Karthika Deepam రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కార్తీక్, దీప.. కోపంతో మోనిత జుట్టు పట్టిన సౌందర్య!

కార్తీక్‌పై డాక్టర్ చారుశీల మనసు పడిన విషయం, అలాగే అత్తయ్య సౌందర్యను దీప కలువడం లాంటి సంఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రుల కోసం హిమ, శౌర్య వెతకడం మొదలుపెట్టారు. అయితే హిమ, శౌర్య వద్ద డబ్బు కాజేయాలని ఓ దొంగ ప్రయత్నించి.. వారి నుంచి సొమ్ము లాగేసుకొని వెళ్లి పారిపోతూ.. ఇద్దరు పిల్లలను నెట్టివేయడంతో కార్తీక్‌పై వారు వెళ్లి పడటం, వారు తండ్రిని చూసి షాక్‌కు గురి అయ్యారు. కళ్లముందే తండ్రి కనిపించడంతో నోట మాట రాలేదు. అదే పరిస్థితి కార్తీక్‌కు ఎదురైంది. కళ్లెదుట ఉన్న బిడ్డలను కౌగిలిలోకి తీసుకొన్నాడు. ఇంకా కార్తీకదీపం సీరియల్‌ 1558 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

ఇన్నాళ్లు ఎక్కడున్నారు నాన్న..

ఇన్నాళ్లు ఎక్కడున్నారు నాన్న..


డాడీ.. ఎక్కడున్నారు? ఇన్నాళ్లు ఏమైపోయారు. మీకోసం ఎన్నాళ్ల నుంచి వెతుకుతున్నామో తెలుసా? శౌర్య చూశావా డాడీని అని హిమ అంటే.. ఇక్కడే ఉండి మా వద్దకు ఎందుకు రాలేదు. మీ కోసం ఎంత ఏడ్చామో.. ఎంత వెతికామో తెలుసా? అయినా మీరెందుకు మా వద్దకు రాలేదు. మా మీద కోపం వచ్చిందా? మమ్మల్ని చూడకూడదని అనుకొన్నారా? అయినా అమ్మ ఎలా ఊరుకొన్నది. ఇన్నాళ్లు మమ్మల్ని చూడకుండా ఎలా ఉంది? అమ్మ ఎక్కడ? మేము మాట్లాడాలి అని శౌర్య రోదించింది. ఇన్నాళ్లు వీళ్ల కంట పడకుండా దీపను కంటికి రెప్పలా కాపాడాను. ఇప్పుడు దీప గురించి ఎలా చెప్పాలి? ఏమని చెప్పాలి అని కార్తీక్ మనసులో అనుకొన్నాడు.

 అమ్మ దగ్గరకు తీసుకెళ్లు డాడీ

అమ్మ దగ్గరకు తీసుకెళ్లు డాడీ


అయితే తండ్రి బాధతో ఉండగా.. హిమ మాట్లాడుతూ.. నేను, అమ్మను చూశాను. నేను పిలుస్తుంటే.. మీరు పారిపోయారు. మీరు కూడా నన్ను చూసి ఉంటారు. కానీ తప్పించుకు తిరుగుతున్నారు కదా.. మేమంటే ఇష్టం లేదా? కోపమా? అమ్మ ఎక్కడ? అమ్మ దగ్గరకు తీసుకెళ్లు డాడీ అని హిమ అంటే.... మీరు ఇంటికి వెళ్లండి.. నేను అమ్మను తీసుకొస్తాను అని కార్తీక్ అంటే.. మీరు తీసుకురారు.. మళ్లీ కనిపించకుండా ఎక్కడికైనా వెళ్తారు అని హిమ అంటే.. లేదమ్మ.. నేను తీసుకొస్తాను అని కార్తీక్ అంటే.. లేదు డాడీ.. మీరు వెళ్లిపోతారు. అమ్మ కూడా ఇన్నాళ్లు రాలేదంటే.. ఏదో కారణం ఉండి ఉంటుంది. ఇద్దరు కలిసి దూరంగా వెళ్లిపోతారు. మమ్మల్ని తీసుకెళ్లండి. మీ మనసులో ఏదో ఉంది. మమ్మల్ని తప్పించుకోవాలని చూస్తున్నారు. మీరు తీసుకెళ్లాల్సిందే.. అమ్మను చూపించే వరకు నిన్ను వదిలేది లేదు అని శౌర్య ఏడుస్తూ గట్టిగా నిలదీసింది.

నేను కరిగిపోయే కలనే అత్తయ్య..

నేను కరిగిపోయే కలనే అత్తయ్య..


దీపను కలిసిన సౌందర్య.. వంటలక్కను గట్టిగా పట్టుకొన్నది. అయితే వదిలేస్తే పారిపోతాని అనుకొంటున్నావా? అని దీప అంటే.. ఇదంత కలనా? నిజమా? అనే ఫీలింగ్ ఉంది. వదిలేస్తే కలగా మారిపోతుందని అనుకొంటున్నాను అని సౌందర్య అంటే... అవును నేను కలగా కరిగిపోయే దానినే అని దీప అంది. అయితే ఏదో చెబుతావని.. ఎక్కడికో తీసుకెళ్తున్నావు. నీవు చెప్పకుండా దాస్తున్న విషయమే నన్ను ఎక్కువ కంగారు పెడుతున్నది. గుండెలో దడ వస్తున్నది. నీవు నాకు సగం సగం చెప్పినట్టు. ఆయనకు చెబితే.. మీ మామకు ప్రాణం ఆగిపోతుంది అని సౌందర్య అంది. దాంతో దానికంటే ముందు.. మీకు చెప్పాల్సిన మాట ఒకటి ఉంది. ఏదైనా హోటల్‌కు వెళ్లి తాపీగా మాట్లాడుకొందాం అని దీప చెప్పింది. అంతలోనే కార్తీక్‌ను తీసుకొని హిమ, శౌర్య.. దీప, సౌందర్యకు ఎదురుపడ్డారు. దాంతో ఆనందం పొంగి పొర్లింది.

ఇంతకాలం కనిపించకుండా ఎందుకు?

ఇంతకాలం కనిపించకుండా ఎందుకు?


కార్తీక్, దీపను చూస్తూ.. మీరు మాకు దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది. మీరు ఎక్కడ ఉన్నారు. నువ్వెందుకు రావడం లేదంటే జవాబు లేదు అంటే.. వారిద్దరి మధ్య మౌనమే సమాధానమైంది. నీవు అనుకొన్నదే చేశావు దీప.. నన్ను అమ్మకు అప్పగించాలని తీసుకొన్న నిర్ణయమే అమలు చేశావు అని కార్తీక్ అన్నాడు. మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? ప్రమాదంలో పోయావని బాధపడ్డాం. మీరు ఇలా కనిపించగానే ఎంత సంతోషంగా ఉన్నామో చూడు. మీరు ఎందుకు ఇంతకాలం మాకు కనిపించకుండా దూరంగా ఉన్నారు అని సౌందర్య నిలదీసింది.

 కార్తీక్, దీప ఇంట్లో మోనిత

కార్తీక్, దీప ఇంట్లో మోనిత


అయితే కార్తీక, దీప మౌనంగా ఉండటంతో అమ్మ, నాన్నను వదిలేదే లేదు అని హిమ, శౌర్య అన్నారు. దాంతో నీ పిల్లలకు అమ్మ, నాన్న లేని పిల్లలుగా బతకాల్సిన అవసరం ఎందుకు అని సౌందర్య ప్రశ్నించింది. మీరు ఎక్కడుంటున్నారో మాకు చూపించండి. అక్కడకు పదండి అంటూ కార్తీక్, దీపను సౌందర్య తీసుకెళ్లింది. డాక్టర్ చారుశీల ఇంటి నుంచి నేరుగా కార్తీక్, దీప ఇంటికి మోనిత వచ్చింది. ఇంటికి తాళం వేసి ఉండటంతో .. నన్ను చూసి పారిపోయారా? ఎక్కడికి పోతారు.. దీప ఇంకా ఎన్నాళ్లు బతుకుతుంది. ఆమెను ఏదైనా హాస్పిటల్ వద్దకు తీసుకెళ్లాడా? అంతవరకు వేచి చూడటం ఎందుకు? అని తాళం పగలకొట్టి ఇంట్లోకి వెళ్లింది.

మోనిత జట్టు పట్టుకొన్న సౌందర్య

మోనిత జట్టు పట్టుకొన్న సౌందర్య


ఇంట్లోకి వెళ్లిన మోనిత దోశలు వేసుకొంటుంటే.. కాసేపైన తర్వాత దీప, కార్తీక్, సౌందర్య, పిల్లలు ఇంట్లోకి వచ్చారు. ఇంట్లో ఉన్న మోనితను చూసి షాకయ్యారు. నన్ను చూసి దొంగ అనుకొన్నారా? ఆకలేస్తుంటే.. తాళం పగలకొట్టి దోశలు వేసుకొని తింటున్నాను అని మోనిత అంటే.. ఎందుకొచ్చావే.. ఇక్కడికి.. నడవవే బయటకు అని దీప అంది. నా కొడుకు, కోడలు మా వద్దకు రాకపోవడానికి నీవేనా కారణం. నీవే ఆపేవు కాదు. లేకుంటే.. వాళ్లు ఇలా చేయరు అని మోనిత జట్టు సౌందర్య పట్టుకొన్నది. అయితే ఏం జరిగిందో నీ కొడుకు.. కోడలు చెప్పి ఉంటుంది కదా.. అని అంతా చెప్పేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X