Karthika Deepam పద్మవ్యూహంలో చిక్కిన కార్తీక్ ఫ్యామిలీ.. మోనిత దెబ్బకు వంటలక్క కంటతడి!

డాక్టర్ మోనిత బిడ్డ తమ వద్ద పెరుగుతున్నారనే విషయాన్ని తెలుసుకొన్న దీప తీవ్రంగా కలత చెందింది. తమ మనసుకు, హృదయానికి చేరువైన ఆనంద్.. మోనిత కుమారుడా? అందుకే మోనిత అదోరకంగా ప్రవర్తిస్తుందా? అనే అనుమానాలతో దీప సతమతమైంది. మార్కెట్‌కు నుంచి ఇంటికి వెళ్తూ గుడి మెట్ల మీద కూర్చొని ఆనంద్ తమ వద్దకు వచ్చిన విషయాలను గుర్తు చేసుకొన్నారు. ఏంటి కోటేశ్.. ఎంత పనిచేశావు.. మోనిత బిడ్డను ఎత్తుకొచ్చావా? అంటూ మదనపడిపోయింది. ఈ బిడ్డ మోనిత కొడుకు అని డాక్టర్‌ బాబుకు ఎలా చెప్పాలి? తమ్ముడు తమ్ముడు అంటూ సంబరపడిపోతున్నాడు? ఎప్పటికైనా వెళ్లిపోతాడని ఎలా చెప్పగలను.

నేను ఎలా వీడిని వదిలి ఉండగలను? ఏరా నాన్న నిన్ను వదిలి పెట్టి ఉండలేను కదా.. అమ్మను వదిలిపెట్టి వెళ్లిపోతావా? అత్తయ్య, మామయ్యలకు వీడితో చనువు ఏర్పడలేదు అని దీప కంటతడి పెట్టుకొన్నది. కోటేశ్ గురించి అత్తయ్య చూసిందా? నిజం తెలిసే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేదా? అయ్యో అత్తయ్య.. ఈ బాధను మీరే ఒంటరిగా మోస్తున్నారా. ఇంత తెలిసి మీరేక్కరే ఈ బాధను దిగమింగుతున్నారా? అంటూ ఆవేదన పడింది. ఇంకా కార్తీకదీపం సీరియల్‌లో తాజా ఎపిసోడ్ 1287లో ఇంకా ఏం జరిగిందంటే?

అత్తమ్మ మీరు గొప్పవాళ్లు..

అత్తమ్మ మీరు గొప్పవాళ్లు..

గుడి మెట్లపై కూర్చొని దీప ఎడుస్తుండగా కారులో కార్తీక్ అక్కడికి వచ్చారు. ఏంటి దీప.. ఇక్కడ కూర్చున్నావు అని అడిగితే.. కూరగాయాల కోసం వచ్చాను అని దీప సమాధానం చెప్పింది. దాంతో ఆనంద్‌ను ఎత్తుకొని.. కనిపించగానే డాడీ అని పిలువా? హలో చెప్పవా అంటూ కార్తీక్ ముద్దు చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కార్తీక్, దీప ఇంటికి బయలుదేరి వెళ్లారు.

ఇంటికి చేరుకోగానే.. ఆనంద్‌ను చూసి హిమ హ్యాపీగా ఫీలైంది. ఎదురుగా ఉన్న అత్త సౌందర్యను చూసి.. మీరు చాలా గొప్పవాళ్లు.. ఇంతటి భారాన్ని ఎలా గుండెలో మోస్తున్నారు? ఆనంద్ మోనిత కొడుకు అనే విషయాన్ని తెలుసుకొని నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని దీప మనసులో ఆవేదనకు గురైంది.

ఆనంద్ ఇంకా ఎక్కువ రోజులు

ఆనంద్ ఇంకా ఎక్కువ రోజులు


ఇంటిలో తన అత్త సౌందర్యను చూస్తూ.. ఆనంద్ ఇంకా ఎక్కువ రోజులు ఉండరేమో.. ఈ విషయం తెలిస్తే.. పిల్లలు ఎలా బాధపడుతారో అని దీప, సౌందర్య అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హిమ తన తండ్రితో మాట్లాడుతూ.. నాకు కారు డ్రైవింగ్ నేర్పించు.. తమ్ముడు పెద్దయ్యాక నేను కారులో తీసుకెళ్లి.. ఆనంద్‌ను స్కూల్‌లో దిగబెడుతా అని హిమ అంటే.. ఆనంద్‌ను నాకు ఇవ్వడం లేదు.. హిమనే ఎప్పుడూ ఎత్తుకొంటున్నది అంటూ శౌర్య ఫిర్యాదు చేసింది.

ఆనంద్ మోనిత కొడుకు అంటూ దీప

ఆనంద్ మోనిత కొడుకు అంటూ దీప


ఇక ఆనంద్ గురించి ఆలోచిస్తూ సౌందర్య అనేక ఆలోచన్లతో కొట్టుమిట్టాడింది. పిల్లలు, దీప, కార్తీక్ ఆనంద్‌పై ఎనలేని ప్రేమను పెంచుకొంటున్నారు. కానీ వద్దని చెప్పలేను. ఎందుకు అంటే.. సమాధానం చెప్పలేను అని సౌందర్య తన మనసులో అనుకొంటుంటే.. దీప అక్కడకు వచ్చింది. అయితే పక్కనే ఉన్న దీపను చూసి.. నీవు ఎప్పుడొచ్చావు అంటే.. ఇప్పుడే అని దీప సమాధానం చెప్పింది. ఆనంద్ గురించి దీప చెబుతూ.. వీడు వస్తూ వస్తూ అందరికి బోలెడంత ప్రేమను పంచాడు. కానీ ఇప్పుడు చేదుగా మారింది. నేను పుట్టిన గడియనో.. లేదా జాతకమో.. వీడి ద్వారా పెద్ద సమస్య ఎదురైంది కదా అని దీప అంది. దాంతో దీపకు నిజం తెలిసిందా అని సౌందర్య మనసులో అనుకొంటే.. వీడు మోనిత కొడుకు అని మీకు తెలుసు అని నాకు తెలుసు అత్తయ్య అని దీప చెప్పింది.

 ఈశ్వరా.. ఏమిటి ఈ పరీక్ష

ఈశ్వరా.. ఏమిటి ఈ పరీక్ష


దీపను ఊరడిస్తూ.. ఈశ్వరుడికి మన మీద ఎలాంటి కోపమే తెలియదు కానీ.. మనల్ని ఎలాంటి సమస్యల్లోకి నెట్టాడు అని సౌందర్య అంటే.. మీ వద్ద ఉన్న వీడియోను కార్తీక్ ఇవ్వొచ్చు కదా.. మోనిత బిడ్డను వెతికించి ఆమెను వదిలిచ్చుకొందామని అనుకొంటున్నాడు. కానీ మనం ప్రేమించే ఆనంద్ మోనిత కొడుకనే విషయం కార్తీక్ తెలియదు. మమ్మల్ని చక్రవ్యూహంలో భగవంతుడు నెట్టాడు. మోనితకు ఆనంద్ మన ఇంట్లో ఉన్న విషయం తెలుసు. మోనిత మనలను చక్రవ్యూహంలోకి నెట్టింది. బంధాలతో బందీ చేయాలనే పద్మవ్యూహం. ఆనంద్‌ను వదులుకోలేం.. మోనితకు ఇవ్వలేం అని దీప కన్నీటిపర్యంతమైంది.

నర్సుకు మోనిత షాక్

నర్సుకు మోనిత షాక్


కార్తీక్ ఇంటికి వెళితే.. ఇంటి నుంచి దీప తనను బయటకు నెట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని మోనిత పిచ్చెక్కిన దానిలా వ్యవహరించింది. దాంతో మోనిత మేడమ్ ఎవరికి అర్ధం కాదు.. ఏం చేస్తుందో ఏమో అంటూ నర్సు మనసులో అనుకొంటే.. నేను అర్ధం కానని అనుకొంటున్నావా?.. నేను జీతం ఇచ్చేది ప్రశ్నలు అడగడానికి కాదు అని మోనిత దురుసుగా సమాధానం చెప్పింది.

బాబాయ్‌ను పావుగా వాడుకొందామనుకొంటే..

బాబాయ్‌ను పావుగా వాడుకొందామనుకొంటే..


ఇక బాబాయ్‌ను పావుగా వాడుకొందామని ప్లాన్ చేస్తే.. తనకు తెలియకుండా ఆయనకు కార్తీక్ గుండె ఆపరేషన్ సక్సెస్ చేశాడు. డిశ్చార్జి అయి చెప్పపెట్టకుండా అమెరికాకు వెళ్లిపోయాడు. ఒక ప్లాన్ పోతే.. మరో ప్లాన్ వచ్చింది. నా కొడుకే నన్ను గెలిపిస్తాడు. నా బిడ్డను వెతికి నన్ను వదలించుకోవాలని చూస్తున్నాడు. కానీ అది జరిగే పని కాదు. నా బిడ్డను నీ ఇంట్లో పెట్టుకొని నా బిడ్డ నా బిడ్డ అంటూ సంబరపడిపోతున్నారు. చివరకు ఆనంద్ నా బిడ్డ అని తెలిసినప్పుడు చుక్కలు కనిపిస్తాయి. ఈ సారి నా ప్లాన్‌లో ఎలాంటి మార్పు ఉండదు. నా కొడుకును ఇచ్చేయమని అంటే.. వాళ్ల ముఖాలు ఎలా ఉంటాయో చూడాలి. నీవు ప్రేమించేది నా కొడుకునే.. నా దెబ్బకు కార్తీక్ లొంగిపోవాల్సిందే. ఈ అవకాశాన్ని గెలుచుకొంటాను. దీనిని తప్పకుండా వినియోగించుకొంటాను. నిన్ను నేను గెలుచుకొంటాను. నాకు గుడ్ లక్ చెప్పు. నీవు ఓడిపోతావు.. చివరకు మోనిత ప్రేమ గెలుస్తుంది అంటూ మోనిత తనలో తాను సంతోషపడిపోయింది.

కార్తీకదీపంలో మరో ట్విస్టు

కార్తీకదీపంలో మరో ట్విస్టు


ఇక కార్తీకదీపం సీరియల్‌లో మరో ట్విస్టుకు తెరలేపారు. మోనిత ఇంటికి కార్తీక్ వెళ్లడం.. ఆయనకు మోనిత పూలదారి ఏర్పాటు చేసి స్వాగతం పలకడం, అలాగే కార్తీక్ నడిచివస్తుంటే.. మోనిత ఆనందంగా చూడటంతో ఆనంద్ గురించి కార్తీక్ తెలిసిందేనే విషయం స్పష్టమవుతున్నది. దాంతో ఇలాంటి విషయాలు మరింత ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి. ఇలాంటి అంశాలతో సాగుతున్న కార్తీక దీపం టాప్ రేటింగ్‌తో సాగుతున్నది. గతవారం 13.45 రేటింగ్‌ను నమోదు చేసి తెలుగు సీరియల్స్‌లో టాప్ టీఆర్పీని సొంతం చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X