BrahmaMudi June28th Episode: స్వప్న గొంతు మీద కత్తి... ఇరుక్కున్న రాజ్.. ఏం జరగనుంది?

స్వప్నని డాక్టర్ చేస్తుండగా.. ఈ రోజు ఎపిసోడ్ మొదలు అవుతుంది. తను ఇబ్బంది పడుతున్నట్లు ఉంది.. మీరు బయటకు వెళ్లండి అని డాక్టర్ ఇంట్లో వాళ్లకు చెబుతుంది. ఆ తర్వాత డాక్టర్.. స్వప్నను చెక్ చేస్తుంది. అయితే స్వప్న డాక్టర్ తో మీరు అనుకునేది నిజం మా వాళ్ళు అనుకునేది అబద్ధమని అంటుంది. కడుపు రాకుండానే వచ్చిందని అబద్ధం చెప్పావా అని నిలదీస్తుంది డాక్టర్. అవును డాక్టర్ తప్పలేదని చెప్తుంది. ఇంటి కోడలు కడుపుతో ఉందని ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. నువ్వు మోసం చేసినట్టు నేను చేయలేను ఇప్పుడే వాళ్ళకి నిజం చెప్పేస్తానని డాక్టర్ అంటుంది.

స్వప్న బెదిరింపు: రాహుల్ నన్ను ప్రేమించానని చెప్పి వాడుకుని వదిలేశాడు డాక్టర్. చావు అయినా బతుకు అయినా అతనే అనుకున్నాను... నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి ఈ పెళ్లి చేసుకున్నాను. నన్ను మోసం చేయాలని అనుకున్నాడు. అందుకే ఇలా చేశానని చెప్తుంది. నువ్వు మీ అత్తకి ద్రోహం చేస్తున్నావ్ కానీ నేను వృత్తికి ద్రోహం చేయలేనని డాక్టర్ వెళ్లబోతుంటే స్వప్న గొంతు మీద కత్తి పెట్టుకుంటుంది. మీరు వెళ్ళి నిజం చెప్తే నేను ప్రాణాలు తీసుకుంటానని బెదిరిస్తుంది. మరోవైపు నిజం బయట పడిపోయి ఉంటుంది, నా భర్త నన్ను అసలు క్షమించడని కావ్య టెన్షన్ పడుతుంది.

BrahmaMudi June28th Episode

డాక్టర్ తో అబద్ధం: డాక్టర్ రూమ్ నుంచి బయటకి రాగానే.. కావ్య మరింత టెన్షన్ పడుతుంది. బయటకు వచ్చిన డాక్టర్ చెప్పిన మాటలు విని షాక్ అవుతుంది. బిడ్డకి ఏమీ కాలేదని కడుపులో బిడ్డ సేఫ్ గా ఉందని అబద్ధం చెప్తుంది డాక్టర్. కావ్య బిత్తరపోయి అసలు ఏం జరిగిందని కావ్య స్వప్నని అడుగుతుంది. నీకు తెలియాల్సిన అవసరం లేదని పొగరుగా సమాధానం చెప్తుంది. తన తెలివితేటలతో డాక్టర్ తో అబద్ధం చెప్పించానని గొప్పగా చెప్పుకుంటుంది. నమ్మిన వాళ్ళని మోసం చేయడం తన వల్ల కాదని ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోనని కావ్య అంటుంది.

BrahmaMudi June28th Episode

స్వప్న శపథం: పెళ్లి అయి ఇన్నాళ్ళూ అయ్యింది ఏం సాధించావు? నీ భర్త దగ్గర ప్రేమ పొందలేకపోయావు, కనీసం నీ ఫోన్ కూడా నీదగ్గర పెట్టుకోలేకపోలేని దుస్థితిలో ఉన్నావని దెప్పిపొడుస్తుంది స్వప్న. ఏదో ఒక రోజు నిజం బయట పడుతుందని కావ్య అంటుంది కానీ స్వప్న మాత్రం దాన్ని త్వరలోనే నిజం చేసి తీరతానని శపథం చేస్తుంది.

ఫిట్నెస్ కోసం కల్యాణ్ తిప్పలు: సీన్ కట్ చేస్తే... కళ్యాణ్ నడవలేక నడవలేక ఇబ్బంది పడుతూ ఇంటికి రావడం చూసి ధాన్యలక్ష్మి ఏమైందని కంగారుగా అడుగుతుంది. ఫిట్ నెస్ కోసం కష్టపడేసరికి ఇలా అయ్యిందని చెప్పేసరికి తండ్రి షాక్ అవుతాడు. ఇలా రాబోయే వైఫ్ ను ఎవరైనా ఎడిపిస్తే కాపాడలంటే శక్తి కావాలి కాబట్టి ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నా అంటాడు. కొడుకులో వచ్చిన మార్పు చూసి ధాన్యలక్ష్మి మురిసిపోతుంది.

BrahmaMudi June28th Episode:

కనకాన్ని పట్టించిన అప్పు: ఇదిలా ఉంటే కనకం తాపీగా కూర్చుని ఉంటే అప్పు హడావుడిగా వచ్చి సేటుని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తుంది. వాడిని కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద కేసులు మీద కేసులు పడతాయని భయపెడుతుంది. వాళ్ళ టెన్షన్ చూసి అప్పు వీళ్ళే కిడ్నాప్ చేసి ఉంటారని డౌట్ పడుతుంది. మీనాక్షి పోలీసులకు భయపడి సేటుని విడిపించేస్తుంది. మీ అంతు చూస్తానని సేటు ఆవేశంగా బయటకి వచ్చేసరికి ఎదురుగా కృష్ణమూర్తి ఉంటాడు.ఈ విషయం ఇంతటితో వదిలేయమని మూర్తి అడిగినా కూడా సేటు ఒప్పుకోడు. పోలీస్ కేసు పెట్టి తీరతానని అంటాడు ఈరోజుతో ఎపిసోడ్ ముగుస్తోంది.

BrahmaMudi June28th Episode:

ఆ పాలు తాగిన రాజ్...: ఇక తరువాయి భాగం ప్రోమోలో స్వప్న ఓ ప్లాన్ వేస్తుంది. రాహుల్ ఈ పౌడర్ కలిపిన పాలు నువ్వు తాగితే ఈ ప్రపంచాన్నే మర్చిపోతాడు.. ఇక నా అబద్ధాన్ని నిజం చెయొచ్చు అనుకుంటుంది. కానీ ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్లేసరికి కావ్య కూడా రాజ్‌కు పాలు కలిపిన గ్లాస్ పక్కనే పెడుతుంది. దీంతో స్వప్న చూసుకోకుండా కావ్య పెట్టిన గ్లాస్ తీసుకెళ్లిపోతుంది. ఇక కావ్య.. ఆ పౌడర్ కలిపిన పాల గ్లాస్ రాజ్‌కు ఇమ్మని పనిమనిషికి ఇస్తుంది. రాజ్ ఆ పాలు తాగేసి గదిలోకి వస్తాడు. ఇంతలో గదిలో కావ్య మల్లెపూలు పెట్టుకుంటూ ఉంటుంది. రాజ్ గదిలోకి వచ్చి తలుపు వేస్తాడు.. కావ్యను అదో టైప్‌లో చూస్తాడు.. కావ్య సిగ్గుపడుతుంది. ఇక ఇంతటితో ప్రోమో ముగుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X