Brahmamudi June 24th Episode : ఇంట్లో వాళ్లకు స్వప్న ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోతుందా?
కల్యాణ్, అప్పు బయటకు వెళ్లగా... అక్కడ మెడలోని బంగారం ఇవ్వాలని రౌడీ బెదిరిస్తాడు. దీంతో అప్పు వాళ్లపై ఫైర్ అవ్వడంతో ఈరోజు ఎపిసోడ్ మెుదలవుతుంది. అలా వాళ్లను నాలుగు కొట్టి.. రౌడీలకు బుద్ది చెబుతుంది అప్పు. ఇది చూసిన కల్యాణ్ షాక్ అవుతాడు. అప్పుడు నిన్ను నాలా తయారు చేస్తా అని కల్యాణ్ తో అప్పు అంటుంది.
షాక్ కు గురైన కల్యాణ్ నీలా అంటే అని అడుగుతాడు. నాలా స్ట్రాంగ్ గా అంటున్న అని చెబుతుంది అప్పు. నీకు ట్రైనింగ్ ఇస్తా.. కంప్లీట్ మ్యాన్ గా మారుస్తా.. ఉదయమే మన గ్రౌండుకు వచ్చేయ్ అని చెబుతుంది అప్పు. దానకిి కల్యాణ్ ఓకే అంటాడు.

కావ్య కోసం పరుపు తెచ్చిన రాజ్: ఇదిలా ఉంటే.. మరోవైపు రాజ్ బెడ్ మీద కూర్చొని ఉండగా.. గదిలోకి కావ్య వస్తోంది. ఏంటి ఇలా చూస్తుందని అనుకుంటాడు రాజ్. ఏంటా చూపు.. ఎన్నడు మనిషిని చూడనట్టు.. అని రాజ్ అనగా.. ఎన్నడూ చూడని మనిషిలా ఉంటే చూస్తున్న అంటుంది కావ్య. నాకేం కొమ్ములు పెరగలేదు అని రాజ్ అంటాడు.
దానికి పెరగలేదంటే..ఎంతకొంతో ఉన్నట్లే కదా అని అంటుంది కావ్య. దానికి రాజ్ తో జోకులు వద్దు అని అంటాడు. రాజ్ తెచ్చిన పరుపు కోసం కావ్య వెతుకుంది. ఎవరూ గమనించకుండా.. దొంగచాటుగా.. కారులో నుంచి ఏం మోసుకెళ్లారబ్బా అని రాజ్ ను అడుగుతుంది. రాక్షసి, పాము చెవులు, గుడ్ల గూబ కండ్లు అని తిట్టుకుంటాడు రాజ్.

హ్యాపీగా ఫీల్ అయిన కావ్య: ఇంతకీ ఏం మోసుకెళ్లారని అడుగుతుంది కావ్య. నా మంచితనాన్ని మోసుకెళ్లాను అంటాడు రాజ్. సరే ఎందుకు అంత సీక్రెట్ ఆపరేషన్ ఏంటని కావ్య అడుగుతుంది. ఏంటో చూపించండి అని అడుగుతుంది. రాజ్ గదిలోంచి బయటకు వెళ్లి పరుపు తీసుకుని వస్తాడు. మీ మంచితనం ఇంత బరువు ఏంది ఏంటని అడుగుతుంది. అది బరువు కాదు.. బాధ్యత అంటాడు రాజ్. నా వాళ్ల ఎవరూ ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదని అంటాడు రాజ్.
ఎంటది అని అడగ్గా... నా మంచితనం.. ఎవరికి కనపడకుండా మోసుకువచ్చాను అంటాడు రాజ్. పరుపు తీసి కావ్యకు ఓపెన్ చేసి చూపిస్తాడు. కావ్య సంతోషంగా ఫీల్ అవుతుంది. నా కోసమేనా అడుగుతుంది. నేల మీద పడుకుంటే బాడీ పెయిన్స్ వస్తున్నాయని, నేను పడుకున్నప్పుడే అర్థమైందని రాజ్ చెబుతాడు. నా భర్త నేను ఇబ్బందిపడొద్దని పరుపు తీసుకొచ్చారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య.

బోర్ కొట్టిస్తున్న కనకం, మీనాక్షి ట్రాక్: మరోవైపు కనకం, మీనక్షిలా ట్రాక్ నడుస్తూ ఉంటుంది. వీళ్ల ట్రాక్ పై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. లాగ్ ఎక్కువై పోతుందని అంటున్నారు. ఇక కనకం, వాళ్ల అక్క మీనాక్షి.. సేటును సంచిలో స్టోర్ రూములోకి తీసుకొస్తారు. నా మీద గుట్ట కూర్చొన్నట్టుగా కూర్చున్నావని సేటు అంటాడు. కనకం చూశావా సేటు ఎంత మంచివాడో, నోరు విప్పే ఛాన్స్ ఉన్నా.. కాపాడండి అని అడగడం లేదని అంటుంది కనకంతో... వెంటనే హెల్ప్.. హెల్ప్ అంటూ సేటు అరుస్తాడు. కనకం సేటుకు మత్తు మందు ఇస్తుంది. కాసేపు కనకం, మినాక్షి ఫన్నీగా మాట్లాడుకుంటారు. ఈ టైమ్ లోనే అప్పు... అమ్మా.. అంటూ అరుస్తుంది.
సేటును మూటగట్టే పనిని మీనాక్షికి చెప్పి.. అప్పు దగ్గరకు వెళ్తుంది కనకం. ఇది వాసన చూస్తేనే పడిపోతారా అనుకుంటూ.. మత్తుమందు వాసన చూస్తుంది మీనాక్షి. వెంటనే కళ్లు తిరిగిపోయి కిందపడుతుంది. అప్పును పెరుగు తెమ్మని బయటకు పంపిస్తుంది కనకం. ఆ తర్వాత అక్క ఏంటి ఇంకా రాలేదని వెళ్లి చూసేసరికి మీనాక్షి కిందపడి ఉంటుంది. మత్తు మందు అని తెలిసినా వాసన చూసావేంటే.. ఏం అనుకోవాలంటూ... మీనాక్షి లేపుతుంది. ఆ తర్వాత సేటును మూటకట్టేసి, మినాక్షిని తీసుకెళ్తుంది కనకం.
రాహుల్ కోసం స్వప్న వెయిటింగ్: సీన్ కట్ చేస్తే.. మరోవైపు స్వప్న... రాహుల్ కోసం అందంగా రెడీ అవుతూ ఉంటుంది. ఎలాగైనా నేను అనుకున్నది సాధించాలని అనుకుంటుంది స్వప్న. రాహుల్ ఇంకా రాలేదేంటి అనుకుంటుంది. తన కోసం పెళ్లాం ఎదురుచూస్తుందని అర్థంకావడంలేదని అంటుంది. ఇక కావ్యకు రాజ్ పురుపు తేవడంతో ఖుషీలో ఉంటుంది. రాజ్ బెడ్ మీద థాంక్యూ అని రాస్తుంది. ఏంటిది అని రాజ్ అంటాడు.
నాకు ఇలాంటివి నచ్చవని పూలు మెుత్తం తీసి కింద వేస్తాడు. కొంచెం సేపు ఇద్దరూ టామ్ అండ్ జెర్రీలా మాట్లాడుకుంటారు. ఇక స్వప్న రెడీ అవుతూనే ఉంటుంది. నేను చెప్పిన కడుపు అనే అబద్ధాన్ని తొందరగా నిజం చెయ్యకపోతే.. అస్సలు నన్ను తాకడం లేదని అనుకుంటుంది. గదిలోకి వెళ్లి.. రాహుల్ కు ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయడు. తర్వాత స్విఛాప్ చేస్తాడు. దీంతో స్వప్న మండిపోతుంది.

కొత్త నాటాకానికి స్వప్న తెర: స్వప్న కిందకు వచ్చి ఇంటి కాలింగ్ బెల్ గట్టిగా కొడుతుంది. దీంతో అందరూ వస్తారు. అక్క ఏంటిది.. ఇంత మందిని ఎందుకు డిస్టర్బ్ చేశావ్, ఏమైనా పిచ్చి పట్టిందా అని కావ్య అడుగుతుంది. అవును నిజంగానే పిచ్చి పడుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ స్వప్న అని రుద్రాణి ప్రశ్నిస్తుంది. పెళ్లి అయినప్పటి నుంచి చూస్తున్నాను, ఈ టైమ్ వరకూ రాహుల్ ఇంటికి రావడం లేదని అంటుంది స్వప్న. పనిలో ఉండి ఉంటాడు అని రుద్రాణి అనగా నాకు తెలియని పనులు ఏం ఉంటాయని రాజ్ అడుగుతాడు.
మీ అబ్బాయి ఈ టైమ్ వరకూ రావడం లేదని మీకు తెలుసా అని రుద్రాణిని స్వప్న ప్రశ్నిస్తుంది. మాగాడు అన్నాక సావ లక్ష పనులు ఉంటాయని రుద్రాణి అంటుంది. మా ఆయనకు లేవా, మా మరిదికి లేవా అని అపర్ణ అంటుంది. మీ అబ్బాయి దృష్టిలో నేనే ఒక వస్తువును అయ్యాను అని బాధ పడుతుంది స్వప్న. ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్య పోతారు. ఇదిలా ఉంటే స్వప్న మరో నాటకానికి తెర తీస్తుంది. ఇంట్లో వాళ్లను క్షమించమని అడుగుతుంది. ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టండి అని చెబుతుంది. రాహుల్ నన్న వదిలించుకోవాలనుకుంటున్నాడు.. నా అత్త, నా భర్త నాతో సరిగ్గా ఉండటం లేదని వాళ్లతో చెబుతుంది స్వప్న. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

స్వప్న ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోతుందా: తర్వాతి ఎపిసోడ్లో ఇంట్లో సోఫాలో కూర్చొని బొప్పాయి తింటుంది స్వప్న. అదే సమయంలో అక్కడకు వచ్చిన అపర్ణ. ఇది ఎందుకు తింటున్నావని అడుగుతుంది. వెంటనే ఇంట్లోవాళ్లు డాక్టర్ ను పిలిపించాలని అనుకుంటారు. అయిపోయింది, అక్కకు కడుపులేదనే విషయం బయటపడిపోతుందని కావ్య భయపడిపోతుంది. ఇంట్లో వాళ్లంతా డాక్టర్ ను పిలిపిస్తారు. ఇక స్వప్నకు కడుపులేదనే విషయం బయటపడిపపోతుందో లేదో రేపటి ఎపిసోడ్ లో తేలనుంది. చూడాలి ఇక ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











