Karthika Deepam మోనిత కొడుకు విషయంలో మరో ట్విస్టు.. ఇంటి నుంచి బయటకు నెట్టిన దీప!

కోటేశ్ దంపతులు ఇచ్చిన పిల్లాడు ఆనంద్ చుట్టే కథ తిరుగుతున్నది. మోనిత కొడుకు ఎక్కడెక్కడికో తిరిగి మళ్లీ మన ఇంటికి వచ్చాడు. పాపం పిల్లాడికి ఏం తెలుసు ఇవనీ అంటూ సౌందర్య, ఆనందరావు చర్చించుకొంటూ కనిపించారు. అయితే కోటేశ్ దంపతులు కోరుకొన్నట్టే ఆనంద్‌ను డాక్టర్ చేస్తాను అంటూ వారి ఫోటోను బీరువాలో పెట్టింది. అయితే కోటేశ్‌కు సంబంధించిన సూట్ కేస్‌లో ఓ ఫైల్ కనిపించడంతో దానిని తెరిచి చూడగా.. కారు నంబర్ కనిపించింది. అయితే అంతోనే మామయ్య కాఫీ అడగడంతో దానిని పక్కనే పెట్టి వెళ్లింది. అయితే ఆనందరావుకు దీప కాఫీ ఇచ్చి మాట్లాడుతుంటే.. గిఫ్టు బ్యాగులు తీసుకొని కార్తీక్ ఇంటిలోకి మోనిత ఎంట్రీ ఇచ్చింది. హలో మామయ్య, అత్తమ అంటూ తనదైన శైలిలో పలకరించింది. మోనితను చూడగానే దీపకు చిర్రెత్తుకొచ్చింది. ఇంకా కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్‌ 1286లో ఇంకా ఏం జరిగిందంటే..

Photos Courtesy: Star మా and Disney+Hotstar

మోనితకు దీప వార్నింగ్

మోనితకు దీప వార్నింగ్

ఆనందరావు ఒడిలో తన కుమారుడు కూర్చొని ఉండటం చూసి క్యా సీన్ హై అంటూ మోనిత ముచ్చటపడిపోయింది. తాత ఆనందరావు ఒడిలో మనవడు ఆనందరావు అంటూ మనసులో అనుకొన్నది. అయితే దీప చేతిలో గిఫ్టు బ్యాగులను చూసి.. ఏమిటిది అంటూ ప్రశ్నిస్తే.. ఇది ఊయ్యాల.. ఇదేమో బాబుకు కొత్త బట్టలు. కొత్త బట్టలు బాబుకు వేసి ఉయ్యాలలో పడుకోబెట్టి.. ఉయ్యాల.. జంపాల అంటూ పాటపాడండి అంటూ మోనిత అంటే.. నోర్మూసుకొని బయటకు వెళ్లు అంటూ దీప వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఈ బాబును చూడగానే నా కొడుకు గుర్తుకు వచ్చాడు. ఎక్కడున్నాడో ఏమో అంటూ మోనిత అంటూ బాబును ఎత్తుకోబోయింది. దాంతో ఏయ్ నా బాబు ముట్టుకోకు అని దీప మళ్లీ అరిచింది. వాడు నీ బిడ్డనా అని మోనిత ప్రశ్నిస్తే.. అవును.. నా బిడ్డే.. మా వాడే అంటూ దీప సమాధానం ఇచ్చింది. దాంతో మోనిత చప్పట్లు కొట్టింది.

ఇంకోసారి ఆ మాట అంటే.. మర్యాద ఉండదు

ఇంకోసారి ఆ మాట అంటే.. మర్యాద ఉండదు


మోనిత తీరును చూసి సౌందర్య కూడా కోపం తెచ్చుకొన్నది. మోనిత మాట్లాడకుండా బయటకు వెళ్లు అని సౌందర్య అంటే.. బాగుంది.. ఎవరో బిడ్డను తెచ్చుకొని సంబరపడిపోతున్నాడు. నేను ఇచ్చిన బిడ్డను మాత్రం దూరం పెట్టారు. ఎవరి మీదో ఇంత ప్రేమ చూపిస్తున్నారు అని మోనిత అంటే.. ఏంటమ్మా నీ బాధ.. మేము బిడ్డను తెచ్చుకొంటే మీకెందుకు బాధ అని ఆనందరావు అన్నారు. నాకు ఏమీ బాధ లేదు. నా బిడ్డను ఎందుకు ప్రేమగా చూసుకోలేదన్నదే నా బాధ. నా బిడ్డను వెతకండి.. లేకపోతే ఈ బిడ్డను నాకు ఇచ్చేయండి అని మోనిత అంటే.. ఇంకోసారి ఆ మాట అంటే.. మర్యాద ఉండదు. వెళ్లు అవతలికి అంటూ దీప వార్నింగ్ ఇచ్చింది. దాంతో దీపక్క.. ఈ బిడ్డలో నా బిడ్డను చూసుకొంటున్నాను అంటే.. బయటకు వెళ్లు అంటూ దీప కోపగించుకొన్నది. దాంతో నా బిడ్డ దొరికిన తర్వాత నీవు రమ్మన్నా నేను రాను అంటూ మోనిత చెప్పింది.

త్వరలోనే అమ్మ నీ వద్దకు

త్వరలోనే అమ్మ నీ వద్దకు


అయితే మోనిత తీరును భరించలేక ఆమె చేతిని పట్టుకొని బయట వరకు లాక్కొచ్చి.. ఇంటి నుంచి బయటకు నెట్టింది. చేతిలో ఉన్న వస్తువులను దీప బయటకు విసిరికొట్టింది. ఆ తర్వాత ఇంటి తలుపులు మూసింది. దాంతో దీప విసిరికొట్టిన గిఫ్ఠులన్నింటిని తీసుకొని.. బాయ్ ఆనందరావు.. త్వరలోనే అమ్మ నీ వద్దకు వస్తుంది అని చెప్పింది. ఇదంతా జరిగిన తర్వాత షాపింగ్‌కు వెళ్లిన శౌర్య, హిమ ఇంటికి వచ్చారు. బాబాయ్ మాకు కొనిచ్చారంటూ చెప్పారు. తమ్ముడికి బట్టలు కొందామని అనుకొన్నాం. కానీ సైజు తెలియక తీసుకురాలేదు. తమ్మడు అంటే మాకు ఇష్టం. వాడిని ఒక్క క్షణం కూడా ఉండలేం. ఇంటి బయట మోనిత అంటీ కనిపించింది. కానీ కోపంతో వెళ్తుంది. మోనిత ఆంటీ ఎప్పుడు వచ్చినా మూడ్ ఆఫ్‌తో వెళ్తుంది ఎందుకు అని శౌర్య ప్రశ్నించింది. అయితే పిల్లలకు ప్రశ్నలకు ఏదో సమాధానం చెప్పి అక్కడి నుంచి పంపించారు.

మోనితదీ కారు అంటూ..

మోనితదీ కారు అంటూ..


అయితే ఆనంద్‌ను తీసుకొని దీప బయటకు వెళ్తుంటే.. రోడ్డుపై ఓ కారు కనిపించింది. ఆ కారు నెంబర్ చూసి ఈ నంబర్‌ను ఎక్కడో చూశాను అంటూ గుర్తు తెచ్చుకోవడంతో.. ఇంట్లో కోటేష్ బుక్‌లో రాసిన నెంబర్ గుర్తుకొచ్చింది. కోటేష్ ఈ నంబర్ ఎందుకు రాశాడు. ఆ నంబర్ పక్కనే క్షమించండి ఎందుకు రాశాడు అంటూ అనుమానంతో దీప కారు వద్దకు వెళ్లింది. కారులో లక్ష్మణ్ ఉంటే.. ఏంటి ఎక్కడ ఉన్నావు.. ఈ కారు ఎవరిది? అని దీప అడిగింది. దాంతో ఈ కారు మోనితది. ఈ కారు‌ను సర్వీసింగ్కు ఇచ్చారు అని లక్ష్మణ్ చెప్పగానే.. దీప ఫ్యూజులు ఎగిరిపోయాయి. చేతిలో కూరగాయల బుట్ట కిందపడేసింది.

ఆనంద్ మోనిత కొడుకా?

ఆనంద్ మోనిత కొడుకా?

కారు మోనితది అని చెప్పగానే.. కంగారు పడిపోయిన దీపను లక్ష్మణ్ అదోలా చూశాడు. అయితే దాంతో కోటేశ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నా భార్యకు గర్బం పోతే అనాధ పిల్లాడిని తెచ్చుకొని పెంచుకొంటున్నాం అన్నాడు. అయితే కోటేశ్ ఎత్తుకొచ్చిన బిడ్డ మోనిత కొడుకా అంటూ దీప షాక్ తిన్నది. వీడు మోనిత కొడుకా? అంటూ టెన్షన్ పడింది. దాంతో కింద పడిన బుట్టను దీప చేతికి లక్ష్మణ్ ఇచ్చాడు. ఆ తర్వాత అనేక ఆలోచనల్లో నడుచుకొంటూ వెళ్లూ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాను అంటూ మోనిత చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చాయి. మోనిత బిడ్డ మా వద్ద పెరిగాడా? వాడితో ఇంత అనుబంధం పెంచుకొన్నామా అని మనసులో అనుకొన్నది.

సీసీఫుటేజ్‌తో అసలు గుట్టు

సీసీఫుటేజ్‌తో అసలు గుట్టు


దీప పలు ఆలోచనలతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రత్న సీతను కలిసింది. దీపను చూసి.. దీపక్క? ఏమిటి ఇలా వచ్చావు? ఈ బాబు ఎవరు? అని రత్న సీత అడిగితే.. అవన్నీ తర్వాత చెబుతాను.. నాకు ఓ సహాయం కావాలి అని దీప అడిగింది. అయితే మోనిత బిడ్డను ఎత్తుకెళ్లిన సీసీ ఫుటేజ్ నా వద్ద లేదు అని చెప్పింది. అయితే నాకు సాయం చేయమని అడిగితే.. మోనిత తెలియజేయ వద్దని చెప్పిందే అని మనసులో అనుకొన్నది. అయితే చివరికి నా వద్ద వీడియో ఉన్నందంటూ చూపించగానే.. దీప షాక్ తిన్నది.. భగవంతుడా? కోటేష్ ఎంత పనిచేశావు అని అనుకొన్నది. ఆ తర్వాత తన బిడ్డ మా వద్ద ఉన్నదనే విషయం మోనితకు తెలుసా? అనే ఆలోచనల్లో పడింది. అయితే ఈ వీడియో చూపించినట్టు ఎవరికి చెప్పకండి.. మోనిత వల్ల నాకు ప్రమాదం ఉంటుంది. నీపై ప్రేమ కొద్ది చూపించాను అని రత్న సీత అంది. అయితే కార్తీక్ వచ్చి అడిగితే.. వీడియో లేదని చెప్పు అని బయటకు వెళ్లింది.

Recommended Video

Karthika Deepam Vantalakka Live Video || కార్తీక దీపం సీరియల్‌ నుంచి తప్పుకోవడం పై దీప క్లారిటీ !
కార్తీకదీపం రేటింగ్ ఇలా...

కార్తీకదీపం రేటింగ్ ఇలా...


ఇక కార్తీకదీపం సీరియల్ విషయానికి వస్తే.. వరుసగా చాలా నెలల నుంచి ఈ సీరియల్ టాప్ రేటింగ్‌లో సాగుతున్నది. ఊహించని ట్విస్టులు, మంచి కథనం ఉండటంతో ప్రతీ వారం 13 పాయింట్లకుపైగానే రేటింగ్‌ను నమోదు చేసుకొంటున్నది. తాజా వారంలో కార్తీక దీపం సీరియల్‌కు 13.42 రేటింగ్ నమోదైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X