Brahmamudi: కావ్యపై అపర్ణ ఫుల్ ఫైర్.. అలా అనొద్దంటూ ప్రేమ చూపించిన రాజ్.. జైలు నుంచి అప్పు రిలీజ్
ఈ రోజు ఎపిసోడ్లో కావ్య పట్ల రాజ్ తన మనసును కాస్త మార్చుకున్నాడు. తనపై చూపించి చూపించనట్టుగా తమ మాటలతో ఆమెను వెనకేసుకొచ్చి.. తన ప్రేమను బయటపెట్టాడు. దీంతో ఈ రోజు సీరియల్ ఎపిసోడ్ కాస్త ఇంట్రెస్ట్గా సాగింది. అసలేం జరిగిందంటే..
కోడలిపై అపర్ణ ఫైర్.. వెనకేసుకొచ్చి రాజ్.. తన కొడుకుకు ప్రాణాపాయ పరిస్థితి రావడానికి కారణం నువ్వేనంటూ తన కోడలు కావ్యపై అపర్ణ విరుచుకుపడింది. కానీ రాజ్ ఎంట్రీ ఇచ్చి.. ఆమె తప్పేమీ లేదని చెప్పి అపర్ణకు నచ్చజెప్పుతాడు. వద్దన్నా వినకుండా తానే ఐస్ క్రీమ్ తినినందుకే ఇలా జరిగిందని గొడవను ఆపుతాడు. సమయానికి కావ్యనే ఎంతో కష్టపడి స్కూటీ మీద హాస్పిటల్కు కూడా తీసుకెళ్లినట్లు వివరిస్తాడు.

ఇక కావ్య రాత్రంతా మేల్కొని ఉండటంతో వెళ్లి పడుకోమని చెప్పి పంపించేస్తాడు. ఆ తర్వాత.. తొందరపడి నోరు జారీ మాట అనేశావ్.. ఆ అమ్మాయి ఎంతో బాధపడి ఉంటుంది.. అని ఆలోచించమంటూ శుభాష్.. అపర్ణతో అంటాడు. ఆ వెంటనే.. ఇక నుంచైనా నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని ఇంద్రాదేవి.. అపర్ణను కాస్త తిడుతుంది.
ఇదంతా గుమ్మం బయట నుంచి వినిన కనకం.. తాను ఆడిన ఒక్క అబద్ధం వల్ల నిజానికి విలువ లేకుండా పోతుందని అంటూ చాలా బాధపడింది. అందుకు తన కూతురి జీవితమే సాక్ష్యమని చెప్పి కాస్త కన్నీళ్లు కారుస్తుంది. ఇప్పటికే ఇద్దరి కూతుళ్ల గురించి ఎంతో నీచంగా మాట్లాడుతున్నారని.. ఇక మూడో కూతురు.. జైలుకు వెళ్లబోతుందని తెలిస్తే.. మన కుటుంబాన్ని మొత్తానికి వెలివేస్తారు అంటూ.. అప్పును కాపాడుకోవడం ఎలా అని కనకం బాధపడుతుంది. పోలీస్ స్టేషన్కు వెళ్లి.. కాళ్లు మీద పడి అయినా సరే కోర్టుకు వెళ్లకుండా ఆపాలి.. అని కృష్ణమూర్తి భావోద్వేగంతో అంటాడు.

రాజ్ను కాపాడినందుకు అందరూ నీకు కృతజ్ఞతలు చెప్పాలి కానీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడి బాధపెట్టారు. మీ అత్తయ్య అన్నేసి మాటలు అనేసరికి కన్నీళ్ళతో బాధపడుతున్నావా అంటూ ధాన్యలక్ష్మి అంటుంది. నేనెందుకు ఏడుస్తానుఉల్లిపాయలు కట్ చేస్తుంటే కన్నీళ్ళు వచ్చాయి అని కావ్య చెప్పుకొస్తుంది. నిజం చెప్పు తిట్టినందుకు బాధ అనిపించలేదా అని మళ్లీ అడగగా.. బాధ ఎందుకు కొడుక్కు ఏమవుతుందన్న ప్రేమతోనే అమె అలా అన్నారు అని కావ్య చెప్పుకొస్తుంది. నిజంగా నీలాంటి కోడలు దొరకడం మా అక్క అదృష్టం అని చెప్పాలి.. అంటూ ధనలక్ష్మీ అంటుంది.
ఇకపోతే కనకం వాళ్లు.. పోలీస్ స్టేషన్కు వెళ్లి.. ఆడపిల్ల(అప్పు) జీవితం నాశనం అవుతుంది.. విడిచిపెట్టమని బతిమలాడుతారు. ఈ సమయంలోనే అప్పు కోసం వెతుకుతున్న కళ్యాణ్.. అసలు విషయం తెలుసుకుని స్టేషన్కు వెళ్తాడు. అలాగనే లాయర్ను, కంప్లైంట్ ఇచ్చిన రాకేశ్ ను కూడా తీసుకొస్తాడు. ఆ తర్వాత వెంటనే రాకేశ్.. కంప్లైంట్ను విత్ డ్రా చేసుకుంటాడు. వెంటనే పోలీసులు అప్పును రిలీజ్ చేస్తారు. అలా కల్యాణ్.. రాకేశ్ను తీసుకొచ్చి అప్పును జైలు నుంచి విడిపిస్తాడు. సమయానికి వచ్చి కూతురి జీవితాన్ని కాపాడినందుకు కనకం కళ్యాణ్ చేతులెత్తి దండం పెడుతూ భావోద్వేగానికి గురౌతుంది. ఇది తన బాధ్యతని.. కావ్య వదిన కుటుంబానికి కష్టమంటే తనకు కూడా కష్టమేనని అని కల్యాణ్ అంటాడు.

కావ్యకు సారీ చెప్పిన శుభాష్.. డల్గా కూర్చున్న అపర్ణను.. కావ్య విషయంలో తప్పు చేశావని అంటాడు శుభాష్. ఆ అమ్మాయి మంచిది కాబట్టి ఒక్క మాట కూడా అనకుండా వెళ్లిపోయింది. వెళ్లి సారీ చెప్పమంటాడు. లేదంటే కనీసం థ్యాంక్ అయినా చెప్పుమని అంటాడు. కానీ అపర్ణ సారీ చెప్పను.. కేవలం థ్యాంక్స్ మాత్రమే చెబుతానని చెప్పి.. కావ్య దగ్గరు వెళ్లి రాజ్ను కాపాడినందుకు థ్యాంక్స్ చెబుతుంది. కానీ హద్దుల్లో ఉంటే మంచిదని ఓ చిన్న వార్నింగ్ కూడా ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక అపర్ణ తరఫున కోడలికి శుభాష్ సారి చెప్పి వెళ్లిపోతాడు.
ఇకపోతే ఫైనల్గా ఆసపత్రిలో డబ్బులు కోసం కావ్య పడిన ఇబ్బందులను గుర్తుచేసుకంటాడు రాజ్. తనకంటూ ఒక్క రూపాయి కూడా ఎలా బతుకుతుంది. తన పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించడం సరికాదు.. భార్యగా కాకపోయినా మనిషిలా చూడాలని తనని తాను నిందించుకుంటాడు రాజ్. వెంటనే కొంత డబ్బును కావ్యకు ఇవ్వాలని భావిస్తాడు. కానీ ఏం చెప్పి ఇవ్వాలా అని తెగ ఆలోచిస్తాడు. అన్నీ హక్కులు కావాలని అడుగుతుంది కానీ ఆర్థిక స్వతంత్రం గురించి మాత్రం అడగదు.. తింగరి బుచ్చి అని కావ్యను అనుకుంటాడు. అలా కావ్య పట్ల తన మనసును కాస్త మార్చుకుంటాడు.


Click it and Unblock the Notifications











