుకొంటాడా? లేదా అనే విషయాన్ని తేల్చుకోవాలి. ఒకవేళ పెళ్లి చేసుకోనంటే ఎందుకు చేసుకోవడం లేదో కారణం తెలుసుకోవాలి అని మనసులో అనుకొన్నది. తాను బయట పడకపోతే.. కారణం చెప్పేంత వరకు రిషిని వదిలిపెట్టను. ఈ రోజు ఈ విషయం తేలిపోవాల్సిందే అంటూ ఏంజెల్ ఫిక్స్ అయింది.

Big Twist in Guppedantha Manasu serial 854 Episode on August 29th

ఒకరికొకరం మనసులు తెలుసుకోవాలనే ఏంజెల్ మాటలు గుర్తు చేసుకొన్న రిషి.. ఆ ఇంట్లోకి వెళ్లకుండా ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తున్నది. కానీ అలా చేయలేను. అలా చేస్తే.. స్టూడెంట్, కాలేజ్ భవిష్యత్తు పాడు చేసినట్టు అవుతుంది. ఇక్కడే ఉంటూ నరకాన్ని భరించలేకపోతున్నాను. అసలు నాకే ఎందుకు జరుగుతున్నది అని రిషి మదనపడిపోయాడు. అయితే రిషి ఇంకా రాకపోవడంతో ఏంజెల్ ఫోన్ చేసేందుకు ప్రయత్నించి విరమించుకొన్నది. ఫోన్ చేస్తే కోపం తెచ్చుకొంటాడు అని ఫోన్ పెట్టేసింది.

రిషి ఇంకా కాలేజీలో ఉండటం చూసి వసుధార పలకరించింది. తన గదిలోకి వచ్చిన వసుధారను చూసి ఏమిటి? అని అడిగాడు. దాంతో ఇంకా ఇంటికి వెళ్లలేదు అని అడిగితే.. వెళ్లాలని లేదని ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు. ఇంకా ఏదైనా పని మిగిలి ఉందా? అంటే.. నాకు పని ఉంది అని రిషి సమాధానం చెప్పాడు. దాంతో నీకు ఏదైనా సాయం చేయాలా? అని వసుధార అంటే.. సాయం అవసరం లేదు. ఒకరి పనుల్లో జోక్యం చేసుకోవద్దు అంటూ ఏంజెల్‌కు చేసిన సాయంపై రిషి సెటైర్ విసిరాడు. దాంతో స్టూడెంట్‌కు క్లాస్ తీసుకోలేదా.. నాకు ఎందుకు క్లాస్ తీసుకొంటున్నారు అని వసుధార రివర్స్‌గా సెటైర్ వేసింది. దాంతో ఓ లుక్ విసిరేసి వసుధార వెళ్లింది.

Big Twist in Guppedantha Manasu serial 854 Episode on August 29th

వసుధార వెళ్లిన తర్వాత రిషి తన మనసులో అనుకొంటూ.. ఆ కళ్లతోనే ఎన్నో విషయాలు చెప్పింది. ఆ కళ్లతోనే నా ప్రాణమైంది. ఇప్పుడు ఆ కళ్లతోనే వేరే వాళ్లకు లొంగిపోమ్మని చెబుతుందా? వసుధార ఎందుకిలా అయింది అని రిషి మనసులో అనుకొన్నాడు. అలా ఆలోచించుకొంటూ వసుధార బొమ్మను గీసాడు. అంతలోనే కరెంట్ పోవడంతో అక్కడి నుంచి బయటకు వెళ్లాడు. ఇంటికి రిషి రాకపోవడంతో ఏంజెల్ కాల్ చేసింది. ఏంజెల్ కాల్‌ను కట్ చేసి.. ఇంటికి వెళ్లాలని లేదని మనసులో అనుకొన్నాడు.

Big Twist in Guppedantha Manasu serial 854 Episode on August 29th

ఏంజెల్ పడుతున్న ఆవేదన గురించి రిషి ఎమోషనల్ అయ్యాడు. నా మనసులో ఉన్నవారు. నాకు దగ్గరైన వారు నాకు మోసం చేశారు. నా మనసులో లేని వారు నాకు దగ్గర కావాలనుకొంటున్నారు. దేవుడా నాకు ఎందుకీ పరిస్థితి. నేను ఎక్కడికవి వెళ్లాలో తెలియడం లేదు అంటూ కారు ఓ చోట ఆపి భావోద్వేగానికి రిషి గురయ్యాడు. అలా నడుస్తూ వసుధార ఇంటి వద్దకు చేరుకొన్నాడు. నేను వసుధార ఇంటికి వచ్చానేంటి? ఏంజెల్ విషయంలో వసుధారను తెలుసుకోవాలి అంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. అప్పుడే భోజనం ఏర్పాట్లు చేస్తున్న రిషిని చూసి వసుధార ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత ఇంట్లోకి పిలిచి భోజనం చేయమని వసుధార తండ్రి చెప్పాడు. దాంతో మేడమ్‌తో మాట్లాడాలని వచ్చాను. మీరు భోజనం చేయండి. నేను బయట కూర్చొంటాను అని రిషి అన్నాడు.

రిషి బయటకు వెళ్తుంటే.. మీరు కూడా భోజనం చేయండి. మేము విషయం పెట్టం. ప్రేమతో భోజనం పెడుతాం అని వసు అంటే.. అల్లుడితో అలానే మాట్లాడుతావా? అని అంటే.. లేకపోతే ఏంటి నాన్న.. భోజనం చేయమంటే.. అలా బిహేవ్ చేస్తాడా? అని అంటే.. లేదు.. నేను వసుధారతో మాట్లాడటానికి వచ్చాను అంటే.. మీరు భోజనం చేస్తే నేను నీతో మాట్లాడుతాను అంటూ రిషికి వసుధార కండిషన్ పెట్టింది. అయితే పెద్దవారిని మనసు నొప్పించను అంటూ రిషి భోజనం చేయడానికి సిద్దమయ్యాడు. వసుధార భోజనం చేయకుండా ఉంటే.. మీకు సపరేట్‌గా చెప్పాలా? మీరు కూడా భోజనం ప్లేట్ తెచ్చుకొండి అంటూ రిషి చెప్పారు.

Big Twist in Guppedantha Manasu serial 854 Episode on August 29th

రిషి, వసుధార పక్కన పక్కన కూర్చొని ఉంటే.. తండ్రిగా చాలా ఆనందంగా ఉంది. మీరిద్దరూ కలిసి ఇలా ఉండాలని కోరుకొంటున్నాను. మీ ఇద్దరికి పెళ్లి చేయించాలని అనుకొంటున్నాను. మీరిద్దరూ హ్యాపీగా ఉంటే చాలూ నాకు అని వసుధార తండ్రి అంటూ ఎమోషనల్ అయ్యాడు. భోజనం చేస్తుండగా వసుధార ఇంటికి ఏంజెల్ వచ్చింది. దాంతో నేను ఇక్కడ ఉన్నానంటే.. అనుమానం వస్తుంది అని రిషి అంటే.. పక్క గదిలోకి వెళ్లి దాచుకో అని చెప్పింది. అంతలోనే ఏంజెల్ వచ్చి.. రిషి ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. రిషి ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్ధం కాలేదు. ఇంకా రాలేదంటే. కంగారుగా ఉంది. రిషి గురించి నీకు ఏమైనా తెలుసా అని వసుధారను ఏంజెల్ అడిగింది. దాంతో ఎపిసోడ్లో ట్విస్ట్ పెట్టి ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X