Karthika Deepam.. మోనిత తాళిని తెంపి ముఖంపై కొట్టిన కార్తీక్.. మరో షాకింగ్ ట్విస్టు

మీకు గుండె ఆపరేషన్ చేసిన తర్వాత మోనితను మీరు అమెరికాకు తీసుకెళ్లండి అని సౌందర్య అంటే.. అదేంటి? నేను మోనితను తీసుకెళ్లాలా అంటూ బాబాయ్ అయోమయంగా ప్రశ్నించాడు. ఇంట్లో కార్తీక్‌తో పూజలు చేయిస్తున్న పెద్ద ఫోటో ఉంది కదా.. దానిని చూసిన తర్వాత మోనిత మారిందని నేను నమ్మాను అని ఆమె బాబాయ్ అంటే.. మోనిత మమల్ని, మా ఫ్యామిలీని ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియంది కాదు అని సౌందర్య అంటే.. అప్పట్లో మోనిత దూకుడు స్వభావం ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అని బాబాయ్ అన్నాడు. ఇంకా తాజా ఎపిసో్ 1281లో ఇంకా ఏం జరిగాయంటే..

మోనిత బాబాయ్‌కి సౌందర్య క్లాస్

మోనిత బాబాయ్‌కి సౌందర్య క్లాస్

మోనిత బాబాయ్ మాటలకు సౌందర్య వెటకారంగా నవ్వింది. మోనిత మారిందా అని సౌందర్య అంటూ.. నీటికి ప్రవహించే గుణం.. నిప్పుకు కాల్చే గుణం ఎలా సహజంగా ఉంటుందో.. మోనితకు నాటకాలు ఆడటం అత్యంత సహజమైన గుణం. మీరు ఆమె వలలో పడకండి. మా అబ్బాయి తప్పకుండా మీకు ఆపరేషన్ చేస్తారు. ఆ తర్వాత ఆమెకు ఏదో చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్లండి. ఇంతకంటే ఏమీ చెప్పను.

చెప్పినా బాగుండదు. పెళ్లి అయిన స్త్రీ, తల్లి అయిన స్త్రీ అత్తారింట్లో ఉండాలి కానీ అమెరికాలో ఉండకూడదు అని మోనిత బాబాయ్ అంటే... పెళ్లి, తల్లి అయినట్టు నటించే మోనితకు ఏమీ తెలియదు అంటే.. మోనిత బాగుండాలంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లండి. ఆమె నుంచి ఎలాంటి న్యూసెన్స్ ఉండకూడదు అంటూ సౌందర్య చెప్పింది.

సౌందర్యను నిలదీసిన మోనిత

సౌందర్యను నిలదీసిన మోనిత

తన బాబాయ్‌తో సౌందర్య మాట్లాడుతుంటే మోనిత అక్కడికి ఎంట్రీ ఇచ్చింది. న్యూసెన్స్ అంటున్నారు. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అని అంటే.. కబురు పంపిస్తే.. కారు పంపించే దానిని కదా అని మోనిత అంది. దాంతో మోనిత నీ గురించి అంటూ బాబాయ్ ఏదో చెప్పబోగా.. అవును అసలు మాది పెళ్లి కాదని.. నాది గర్బం కాదని చాలా చెబుతారు. మీరు అవేమీ పట్టించుకోకండి. కార్తీక్ మీద నా ప్రేమ నిజం.

వాడు మా బిడ్డ అనేది నిజం. ఫోటోలో పూజ చేసిందనే నిజం. ఇలాంటివేమి పట్టించుకోకుండా లోనికి వెళ్లండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని మోనిత అంటే.. నేను పెద్దదానిని.. నేను చెప్పిన వాటిని జాగ్రత్తగా ఆలోచించండి అని సౌందర్య అంది.

నన్ను విలన్ చేశారంటూ..

నన్ను విలన్ చేశారంటూ..

సౌందర్య మాటలకు మోనిత అడ్డుపడుతూ.. మీరు నన్ను విలన్‌గా చిత్రీకరించారు. నా జీవితాంతం ఇలానే బతకాల్సిందేనా? ఒంటరిగా, నా కార్తీక్, నా కొడుకు లేకుండా ఉండాల్సిందేనా? ఈ ఆపరేషన్ కానివ్వండి. నా కొడుకు దొరికనివ్వండి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అదే విషయం కార్తీక్‌కు చెప్పండి అని మోనిత చెప్పింది.

దాంతో నేను మీతో గొడవ పడటానికి రాలేదు. నచ్చచెప్పడానికి వచ్చాను. అందుకే వెళ్తున్నాను అంటూ సౌందర్య వెళ్లిపోయింది. దాంతో మీ జోలికి రాను. మిమల్ని విసిగించను అంటీ. నేను ఎక్కడికి వెళ్లను అంటూ మోనిత విషపు నవ్వు నవ్వింది.

 నా బాబాయ్ చనిపోతే..

నా బాబాయ్ చనిపోతే..

సౌందర్య వెళ్లి పోయిన తర్వాత కంగారు పడుతున్న బాబాయ్‌తో మోనిత మాట్లాడుతూ.. మీరు ఎలాంటి కంగారు పడకుండా నిశ్చింతగా ఉండు అని చెప్పింది. అయితే కార్తీక్ నాకు సర్జరీ చేస్తాడా? లేకపోతే నేను ముందే పోయేలా ఉన్నాను అంటే.. నాకు కూడా అదే కావాలి? ముందే బాబాయ్ పోతే.. కార్తీక్ కంగారుపడిపోతాడు. నాకు తెలుసు ఇదే జరుగుతుందని నేను నెత్తి నోరు కొట్టుకొంటే.. కార్తీక్ నన్ను ఓదార్చుతాడు. అప్పుడు జాలి పడి నన్ను ఓదార్చుతాడు.

దాంతో నేను అతడికి దగ్గర అవుతాను. ఆ మాత్రం అవకాశం చాలూ. మీరు హ్యాపీగా ఉండాలి. మీరు దేవుడిచ్చిన వరం అంటే.. నేను హస్పిటల్‌కు వెళ్తాను అంటే.. అంత తొందరగా పోవాలని ఉందా అంటూ మోనిత కసురుకొన్నది. ఆ మాటలను చూసి బాబాయ్ కంగారు పడితే.. మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉండు. నేను బయటకు వెళ్లి వస్తాను అంటూ మోనిత వెళ్లింది.

మరో డాక్టర్‌తో ఆపరేషన్

మరో డాక్టర్‌తో ఆపరేషన్

మోనిత వ్యవహారంపై కార్తీక్ ఇంట్లో చర్చ జరిగింది. మోనితను కార్తీక్ ఇంకా నమ్ముతున్నాడు. మోనిత ఎలాంటి కుట్రలు చేస్తుందో మనకు తెలుసు అని దీప అంది. ఓ వ్యక్తి చావు బతుకుల మధ్య ఉంటే.. ఆపరేషన్ చేయాలి. కానీ కార్తీక్ కాకుండా మరో డాక్టర్‌తో చేయించాలని అంటున్నాను అని సౌందర్య అంటే.. అవును నా మనసులో కూడా అదే ఉంది. కానీ అలా చెప్పే అవకాశం కూడా కార్తీక్ ఇవ్వడం లేదే అని తండ్రి ఆనందరావు ఆవేదన చెందాడు. దాంతో మీరు టెన్సన్ పడకండి.. ఏదో ఒకటి ఆలోచిద్దాం అంటే.. అవును.. మోనిత కుట్రలను తెలుసుకొనేందుకు ప్రయత్నించాలి అంటూ దీప చెప్పింది.

కొడుకు గుట్టు విప్పిన అప్పారావు

కొడుకు గుట్టు విప్పిన అప్పారావు

ఇదిలా ఉండగా.. మోనిత బయటకు వెళ్తుంటే.. తాడికొండలో హోటల్‌లో పనిచేసే అప్పారావు అడ్డుపడ్డాడు. అప్పరావు కారుకు అడ్డు రావడంతో చస్తావా అంటూ కోపగించుకొన్నది. అయితే మోనితను గుర్తుపట్టి.. మీరు నన్ను గుర్తించారా అంటే.. విసుక్కొన్నది. అయితే పక్కకు తప్పుకో అంటూ కారు ముందుకు కదలడంతో అప్పారావు పక్కకు తప్పుకొన్నాడు.

అంతలోనే అప్పారావు భుజానికి ఉన్న బ్యాగ్ కిందపడి అందులో నుంచి కొటేష్ ఫోటో కిందపడింది. ఆ ఫోటోను చూసిన మోనిత.. ఇతను నీకు తెలుసా అంటే.. అవును అని అన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మోనిత అంటే.. మీకు కలవడు. అతడితోపాటు ఆయన భార్య కూడా యాక్సిడెంట్‌లో చనిపోయారు. వారి బాబు ఇప్పుడు కార్తీక్, దీప వద్ద పెరుగుతున్నాడు అనగానే.. దీప ముఖం వెలిగిపోయింది.

Recommended Video

Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
మోనితకు కార్తీక్ చెంపదెబ్బ

మోనితకు కార్తీక్ చెంపదెబ్బ

ఇదిలా ఉండగా, కార్తీక్, దీప, మోనిత మధ్య ఎమోషనల్ సన్నివేశాలు తాజా ప్రోమోలో కనిపించాయి. మోనితను లాగి చెంప మీద కార్తీక్ ఒక్కటిచ్చాడు. నీ వల్ల నా కుటుంబం మొత్తం నరకం అనుభవిస్తున్నది. నువ్వు ఎవ్వరివి? అని కార్తీక్ అంటే.. తాళిని మోనిత చూపించింది. వెంటనే కార్తీక్ తాళిని తెంపేసి.. నా కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే.. నీకు ఏం కావాలో చెప్పు అని కార్తీక్ నిలదీశాడు. దాంతో నా బాబు నాకు కావాలి అంటూ మోనిత చెప్పడంతో కార్తీక్, దీప కంగారు పడిపోయారు. ఇలా ఆసక్తికరమైన మరో ఎపిసోడ్‌కు తాజా ప్రోమో లీడ్ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X