Brahmamudi June 29th Episode : కావ్యకు రాజ్ ముద్దు.. ఇంట్లో పంచాయితీ పెట్టిన రుద్రాణి..
సేటును కనకం కిడ్నాప్ చేసిన విషయం మూర్తికి చెప్పి.. తల్లిని అప్పు పట్టిస్తుంది. ఇక్కడి నుంచి ఈరోజు ఎపిసోడ్ మొదలు అవుతుంది. అయితే జరిగినదానికి నేను చాలా బాధపడుతున్నానని మూర్తి సేటుతో చెప్పగా.. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని చెప్పుకొస్తాడు. మధ్యలోకి అప్పు కలగచేసుకుని ఇద్దరం కలిసి పోదాం సేటు అంటుంది. మా ఇల్లు మా నాన్న పేరు మీద ఉంటే.. మా అమ్మకు ఎట్లా అప్పు ఇస్తారు.. దొంగ సంతకాలు చేసి అప్పు ఉందని బెదిరిస్తున్నారని నేను కేసు పెడతా అంటుంది. దీనితో నా పది లక్షలు పోయినట్టేనా అని సేటు అంటాడు. దీంతో మూర్తి అప్పు తీరుస్తామని, తొందరపడి పోలీస్ స్టేషన్ వెళితే మీరే చిక్కుల్లో పడతారని అంటాడు. అప్పు తీర్చడానికి సేటు రెండు నెలల సమయం ఇస్తాడు.
మరోవైపు గదిలోకి రాజ్ వెళ్లే టైమ్ కి కావ్య ఏదో రాస్తూ ఉంటుంది.. టామ్ అండ్ జెర్రీలా మాట్లాడుకుంటూ ఉంటారు. రాజ్ మీద సెటైర్స్ వేస్తూ కావ్య.. కాసేపు మాట్లాడుతుంది. పెళ్లైన తర్వాత భార్యాభర్తల మధ్య జరిగేది ఏంటి అని కావ్య రాజ్ ను అడుగుతుంది. మూడు అక్షరాల్లో చెప్పాలని ప్రశ్నిస్తుంది కావ్య. గొడవ అంటాడు రాజ్. నాకు క్లూ కావాలని రాజ్ అడగ్గా... కాసేపు ఫన్నీగా మాట్లాడుకుంటారు. ఇలా అనుకోకుండా కావ్య చెంప మీద రాజ్ ముద్దుపెడతాడు. దీంతో కావ్య గట్టిగా అరుస్తుంది. రాజ్ వెళ్లి బెడ్ మీద పడుకుంటాడు.

సీన్ కట్ చేస్తే... రాహుల్ ను రుద్రాణి రెడీ చేస్తుంది. ఇప్పుడు నువ్ దుగ్గిరాల కంపెనీలకు ఎండీలా ఉన్నావ్ అని రుద్రాణి అంటుంది. ఎండీ నువ్వే అయ్యేలా పరిస్థితులను తిప్పుకో అని చెబుతుంది. అదేలా సాధ్యం మామ్ అని అడుగుతాడు. రాజ్, కావ్యలను సమస్యలతో అల్లాడేటట్టు నేను చేస్తా... నువ్వు వెళ్లి రాజ్ ను ఆఫీస్ డామినేట్ చేయ్ అంటుంది. ఓకే అని చెప్పి ఆఫీసుకు వెళ్తాడు. ఇక ఆఫీసుకు వెళ్లి ఎండీ సీటులో కూర్చొంటాడు. అటెండర్ వచ్చి.. ఇది మీ ప్లేస్ కాదని చెబుతాడు. వచ్చి వేరే క్యాబిన్ చూపిస్తాడు. ఇదే సమయంలో రాజ్ అటు వైపు వెళ్తుంటే చూస్తాడు. నన్ను నీ అసిస్టెంట్ గా పెట్టుకున్నావ్ కదా రాజ్.. నీ నిర్ణయం ఎంత తప్పొ నీకే చూపిస్తాను అనుకుంటాడు.

ఓ ఎంప్లాయ్ వచ్చి.... ఇందులో బెస్ట్ డిజైన్ సెలెక్ట్ చేస్తే...రాజ్ సర్ అప్రూవల్ తీసుకుంటానని అంటుంది. దీంతో ఇంత చిన్నదానికి రాజ్ ను ఎందుకు.. నేను ఇచ్చింది ఫైనల్ చేయ్ అంటాడు. కాసేపటి తర్వాత రాజ్ కు ఫోన్ వస్తుంది. సూరజ్ కాల్ చేసి ఈ సింపుల్ డిజైన్ ఏంటి అని అడుగుతాడు. చెక్ చేసిన రాజ్.. కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ల.. వేరేవాళ్లకు పంపించాల్సిన డిజైన్స్ మీకు వచ్చాయని కవర్ చేస్తాడు. ఆ తర్వాత ఎంప్లాజ్ మీద ఫైర్ అవ్వగా... నేనే చెప్పాను రాజ్ అని రాహుల్ అంటాడు. వాళ్ల రిక్వైర్మెంట్ ఏంటో నీకు తెలుసా.. నీ మిస్టేక్ వల్ల 5 కోట్ల బిజినెస్ పోయేదని అంటాడు. రాహుల్ మీద రాజ్ ఫైర్ అవుతాడు. ఇంకోసారి ఏదైనా చేసే ముందు నా పర్మిషన్ తీసుకోవాలని వార్న్ చేస్తాడు.

మరోవైపు ఈ విషయంపై రుద్రాణి ఇంట్లో పంచాయితీ పెడుతుంది. రాజ్ తప్పు ఉండదని ఇంట్లో వాళ్లు సర్ధి చెబుతారు. ఇదే సమయంలో రాజ్ వస్తాడు. ఏంటి అత్త ఏమైందని అడగ్గా... నా కొడుకు అటెండర్ లాగా కనిపిస్తున్నాడా రాజ్ అని రుద్రాణి ప్రశ్నిస్తుంది. కావ్య కూడా ఎంటర్ అయి... మాట్లాడుతుంది. షటప్ అని రుద్రాణి అరుస్తుంది. ఇది నాకు, నా మేనల్లుడికి మధ్య సమస్య అంటుంది. కాదు, నా భర్తకు, ఆయన వ్యక్తిత్వానికి మీరు పెట్టే పరీక్ష అని బదులిస్తుంది కావ్య. నువ్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నావని అపర్ణ అడుగుతుంది. మామయ్యగారిని అంటే మీరు ఊరుకుంటారా అని అత్తయ్య అని కావ్య అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్ట్స్ ప్రొమోల్ పౌడర్ కలిపిన పాలను.. రాజ్ తాగుతాడు. ఆపాలు తాగిన రాజ్.. అదోలా చూస్తూ బెడ్ రూంలోకి వస్తాడు.


Click it and Unblock the Notifications











