Brahmamudi June 26th Episode : రాహుల్ చెంప పగలగొట్టిన రుద్రాణి.. పెళ్లాం కొంగు చాటున రాజ్.. ఏం జరిగిందంటే?

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్ లో బ్రహ్మాముడి ఒకటి. శనివారం నాడు జరిగిన ఎపిసోడ్ లో స్వప్న తనను రాహుల్ పట్టించుకోవడం లేదని ఇంట్లో కంప్లైంట్ చేస్తుంది. తనకు ఆశలు కోరికలు ఉంటాయని అందరి ముందు చెబుతూ బాధపడుతుంది. ఈ సీన్ తో ఎపిసోడ్ మొదలు అవుతుంది. ఇక పూర్తి ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే...

స్వప్నమాటలకు ఇంట్లో వాళ్లు మద్ధతు:ఇక స్వప్న మాటలు విన్న ఇంట్లో వాళ్ళు ఆమెకు మద్దతుగా మాట్లాడుతారు. రుద్రాణి రాహుల్ పై అందరూ ఫైర్ అవుతారు. రాహుల్ త్వరగా రావాలని రుద్రాణి మీద సుభాష్ సీరియస్ అవుతాడు. ఇది ఆడవాళ్ళ ముందు చెప్పుకునే సమస్య అందరి ముందు స్వప్న బయట పెట్టిందంటే రాహుల్ ఘనకార్యం ఏంటో అర్థం అవుతుందని అపర్ణ అంటుంది. ఇంట్లో మనిషికో మాట అంటారు. రాహుల్ స్వప్నను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని రుద్రాణిని నిలదీస్తారు.

Big Twist in Jane 24th 2023 Episode number 193 in Brahmamudi Telugu Serial

రాహుల్ ఎంట్రీ.. అందరూ ఫైర్:ఓవైపు ఇలా ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటుండగానే రావాలి వస్తాడు. అందరూ ఉండడానికి చూసి షాక్ అయి.. ఈ రాక్షసి పెంట పెట్టినట్లు ఉందని మనిషిలో అనుకుంటుండగా... ఎక్కడికెళ్లావురా అని రాజ్ ప్రశ్నిస్తాడు. పని మీద బయటికి వెళ్లాను అని చెబుతుండగా.. రాజ్ ఈ లోపు ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని ఇంత సీన్ క్రియేట్ చేసిందని రాహుల్ చెప్పగా.. స్వప్న వచ్చి సీరియస్ గా మాట్లాడుతుంది. పెళ్లాం ఫోన్ చేస్తే.. లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటే.. కనీసం మెసేజ్ అయినా పెట్టొచ్చు అని అడుగుతుంది. నీకు అలుసు అయిపోయానని బాధపడుతుంది. భార్యను పట్టించుకోనంత పని నీకు ఏం ఉందని అందరూ తిడతారు. ఈ ఇంట్లో కొడుకుకు ఎంత విలువ ఇస్తామో.. కోడళ్లకు అంతే ఇస్తామని దుగ్గిరాల సీతారామయ్య చెప్పుకొస్తాడు.

Big Twist in Jane 24th 2023 Episode number 193 in Brahmamudi Telugu Serial

రాహుల్ చెంప పగులగొట్టిన రుద్రాణి:ఇక రాహుల్ మాట్లాడటం మెుదలపెడతాడు. నీ కడుపు నిండిపోయిందా అని స్వప్నతో అంటాడు. అందరి ముందు ఫుల్ చేసేవరకూ నీకు మనశ్శాంతి లేదా అని అడుగుతాడు. అసలు బుద్ధి ఉందా అని స్వప్నతో అంటుండగా.. రుద్రాణి వచ్చి రాహుల్ చెంప పగలగొడుతుంది. మమ్మీ అనగా.. షటప్.. నా పరువు తీస్తున్నావ్ అంటుంది. ఇంకోసారి కంప్లైంట్ వస్తే.. ఇద్దరినీ బయటకు పంపించేస్తానని కొడుకుకు రుద్రాణి వార్నింగ్ ఇస్తుంది.

Big Twist in Jane 24th 2023 Episode number 193 in Brahmamudi Telugu Serial

పెళ్లాం కొంగుచాటున రాహుల్:మరోవైపు కావ్య లేట్ గా నిద్రలేస్తుంది. ధాన్యలక్ష్మి కావ్యని పిలిస్తూ రావడం విని హడావుడిగా పరుపు దాచేస్తుంది. అది చూసి ఎందుకు ఇలా చేస్తున్నావని రాజ్ అడుగుతాడు. అప్పుడే పిన్ని పిలుపు విని వామ్మో ఇప్పుడు పరుపు చూసిందంటే లేని కష్టాలు కూడా ఉన్నాయని పడుకుని మరీ చూపిస్తుందని టెన్షన్ పడతాడు. పరుపు కబోర్డులో తోయడానికి ట్రై చేస్తుంటే సరిగ్గా అప్పుడే ధాన్యలక్ష్మి గదిలోకి వచ్చేస్తుంది. దీంతో రాజ్ పెళ్ళాం కొంగు చాటున మొహం పెట్టేసుకుంటాడు. నేనేం చూడలేదు అంటూ.. ధాన్యలక్ష్మి వెళ్లిపోతుంది.

Big Twist in Jane 24th 2023 Episode number 193 in Brahmamudi Telugu Serial

కనకం ఇంటికి పోలీసులు:ఇదిలా ఉంటే కనకం ఇంటికి పోలీసులు వస్తారు. వాళ్ళని చూసి మీనాక్షి వణికిపోతుంది. వడ్డీ వ్యాపారి కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని పోలీసులు చెప్తారు. సేటు మూటలో నుంచి పాకుతూ బయటకి రావడానికి ట్రై చేస్తాడు. సరిగ్గా అప్పుడే సేటు ఉన్న మూట దొర్లుకుంటూ హాల్లోకి వస్తుంది. అది చూసి కనకం వాడిని తన్నేస్తుంది. వాళ్ళని డైవర్ట్ చేయడానికి మీనాక్షి తిక్కతిక్కగా ఏదేదో వాగుతూ బుర్రలు తినేస్తుంది.

Big Twist in Jane 24th 2023 Episode number 193 in Brahmamudi Telugu Serial

రాహుల్ కు తల్లి హితబోధ:సీన్ కట్ చేస్తే... రాహుల్ కోపంగా ఉంటే రుద్రాణి వస్తుంది. ఎందుకు వచ్చావ్ మళ్ళీ కొట్టడానికా అని తిడతాడు. ఒకవైపు రాజ్, ఇంట్లో వాళ్ళు నన్ను టార్చర్ చేస్తుంటే నువ్వు కూడా నన్ను కొట్టావని బాధపడతాడు. నువ్వు టైమ్ కి ఇంటికి వచ్చి ఆ స్వప్నతో మంచిగా ఉంటే బాగుండేది కదా అని అంటుంది. అది తన వల్ల కాదని తనతో కాపురం చేయడం ఇష్టం లేదని చెప్తాడు. స్వప్న నీకు నచ్చకపోయినా సరే తనని భరించకతప్పదని చెప్తుంది. స్వప్నతో బాగా ఉన్నట్టుగా నటించమని అంటుంది రుద్రాణి. రాజ్ కి జరిగిన అన్యాయం నీకు జరగలేదని, నువ్వే దానికి కడుపు చేశావ్ అని గుర్తు చేస్తుంది. అంటే దానికి కడుపు పోతే.. నాకు దూరం చేస్తావా అని అడుగుతాడు రాహుల్. అవును.., కానీ ఇలాంటి సమయంలో దానికి ఏం జరిగినా మన మీదే అనుమానం వస్తుంది అంటుంది రుద్రాణి. స్వప్న నీకు నచ్చకపోయినా సరే.. అవకాశం వచ్చేవరకూ ఎదురుచూడాలని హితబోధ చేస్తుండగా.. ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X