Guppedantha Manasu పరధ్యానం కాదు.. నీ ధ్యానం.. వసుధార నడుము చుట్టు రిషి చేయి వేసి..!

తన రూమ్‌లోకి పర్మిషన్ లేకుండా వచ్చి గొడవ చేసిన సాక్షిని బయటకు వెళ్లమని రిషి వార్నింగ్ ఇవ్వడంతో బయటకు వచ్చిన ఆమెకు వసుధార కనిపించింది. వసుధారను చూసిన వెంటనే మండిపడుతూ.. అంతా నీ వల్లనే జరుగుతున్నది. నీ వల్లనే మా మధ్య సమస్యలు అని సాక్షి అంటే.. నేను ఏం చేశాను అని వసుధార అంటే.. నీ వల్లే రిషి చేజారిపోతున్నాడు అని అంటే.. సాక్షి ఆగుతావా అంటూ నచ్చ జెప్పేందుకు ప్రయత్నించింది. అంతలోనే రిషి బయటకు వచ్చి వారి గొడవను చూశాడు. అయితే మాతో చిన్నపని ఉందని వచ్చింది అని జగతి అంటే.. నేను ఏమీ అడుగలేదు అని రిషి సీరియస్‌గా సమాధానం చెప్పాడు. గుప్పెడంత మనసు సీరియల్ తాజా ఎపిసోడ్ 525‌లో ఏం జరిగిందంటే..

 Guppedantha Manasu

సాక్షి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత వసుధార స్పందిస్తూ. రిషితో నేను మాట్లాడుతాను అని అంటే.. నీకు విషయం అర్ధం కావడం లేదా అని జగతి ప్రశ్నిస్తే.. అసలు రిషి సార్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకొన్నాడో. ఎందుకు సాక్షిని పెళ్లి చేసుకొంటానని ఒప్పుకొన్నాడో అని అడుగుతా అని సమాధానం ఇచ్చింది. దాంతో వద్దు.. రిషి చాలా డిస్ట్రబ్‌గా ఉన్నాడు. నీవు రిషిని చూడటానికి వచ్చావు. అంతేగానీ నీవు డిస్ట్రబ్ చేయకు. రిషిని డిస్ట్రబ్ చేస్తే ఊహించని పరిణామాలు చోటుచేసుకొంటాయి అని వసుధారకు జగతి సమాధానం ఇచ్చింది. దాంతో నేను అడగను మేడమ్ అంటూ వసుధార అక్కడిని నుంచి వెళ్లిపోయింది. అయితే మెట్ల మీద నడుచుకొంటూ జారిపడి పోతుండటంతో వసుధారను రిషి నడుము చుట్టు చేయి వేసి పట్టుకొన్నాడు.దాంతో చూసుకోలేదు సార్ అని వసుధార అంటే.. ఆ పరధ్యానం ఏమిటి అని రిషి ప్రశ్నిస్తే.. పరధ్యానం లేదు సార్.. అంతా మీ ధ్యానమే అని వసుధార అంటే.. ఏమిటి అని రిషి మళ్లీ అడిగాడు.. అయితే నీకు వినపడిందని నాకు తెలుసు. కానీ నీతో ఒకసారి మాట్లాడాలి అని వసుధార అడిగింది. అంతలోనే పెద్దమ్మ వచ్చి.. సాక్షి పేరెంట్స్ ముహుర్తం పెట్టుకోవడానికి వస్తున్నారు అని అంటే.. సరే.. నాకు పని ఉందని రిషి వెళ్లిపోయాడు.

రిషి కారులో వెళ్తుండగా.. వసుధార ఎదురు పడింది. వసుధారను చూసి ఏమిటి ఇలా వస్తుంది అని రిషి మనసులో అనుకొన్నాడు. అయితే మీతో మాట్లాడాలి రిషి సార్ అని వసుధార అంటే.. ఇప్పడే కలిశాం కదా అని రిషి అన్నాడు. అయితే ఇంట్లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అందుకే కొన్ని అడగాలనుకొంటున్నాను అంటే. నీవు ఏమి మాట్లాడాలని అనుకొంటున్నావో నాకు తెలుసు. నేను ఎవరికి సంజాయిషీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని రిషి బదులిచ్చాడు. నేను ఒక నిర్ణయం తీసుకొనే ముందు రకరకాలుగా ఆలోచిస్తాను. నాకు ఎవరు చెప్పనక్కర్లేదు అని రిషి అంటే.. సాక్షి ఎలాంటిదో నీకు తెలుసు. ఆమె ఎలా మాట్లాడిందో తెలుసు. అయినా సాక్షిని పెళ్లి చేసుకొవడం ఏమిటి అంటే.. కొన్ని సార్లు మన ప్రమేయం లేకుండానే అడుగులు వేయాల్సి వస్తుంది. నేను తప్పుడు నిర్ణయం తీసుకొంటానని నీవు ఎలా అనుకొంటున్నావు. నా నిర్ణయాన్ని క్లారిటీ తీసుకొన్నాను అని రిషి అన్నాడు.

మీరు తీసుకొన్న నిర్ణయం తప్పు.మీరు వెళ్లే దారి కరెక్ట్ కాదు. అందుకే నేను మీకు గుర్తు చేద్దామని అనుకొంటున్నాను అని వసుధార అంటే.. నేను తీసుకొన్న నిర్ణయం కరెక్టే. నీవు గతంలో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకో అని రిషి అన్నాడు. గతంలో నీకు నాపై ప్రేమ లేదు. సాక్షిని సాధించడానికే నాతో ప్రేమ అని చెబుతున్నారనే మాటలను వసుధార గుర్తు చేసుకొన్నది. అయితే వసుధార ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే.. రిషి కారు వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X