Brahmamudi July 1st Episode: కావ్య ఒడిలో రాజ్... అప్పును అరెస్ట్ చేసిన పోలీసులు
బ్రహ్మముడి సీరియల్.. ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో మూలిక కలిపిన పాలు తాగి మత్తులో ఉన్న రాజ్.. కావ్యకు దగ్గరవుతాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి రొమాన్స్ కూడా సాగింది. కావ్య చీర కొంగు పట్టుకొని లాగుతూ.. ఇద్దరం కలిసే ఉందామంటూ రాజ్ మాట్లాడతాడు. అయితే రాజ్ తీరు చూసి కాస్త కంగారు పడిన కావ్య... అమ్మా నాన్న, అమ్మమ్మ, తాతయ్య, అప్పు అని గట్టిగా అరుస్తుంది. అతడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది.
అయినా రాజ్.. ఆమెను వెళ్లనివ్వకుండా అపుతాడు. ఆ తర్వాత కావ్య చివరికి.. తన ఒడిలో అతడిని నిద్రపుచ్చుతుంది. నిజానికి రాజే తన తలను మత్తులో ఆమె ఒడిలో పెట్టి నిద్రపోతాడు. అయితే.. భర్తతో జరిగిన క్షణాలన్నీ గుర్తు చేసుకుంటూ.. మత్తులో ఉన్నప్పుడు కాదు మనస్ఫూర్తిగా నా దగ్గరికి మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నాను అంటూ కావ్య సంతోషంతో కన్నీళ్లు పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే.. నన్ను చూస్తేనే దూరంగా ఉండే మీరు.. ఇప్పుడు పదే పదే నాకు దగ్గర అవుతున్నారంటే బహుశ ఇదేనేమో బ్రహ్మముడికి ఉన్న శక్తి అని తనలో తాను అనుకుంటుంది.

భర్త కాళ్లు పట్టుకున్న కనకం.. మరోవైపు కనకం.. తమ తప్పును తెలుసుకుని, పశ్చాత్తాపంతో భర్త కృష్ణమూర్తి కాళ్ళు పట్టుకుంటుంది. కానీ అతడు ఆమెను అసహ్యించుకుంటాడు. 'నువ్వు చేసింది తప్పైతే క్షమించే వాడిని.. కానీ నువ్వు చేసింది మోసం. దాన్ని ఎవరూ ఒప్పుకోరు' అని అంటాడు. తనలా తన కూతురి జీవితాలు కాకూడదని తప్పు చేసినట్టు బాధపడుతూ చెప్పిన కనకం.. తన కన్న కూతురే తనను మోసం చేసి వెళ్లిపోయినప్పుడు..అంతా అర్థమైందని కన్నీళ్లు పెట్టుకుంటుంది.

తాను మారిపోయానని చెబుతుంది. 'నువ్వు మారిపోయావని నాకు తెలుసు. కానీ ఇప్పుడేమీ చేయలేను. చిన్నప్పుడు నుంచి అప్పుకి ఏమి ఇవ్వలేదు. నా ఇద్దరు కూతుర్ల పెళ్ళిళ్ళు నా చేతుల మీదగా ఎలాగో జరగలేదు. కనీసం అప్పుకి అయినా ఇల్లు అమ్మి.. మంచి అబ్బాయిని ఇచ్చి చేద్దామనుకున్నాను. కానీ అది లేకుండా చేశావ్' అని కృష్ణమూర్తి మాట్లాడుతూ బాధపడతాడు. ఈ మాటలన్నింటినీ వినేసిన అప్పు ఎలాగైనా.. తన తండ్రికి సాయం చేయాలని పట్టుదలతో నిర్ణయించుకుంటుంది.

రాజ్ షాక్.. బిల్డప్ కొట్టి కావ్య.. మరోవైపు కట్ చేస్తే.. శ్రీశైలం వెళ్లేందుకు ఇందిరాదేవి, సీతారామయ్య.. కొడుకులు, కోడళ్ళని సిద్ధం అవ్వాలని చెప్తారు. స్వప్న, రాహుల్ కీదా రెడీ అయి హాలుకి వస్తారు. ఇంట్లో వాళ్ళందరూ తనని పొగుడుతారని స్వప్న ఆశపడుతూ ఉంటుంది. కానీ ఇంద్రాదేవి.. స్వప్న వాళ్ళు వచ్చారు.. మరి రాజ్- కావ్య ఎక్కడ ఉన్నారని అంటుంది. ఈ లోగా రాజ్‌కు మెలుకువ వచ్చి చూసేసరికి.. కావ్య ఒడిలో తల పెట్టి తాను పడుకోవడం చూసి గట్టిగా అరుస్తాడు.

అదేంటి నువ్వు నా బెడ్ మీద ఉన్నావ్ అంటూ షాక్ అయి అడుగుతాడు. మీరే నా మాట వినకుండా ఏదేదో చేసేశారు అంటూ కావ్య సిగ్గు పడుతూ కాస్త బిల్డప్ కొడుతుంది. రాజ్‌ను కాస్త ఉడికిస్తుంది. వెంటనే రాజ్ మాట అందుకుని నువ్వే ఏదో మత్తు మందు కలిపి ఉంటావ్ అని అంటాడు. కానీ కావ్య మాత్రం మీ వల్ల ఏదేదో జరిగిపోయిందంటూ కాస్త కహాని కలపుతుంది. ఇక ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
జైలులో అప్పు.. ఆ తర్వాత భాగం ప్రోమోలో అప్పు ఎవరితోనే గొడవ పడటం జరుగుతుంది. 'మీ చిన్న అక్కేమో దొంగలా.. పెళ్లి పీటల మీద కూర్చొని పెళ్లి చేసుకుంది. పెద్ద అక్కేమో కడుపు చేసుకుని పెళ్లి చేసుకుంది' అని ఒకడు వాగగా.. అప్పు కోపంతో బ్యాట్ పట్టుకొని అతడి తలపై కొడుతుంది. దీంతో పోలీసులు అప్పును ఇంటికి వచ్చి మరీ అరెస్ట్ చేసి జైలులో వేస్తారు. ఈ విషయం తెలుసుకుని కావ్య షాక్ అవుతుంది. మళ్లీ సోమవారం కొత్త ఎపిసోడ్‌తో కలుద్దాం బైబై..


Click it and Unblock the Notifications











