twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam దీపను బతికించలేకపోతే నన్ను కూడా తీసుకెళ్లు.. కార్తీక్ ఇంటికి తల్లి సౌందర్య

    |

    మోనిత కుట్రలో భాగంగా దీపకు ట్యాబ్లెట్ల రూపంలో విషం పెడుతున్న చారుశీల ప్లేట్ మార్చింది. దీపను చంపేస్తే.. ఆమె స్థానంలో కార్తీక్ జీవితంలోకి ప్రవేశించడానికి ప్లాన్ వేసింది. దీపను వీలైనంత త్వరగా పైకి పంపించి.. మోనితను జైల్లోనే ఉంచి.. కార్తీక్‌ను పెళ్లి చేసుకోవాలని ప్లాన్‌తో ముందుకెళ్తున్నది. అలాగే దీపను కూడా తన బుట్టలో వేసుకొని కార్తీక్‌ దృష్టి తనవైపుకు మరల్చుకొనే విధంగా పావులు కదుపుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కార్తీకదీపం సీరియల్ 1552 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

    దీప ఆరోగ్యం కోసం కార్తీక్ పూజలు

    దీప ఆరోగ్యం కోసం కార్తీక్ పూజలు

    భగవంతుడా.. ఇది కావాలి.. అది కావాలి అని ఎప్పుడు విసిగించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీవు తప్ప నన్ను ఆదుకొనే వారు లేరు. ఏదో ఒక దారి చూపించు. దీప ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్‌గా నాకు తెలుసు. కానీ ఆమె ఆయుష్షును పెంచడానికి నీ ఆశీర్వాదం కావాలి. నీకు ఎన్నో పూజలు చేసింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి కల్పించావు.

    నా దీపకు నూరేళ్ల ఆయుష్షు ఇవ్వు అంటూ దేవుడ్ని ప్రార్థించాడు. అయితే దీపారాధన చప్పుడు విన్న దీప.. ఎవరు దీపం పెడుతున్నారు. నేను ఉదయం ఎందుకు లేవలేకపోయాను.

    నాకు ఎందుకు వీక్‌గా ఉంది. రోజులు దగ్గరపడుతున్నాయా? డాక్టర్ బాబు పరిస్థితి ఏమిటి? నాకు ఏమైనా అయితే డాక్టర్ బాబు పరిస్థితి ఏమిటి? అత్తయ్య, మామయ్య వద్దకు వెళ్లమంటే.. వెళ్లడం లేదు. వాళ్ల దగ్గరకు వెళ్లేలా మనసు మార్చు. ఆయన అక్కడకు వెళ్లే వరకు నన్ను బతికించని దీప వేడుకొన్నది.

    దీపను బతికించలేకపోతే నన్ను కూడా తీసుకెళ్లు

    దీపను బతికించలేకపోతే నన్ను కూడా తీసుకెళ్లు

    కార్తీక్ అంతలోనే దీప వద్దకు వచ్చి.. ఏమైంది అని అన్నాడు. ఇప్పుడు బాగానే ఉంది. బెడ్‌పై నుంచి లేవలేకపోయాను. నిన్ను చూడగానే హుషారు వచ్చేసింది అని దీప అంటే.. ఏం కాదు.. దేవుడ్ని మొక్కాను అని కార్తీక్ అన్నాడు. దాంతో కార్తీక్.. నీవు దేవుడిని మొక్కుకున్నావా? అంటే.. అవును. ఇప్పటి వరకు దేవుడి పూజించే అవసరం రాలేదు.

    నీ ఆరోగ్యం గురించి వేడుకొన్నాను. ఒకవేళ దీపను బతికించలేకపోతే.. నన్ను కూడా తీసుకెళ్లు అని కార్తీక్ అంటే.. అలా అనకు అని దీప అంది. నీవు అత్తయ్య, మామయ్య వద్దకు వెళ్లు అంటే.. వెళ్తాను. కానీ ఇద్దరం కలిసి వెళ్తాం. భగవంతుడు మనల్ని ఏం చేయడు అని కార్తీక్ అన్నాడు.

    కార్తీక్ రాసిన ప్రిస్కిప్షన్ గురించి

    కార్తీక్ రాసిన ప్రిస్కిప్షన్ గురించి

    హాస్పిటల్‌లో ఉన్న చారులత వద్దకు సౌందర్య వెళ్లింది. సౌందర్యను చూసి చారులత కంగారు పడింది. ఏమిటి ఇలా వచ్చారు. కార్తీక్, దీప ఫోటోలు ఇచ్చారు కదా.. వాళ్లు కనిపిస్తే నేను మీ అడ్రస్ చెబుతాను అని చారులత అంది. అయితే తన చేతిలో కాగితాన్ని ఇచ్చి.. ఒకసారి చూడు అని సౌందర్య అనగానే.. చేతిలోకి తీసుకొని.. కార్తీక్ రాసిన ప్రిస్కిప్షన్‌ను చూసి కంగారు పడింది.

    శౌర్యకు కార్తీక్ రాసిన ప్రిస్కిప్షన్. ఇది కార్తీక్ చేతి రాత. కొంపదీసి కార్తీక్ హ్యాండ్ రైటింగ్‌ను గుర్తుపట్టిందా అని చారులత మనసులో అనుకొన్నది. అయితే నీ చేతి రాతను నీవు గుర్తుపట్టలేకపోయావా అని సౌందర్య అంటే.. ప్రతీ రోజు చాలా మందికి రాస్తుంటాను కదా.. అది చూసి కాస్త ఆలస్యంగా గుర్తుపట్టాను. చాలా మంది డాక్టర్ల చేతిరాత ఒకేలా ఉంటుంది. కార్తీక్ చేతిరాత మాదిరిగానే నా హ్యాండ్ రైటింగ్ ఉంటుంది అని చారులత అన్నది.

    ఆంటీ అని మా కొంప ముచ్చింది అంటూ

    ఆంటీ అని మా కొంప ముచ్చింది అంటూ

    సౌందర్య వెళ్లిపోతుంటే.. ఈమెను మచ్చిక చేసుకొంటే.. కార్తీక్‌ను పెళ్లి చేసుకొని దగ్గరవుతాను అని చారులత మనసులో అనుకొన్నది. మిమ్మల్ని ఆంటీ అనవచ్చా? అని చారులత అంటే.. ఆంటీ అన్నారు కదా.. మనసులో ఏమీ లేకుండా అంటే ఫర్వాలేదు అని సౌందర్య అంది. దాంతో మా అత్తయ్య కూడా మీ లానే ఉండేది.

    అందుకే నిన్ను అంటీ అని పిలిచాను అని చారులత అంది. దాంతో మోనిత అని పనికి మాలిన వ్యక్తి ఉండేది. ఆంటీ అంటీ అంటూ మా కొంప ముంచింది. నీవు అంటీ అంటుంటే అదే గుర్తుకు వచ్చింది. ఆ పనికి మాలిని వ్యక్తితో పోల్చినందుకు సారీ.. అలాంటి మోనితలాంటి ఉంటారా? సౌందర్య అనగానే.. చారులత కంగారుపడిపోయింది. ఆ తర్వాత మోనితతో పోల్చుకుండానే.. నన్ను పోల్చావు. మోనిత సాధించలేనిది.. నేను సాధిస్తాను అని చారుశీల మనసులో అనుకొన్నది.

    ఇంద్రుడితో ఒట్టేపించిన సౌందర్య

    ఇంద్రుడితో ఒట్టేపించిన సౌందర్య

    ఇక కార్తీక్‌ను వెతికేందుకు బయలుదేరుతూ ఇంద్రుడిని కూడా రమ్మని అంటే.. నేను ఎందుకని అన్నాడు. దాంతో అనుమానం వచ్చిన సౌందర్య వెంటనే ఇంద్రుడి భార్యను పిలిచి.. ఆమె తలపై ఇంద్రుడి చేతిని పెట్టేసి.. ఒట్టేసి చెప్పు.. కార్తీక్, దీప గురించి నాకు తెలియదని అని సౌందర్య నిలదీసింది. అయితే సౌందర్య చేసిన పనికి కంగారుపడిన ఇంద్రుడు ఏం చెప్పాలో తెలియక తికమకపడ్డాడు.

    అంతలోనే చంద్రమ్మ ధైర్యం చేసి.. నాకు ఏమీ తెలియదని చెప్పు. ఎందుకు కంగారుపడుతున్నావు అని అనగానే.. కార్తీక్, దీప గురించి నాకు ఏమీ తెలియదు. నేను చూడలేదని చెప్పాడు. దాంతో అక్కడి నుంచి సౌందర్య బయలు దేరి కార్తీక్, దీప గురించి వెతకడం మొదలుపెట్టింది. అయితే చివరికి కార్తీక్, దీప ఉన్న ఇంటిలోకి ప్రవేశించింది.

    దారుణంగా పడిపోయిన కార్తీకదీపం రేటింగ్

    దారుణంగా పడిపోయిన కార్తీకదీపం రేటింగ్

    కార్తీకదీపం సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే.. గతంలో టాప్ రేటింగ్ సాధించిన ఈ సీరియల్ ప్రస్తుతం భారీగా రేటింగ్ కోల్పోయింది. ఒక సమయంలో 14 రేటింగ్ వరకు సాధించిన ఈ సీరియల్ ప్రస్తుతం 9.62 స్థాయికి పడిపోయింది. అందుకు కారణం విపరీతమైన సాగదీత.. ఒకే పాయింట్‌పై వారాలు వారాలు కొనసాగించడం ఓ కారణంగా మారింది. అయితే మళ్లీ ఆ టాప్ రేటింగ్‌‌ను సాధిస్తుందా లేదా చూడాలి.

    English summary
    Karthika Deepam January 3rd 2023 Episode number 1552.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X