Brahmamudi June 27th Episode :స్వప్నను చెక్ చేసిన డాక్టర్... ప్రెగ్నెన్సీ లేదని చెబుతుందా?
స్వప్న బొప్పాయి ముక్కలు తెచ్చుకుని హాల్లోకి వచ్చి కాలు మీద కాలేసుకుని కూర్చుని తింటూ ఉంటుండగా.. ఈరోజు ఎపిసోడ్ మొదలు అవతుంది. గత వారం నుంచి ప్రోమోలో ఈ సీన్ ను చూపిస్తుూ వస్తున్నారు. బొప్పాయి తినడంతో డాక్టర్ ను పిలిపించి.. చెక్ చేయిస్తే.. స్వప్న నాటకం బయటపడుతుందా అంటూ.. గత వారం నుంచి ఊరిస్తూ వస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్ లోకి వెళితే...

కావ్య టెన్షన్...: స్వప్న బొప్పాయి పండు తింటు ఉండగా... అపర్ణ కోపంగా ఏం తింటున్నావ్ బొప్పాయి తింటున్నావా అని అడుగుతుంది. అవును ఏమవుతుంది అని స్పన్న అంటుంది. పూర్తిగా తినేశాక చూసి ఉంటే బాగుండేది కడుపు పోయేది వదిలించుకునే వాళ్ళమని రుద్రాణి మనసులో అనుకుంటుంది. బొప్పాయి తింటే కడుపు పోతుందని కావ్య తన చేతిలోని బౌల్ లాగేసుకుంటుంది. లేని కడుపు గురించి ఇంత గోల చేస్తారు ఏంటని స్వప్న అనుకుంటుంది.

ఇంటికి డాక్టర్: అర్జెంట్ గా డాక్టర్ ని ఇంటికి పిలిపిస్తానని రాజ్ అనేసరికి అక్కాచెల్లెళ్లు కంగారుపడతారు. నాకు బాగానే ఉంది దానికి డాక్టర్ ఎందుకని స్వప్న కవర్ చేయగా... కానీ శుభాష్ మాత్రం డాక్టర్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. అయిపోయింది అక్కకి కడుపు లేదనే విషయం ఇవాళ బయట పడిపోతుందని కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు అప్పు కళ్యాణ్ బెండు తీస్తుంది. కబడ్డీ మ్యాచ్ అని తనతో ఎక్సర్ సైజులు చేయిస్తూ అల్లాడిస్తుంది. అలవాటు లేకుండా ఒళ్ళు హూనమయ్యేలా పరుగులు పెట్టేసరికి కాళ్ళు పట్టేసి ఇబ్బంది పడతాడు.

బతిమిలాడిన వినని స్వప్న..:సీన్ కట్ చేస్తే... కావ్య స్వప్నని పక్కకి తీసుకొచ్చి మాట్లాడుతుంది. స్వప్న మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నువ్వు తప్పులు మీద తప్పులు చేస్తున్నావ్ నీకోసం గొడవపడి నీ పెళ్లి చేశాను. డాక్టర్ ని పిలుస్తామని అంటున్నారు. నువ్వే నిజం చెప్తే బాగుంటుంది. ఇప్పుడే వెళ్ళి నిజం చెప్దామని అంటే స్వప్న మాత్రం అందుకు ఒప్పుకోదు. మన తప్పు ఉందని ముందే ఒప్పుకుంటే నిజాయితీ చూసి మనల్ని క్షమిస్తారు. నిజం నిందగా మారకముందే ఒప్పుకుందామని బతిమలాడుతుంది. కానీ స్వప్న మాత్రం స్వార్థంతో ఇలా మాట్లాడుతున్నావ్, నన్ను గెంటేస్తే నువ్వే ఈ ఇంట్లో రాజ్యం ఎలవచ్చిని అనుకుంటున్నావ్ నేను ఎవరి ట్రాప్ లో పడనని అంటుంది. రాహుల్ కి నిజం తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అసలు నిన్ను ఇంట్లో ఎవరూ నమ్మకుండా చేస్తాడని ఎంత చెప్పినా కూడా స్వప్న మాత్రం వినదు.

నిజం బయట పడితే ఏంటి పరిస్థితి...: నిజం డాక్టర్ ద్వారా బయట పడబోతుంది, ఈ నిజం ముందే తెలిసి దాచి పెట్టినందుకు తన పరిస్థితి ఏంటని కావ్య లోలోపల భయపడిపోతుంది. ఈ అబద్ధం అడ్డు పెట్టుకుని పెళ్లి చేసుకున్నా ఇప్పుడు నిజం తెలిస్తే అందరూ కలిసి గెంటేస్తారా ఏంటని స్వప్న టెన్షన్ పడుతుంది. అప్పుడే డాక్టర్ వస్తుంది. విషయం చెప్పగానే స్వప్నని చెక్ చేయడానికి గదిలోకి తీసుకెళ్తారు. డాక్టర్ తో పాటు అపర్ణ, రుద్రాణి తప్ప మిగతా వాళ్ళు కూడా గదిలోకి వస్తారు. డాక్టర్ మాత్రమే వస్తే విషయం చెప్దామని అనుకున్నా కానీ వీళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు నిజం బయట పడితే ఏంటి పరిస్థితని స్వప్న మనసులో అనుకుంటుంది. చెక్ చేస్తూ డాక్టర్ స్వప్న వైపు అనుమానంగా చూస్తుంది.. దీనితో ఎపిసోడ్ ముగుస్తోంది.


Click it and Unblock the Notifications











