Karthika Deepam ఈశ్వరా, పరమేశ్వరా.. ఏమిటీ లీలలు అంటూ టెన్షన్‌లో సౌందర్య.. సీరియల్‌లో మరో ట్విస్టు!

తాడికొండకు చెందిన అప్పారావు యాక్టర్ కావాలనే కోరికతో ఆడిషన్స్ కోసం అప్పారావు హైదరాబాద్‌కు వచ్చి సౌందర్యను కలుసుకొన్నాడు. తాను యాక్టర్ అవ్వాలని ఉంది. మీరు నాకు ఆశీస్సులు ఇవ్వడం మేడమ్ అంటూ అప్పారావు అడిగితే.. నీవు చేస్తున్న పనిని వదిలేయకు.. హోటల్‌లో పనిచేస్తూనే.. వేషాల కోసం ప్రయత్నించు. యాక్టర్‌గా బిజీగా అయిన తర్వాతే హోటల్ పని వదిలేయ్. కావాలంటే నేనే నీకు హోటల్ పెట్టిస్తాను అని సౌందర్య సలహా ఇచ్చింది.

దాంతో తాడికొండ గ్రామంలో శౌర్య, హిమ చదువుకొన్న స్కూల్‌కు సంబంధించిన టీసీలు, సర్టిఫికెట్లు, కొన్ని ఫోటోలను ముందు పెట్టాడు. అయితే ఫోటోలోని వ్యక్తులు ఎవరంటే.. కోటేష్ దంపతులు అని చెప్పాడు. దాంతో సౌందర్య ఒక్కసారిగా షాక్ తిన్నది. కార్తీక్ దీపం సీరియల్‌లోని తాజా ఎపిసోడ్ 1283లో ఇంకా ఏం సంఘటనలు చోటుచేసుకొన్నాయంటే..

అప్పారావు తెచ్చిన ఫోటోలను చూసి..

అప్పారావు తెచ్చిన ఫోటోలను చూసి..

అప్పారావు ఇచ్చిన ఫోటోలు చూసిన సౌందర్య దిగ్బ్రాంతికి లోనై ఎవరు వీళ్లు అంటే.. కార్తీక్, దీప ఉన్న ఇళ్లు వాళ్లదే. కోటేశ్ దంపతులు వాళ్లు యాక్సిడెంట్‌లో చనిపోయారు. వాళ్ల బాబునే దీప, కార్తీక్ పెంచుకొంటున్నారు అనగానే సౌందర్య కంగారు పడిపోయింది. వెంటనే తన ఫోన్‌లో ఆనంద్‌ను ఎత్తుకెళ్తున్న కోటేష్ ఫోటోను చూసి మరోసారి షాక్ తిన్నది. వీళ్లకు ఎంత మంది పిల్లలు అంటే.. వారికి పిల్లలు లేరు.

ఎక్కడి నుంచో తీసుకొచ్చారుట. అని అప్పారావు చెప్పడంతో ఆందోళనకు గురైంది. ఆనంద్ మోనిత కొడుకా? ఈశ్వరా.. పరమేశ్వరా.. ఏమిటి నీ లీలలు అని మనసులో సౌందర్య అనుకొన్నది. ఆ తర్వాత ఆనంద్ నాన్న లాగా ఉంటాడు. నాన్న ఎత్తుకొంటే ఏడుపు మానేస్తాడు అని శౌర్య చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకొన్నది.

దేవుడా ఏమిటీ ఈ పరీక్ష

దేవుడా ఏమిటీ ఈ పరీక్ష

అప్పారావు వెళ్లిపోవడంతో ఆనందరావు గురించి ఆలోచనల్లో పడింది. ఏ తల్లి కన్నబిడ్డవో అనుకొన్నాను అని అనుకొంటుండగా.. ఆనందరావును ఎత్తుకొని శౌర్య, హిమ వచ్చారు. దాంతో ఆనందరావు ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు గుర్తు చేసుకొన్నది. మోనితను గుర్తు చేసుకొని దేవుడా ఏమిటి ఈ పరీక్ష అంటూ సౌందర్య టెన్షన్ పడిపోయింది. అలాంటి ఆలోచనల నుంచి తేరుకొని కానిస్టేబుల్ రత్నసీతకు ఫోన్ చేసి.. ఏదో చెప్పింది. ఆ తర్వాత ఈశ్వరా ఏమిటి పరీక్ష అంటూ సౌందర్య కంగారుపడిపోయింది.

అసలు డ్రామా అప్పుడే అంటూ

అసలు డ్రామా అప్పుడే అంటూ

ఇక దీప, కార్తీక్ ఇద్దరు తనను కొట్టడం, తాళిని తెంచేయడాన్ని గుర్తు చేసుకొని నిర్వేదానికి గురైంది. ఆనందరావు మీ నాన్న నన్ను కొట్టాడు అంటూ ఓ వైపు ఆనందం, బాధతో కనిపించింది. ఆనందరావు.. మీరు అమ్మను వదిలేశావని బాధపడ్డాడు. కానీ నాన్న వద్దకు వెళ్లాడని తెలిసి ఆనందపడిపోయాను. మీ నాన్న గారు నేను కట్టుకొన్న తాళిని తెంచేశాడు. నన్ను, మీ నాన్నను కలుపడానికి మీరు నాన్న వద్ద ఉన్నావా? నిన్ను వెతకమని మీ నాన్నకు చెప్పాను.

ఆ ఇంట్లో అందరికి నీవంటే చాలా ఇష్టం. కొన్నాళ్లకు నిన్ను వదులుకోవడానికి వాళ్లకు కష్టమవుతుంది. అప్పుడే నేను వస్తాను. నువ్వు నా ఆనందరావు అని తెలిసి అందరూ షాక్ అవుతారు. అప్పుడు నా అసలు డ్రామా మొదలుపెడుతాను. నా ఆపరేషన్ బ్లడ్ రిలేషన్ కచ్చితంగా సక్సెస్ అవుతుంది. అప్పుడు మీ అమ్మను పిలిపిస్తారు. నువ్వు మీ నాన్న వద్ద ఉన్నావు. అదే చాలూ. కొన్నాళ్లు అమ్మ వద్ద ఉన్నావు. ఇప్పుడు నాన్న వద్ద ఉంటున్నావు. కొన్నాళ్లకు మమ్మీ, డాడీ వద్ద ఉంటావు. మనమంతా కలుస్తాం. నీవు కలుపుతావు. దేవుడా నీవు ఉన్నావు అంటూ మోనిత మురిసిపోయింది.

నాకు కోపాలు, భయం ఉన్నాయంటూ..

నాకు కోపాలు, భయం ఉన్నాయంటూ..

మోనితను కొట్టి తాళి తెంచిన తర్వాత కార్తీక్, దీప మధ్య ఎమోషనల్‌గా సంభాషణ జరిగింది. ఇంకా నీవు మోనితను నమ్ముతున్నావా? ఆమె కోసం బిడ్డను వెతికి పట్టుకంటావా? అని దీప అంటే.. మనం నడిసంద్రంలో చిక్కుకున్నాం. వేరే దారి లేదు. మోనిత తనకు తానే ఓ అవకాశం ఇచ్చింది అని కార్తీక్ అంటే.. మీకు కోపం వచ్చినా మోనిత గురించి ఓ విషయం చెబుతాను. మోనిత నిలువెల్లా విషయం నింపుకొన్న మనిషి. ఇన్నాళ్లు మనల్ని చిత్రహింసలు పెట్టింది.

ఒకరికొకరం కాకుండా పోయాం. ఇంకా ఆ రాక్షసి మాటలు వింటావా అని దీప ప్రశ్నించింది. సరే మోనిత మాటలు నమ్మద్దు. కానీ మరేదైనా ప్లాన్ ఉందా? మనం భయపడటం కంటే.. ఏదో ఒకటి తేలిపోతుందిగా. నీకున్న భయం, కోపాలు నాకు లేవా? మోనితను చంపి జైలుకు వెళ్లాలని ఉంది. కానీ ఓ డాక్టర్‌ను, కొడుకు, భర్తను, తండ్రిని అనే విషయాన్ని గుర్తు చేసుకొని నా కోపాన్ని కంట్రోల్ చేసుకొంటున్నాను. పిచ్చెక్కుతున్న వివేకంతో నా కోపాన్ని అణిచివేసుకొంటున్నాను. ఎలాంటి తప్పు చేయకుండా కంట్రోల్‌లో ఉంటున్నాను అని కార్తీక్ అన్నాడు. దాంతో ఇన్నాళ్లు నీ కోపం ఏమైంది అని దీప అంటే.. అవేమీ ఆలోచించకు.. నేను బిడ్డను వెతికి ఇచ్చి ఈ సమస్యకు పరిష్కారం సూచిద్దాం అంటూ కార్తీక్ చెప్పి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారు.

ఇంట్లో ఏదో కీడు అంటూ..

ఇంట్లో ఏదో కీడు అంటూ..

హాస్పిటల్ నుంచి వచ్చిన కార్తీక్ నీరసంగా ఉంటే. తల్లిదండ్రులు వచ్చి ఏం అలా ఉన్నావు అని అడిగితే.. కొంచెం అలిసిపోయాను అని చెప్పి.. శౌర్య, హిమ వద్ద ఉన్న ఆనంద్‌ను తీసుకొని.. నిన్ను ఎత్తుకొంటే అలసట వెంటనే పోతుంది. ఏమిటి? నిన్ను ఎత్తుకొంటే.. అలసట పోయి ఆనందం వస్తుంది. మాకు ఆనందం నింపడానికే మా వద్దకు వచ్చావు అని తన బెడ్‌రూంలోకి వెళ్లాడు. కార్తీక్ చికాకుగా ఎందుకు ఉన్నాడనే విషయం అడిగితే.. హాస్పిటల్‌లో జరిగిన గొడవ గురించి దీప చెప్పింది. దాంతో మోనిత వల్ల మా ఇంట్లో ఏదో జరుగుతుందనే కీడు శంకిస్తుందని సౌందర్య తన మనసులో అనుకొన్నది.

ఇంట్లో పెరుగుతున్న బిడ్డ మోనిత కొడుకే అంటూ

ఇంట్లో పెరుగుతున్న బిడ్డ మోనిత కొడుకే అంటూ

అయితే ఇంట్లో పెరుగుతున్న బిడ్డ ఆనంద్‌కు అందరూ దగ్గరైపోతున్నారని సౌందర్య మదనపడుతూ తన భర్త ఆనందరావుకు అసలు విషయం చెప్పేందుకు ప్రయత్నించింది. మీరు టెన్షన్ పడనంటే.. నేను మీకు ఒక విషయం చెబుతాను అని సౌందర్య అంటే.. చెప్పు.. నేను కంగారు పడను అంటూ ఆనందరావు సమాధానం ఇచ్చాడు. మన ఇంట్లో పెరుగుతున్న బిడ్డ మోనిత కొడుకు అని సౌందర్య చెప్పగానే.. ఒక్కసారిగా ఆనందరావు షాక్ తిన్నాడు.

ఏమిటి ఆనంద్ మోనిత కొడుకా? అని షాక్‌లో లేచి నిలపడటంతో.. టెన్షన్ పడకంటూ సౌందర్య ఓదార్చింది. టెన్షన్ పడకపోవడం ఏమిటి సౌందర్య.. మోనిత ఎప్పుడైతే బిడ్డను కన్నాడో మన టెన్షన్ పదింతలైంది. బిడ్డ తప్పిపోయాడని మోనిత ఏడుస్తున్నది. తప్పిపోయిన బిడ్డ మన ఇంట్లో పెరుగడమేమిటి? ఈ విషయం నీకు ఈ విషయం ఎలా తెలుసు అని ఆనందరావు కంగారు పడ్డాడు.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
మోనిత నోర్మూయ్ అంటూ దీప

మోనిత నోర్మూయ్ అంటూ దీప

కార్తీకదీపం సీరియల్‌లో తాజా ప్రోమో మరో భావోద్వేగమైన ఎపిసోడ్‌కు తెరలేపడానికి సిద్దమైంది. మోనిత బిడ్డను ఎత్తుకెళ్లిన విషయానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మీ వద్ద ఉందంట కదా.. నేను బిడ్డను వెతికి తెచ్చి ఇస్తానని మోనితకు మాటిచ్చాను అని చెప్పడం కనిపించింది. ఇక శౌర్య, హిమ ఆనంద్‌ను ఆడిస్తుండగా.. మోనిత అక్కడికి వచ్చి.. ఎవరు ఈ బాబు అంటే.. మా తమ్ముడు అంటూ హిమ, శౌర్య సమాధానం చెప్పారు.

దాంతో ఆనంద్‌ను చేతిలోకి తీసుకోగా.. దీప వచ్చి లాగేసుకొన్నది. వీడు మా బంగారు కొండ అని దీప అంటే.. ఎవరి బిడ్డనో తెచ్చుకొంటేనే అంటూ మోనిత ఏదో చెప్పబోగా.. నోర్మూయ్ అంటూ దీప గట్టిగా అరిచింది. ప్రోమో రాబోయే ఎపిసోడ్‌పై అంచనాలు పెంచేలా కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X