Guppedantha Manasu రిషి పెళ్లి ఆగిపోతే స్వీట్లు పంచుకొంటారా? జగతికి దేవయాని షాక్
రిషితో సాక్షి నిశ్చితార్థం రసభాసగా మారింది. నిశ్చితార్థం సమయంలో చేతికి తొడిగే ఉంగరంపై S అక్షరానికి బదులు V అనే అక్షరం ఉండటంతో సాక్షి నివ్వెరపోయింది. నిశ్చితార్థం ఉంగరంపై V అనే అక్షరం ఎలా రాయిస్తారని రిషిని ప్రశ్నించింది. అయితే సాక్షి నిలదీయడంతో ఏం చెప్పాల్లో తెలియక..అలా జరిగిపోయిందని రిషి సమాధానం ఇచ్చాడు. దాంతో రిషితో పెళ్లి నాకు ఇష్టం లేదు అని సాక్షి తెగేసి చెప్పింది. అలా సాక్షి, రిషిల పెళ్లి ఆగిపోయింది. గుప్పెండంత మనసు సీరియల్ తాజా ఎపిసోడ్ 531 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

గుణపాఠం నేర్పావు అని సాక్షి
అయితే రిషి తనకు చేసిన ద్రోహానికి సాక్షి మండిపడింది. నీ కోసం లండన్ నుంచి వచ్చి నేను మోసపోయాను. నీ కోసం లండన్ నుంచి రావడమేమిటి? నాకు సరైనా గుణపాఠం నేర్పావు. అయితే నిన్ను పెళ్లి చేసుకోకపోయినా నిన్ను మాత్రం వదిలిపెట్టను అంటూ సాక్షి తన మనసులో శపథం చేసుకొన్నది.

స్వీట్లు పంచుకొందామా? అంటూ
అయితే సాక్షితో రిషి నిశ్చితార్థం ఆగిపోవడంతో గౌతమ్, జగతి, మహేంద్ర, ధరణి ఆనందంలో మునిగిపోయారు. అయితే ఈ శుభ సందర్భంలో స్వీట్లు పంచుకొందామా అని గౌతమ్ అడగడంతో జగతి కూడా సరేనన్నది. అంతలోనే దేవయాని వచ్చి.. ఏం జగతి... రిషి పెళ్లి ఆగిపోతే మీరు స్వీట్లు పంచుకొంటారా? అని ప్రశ్నించింది.దాంతో గౌతమ్ అడిగితే కాదనలేకపోయాను అని జగతి సమాధానం ఇచ్చింది.

నీకైనా బుద్ది ఉండాలి అంటూ దేవయాని
రిషి పెళ్లి ఆగిపోయిన సందర్భంలో గౌతమ్ స్వీట్లు అడిగితే.. నువ్వు ఎలా సరే అంటావు. కనీసం నీకైనా బుద్ధి ఉండాలి కదా. నువ్వే తగుదున్నమ్మా అంటూ పార్టీలు, స్వీట్లు అంటే ఎలా.. ఇలాంటి సమయంలోనే ఎవరి బుద్ది ఎలా అనేది బయటపడుతుంది అని దేవయాని ఘాటుగా స్పందించింది. అందుకు దేవయాని స్పందిస్తూ.. అవును కరెక్టే.. చాలా బాగా చెప్పారు. మీ బుద్ది గురించి మాట్లాడే బుద్ది నాకు లేదనుకొంటాను. మీరు పెద్ద వారు.. ఏ విషయంలోనైనా మీరే గొప్ప అని నమ్ముతాను అని అన్నారు.

పెద్దమ్మను అనాలంటే.. నన్ను దాటి
అయితే దేవయానిని గౌతమ్, జగతి ఏదో అంటుంటే.. రిషి వచ్చి.. ఏం మాట్లాడుతున్నావురా గౌతమ్.. పెద్దమ్మను ఏదైనా అనాలంటే.. నన్ను దాటి వెళ్లాలి అని రిషి అన్నాడు. దాంతో రిషి కామెంట్‌కు ఏడ్వాలో నవ్వాలో తెలియని పరిస్థితి. నా మాట కోసం రిషిని పెళ్లి చేసుకొంటానని అన్నాడు. కానీ రిషిని కాదని సాక్షి వెళ్లింది. అయితే నేను ఈ పరిస్థితులను నాకు అనుకూలంగా మార్చుకొంటాను అని దేవయాని మనసులో అనుకొన్నది.

వసుధార వద్దకు రిషి
నిశ్చితార్థం ఉంగరంపై V అనే అక్షరం ఉండటం చూసి వసుధార ఆనందంలో మునిగిపోయింది. ఒకసారి నాకు గిఫ్టు ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. ఇప్పుడు ఉంగరంపై V అక్షరం రాయించి అని మనసులో అనుకొంటుండగా..రిషి నుంచి ఫోన్ వచ్చింది. ఆటో నుంచి దిగిపో అని రిషి చెబితే.. అక్కడే దిగిపోయింది. ఆ తర్వాత కారులో వచ్చిన రిషి.. వసుధారను ఎక్కించుకొని వెళ్లిపోయాడు.

రెస్టారెంట్‌లో రిషి, వసుధారను చూసి
అయితే రిషి పెళ్లి ఎత్తిపోవడంతో జగతి, మహేంద్ర, గౌతమ్ హోటల్‌కు వెళ్లి పార్టీ చేసుకోవడానికి సిద్దమయ్యారు. రెండు కేకులు కట్ చేద్దామని అనుకొంటుండగా.. అదే సమయంలో రిషి, వసుధార అక్కడికి రావడంతో ముగ్గురు చూసి కంగారు పడ్డారు. గౌతమ్, జగతి, మహేంద్రను చూసి రిషి, వసుధార కూడా షాక్ తిన్నారు. వీరిద్దరు ఎప్పుడు కలిశారు. వీళ్లు మరో కేక్ కట్ చేయమంటారేమో అని అన్నారు.

రిషిపై తల్లి ప్రేమను చూపించిన జగతి
ఇదిలా ఉండగా, తాజా గుప్పెడంత మనసు ప్రోమోలో.. తన తల్లి జగతి పట్ల రిషికి కొంత సానుకూలత చూపించాడు. ఇంట్లో కిచెన్‌లో కాఫీ కావాలని రిషి అంటే.. రిషి సార్ నేను కాఫి పెట్టించి ఇవ్వాలా అని జగతి అడిగింది. అయితే జగతి మేడమ్.. మీరు సార్ అని ఇక నుంచి పిలవకండి. రిషి అని పిలిస్తే చాలూ అని రిషి చెప్పాడు. దాంతో అలాగే రిషి.. నేను కాఫీ పెట్టిస్తాను అంటూ జగతి ఆనందంలో మునిగిపోయింది.


Click it and Unblock the Notifications











