Karthika Deepam కార్తీక్, దీప మరణం.. ఇంటికి చేరిన హిమకు షాక్ ఇచ్చిన శౌర్య

చిక్ మంగళూరు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్తీక్, దీప మరణించడం, ఆ దుర్ఘటనలో హిమ ప్రాణాలతో బయటపడటం జరిగిన సంగతి తెలిసిందే. గాయాలతో పడి ఉన్న హిమను చంద్రమ్మ, ఇంద్రుడు దంపతులు రక్షించి చేరదీస్తారు. ప్రమాదంలో తల్లిదండ్రులను పోగొట్టుకొన్నాననే విషయం తలుచుకొని హిమ పుట్టెడు దు:ఖంతో రోదించింది. తనది హైదరాబాద్ అని, తన నానమ్మ వద్దకు చేర్చమని చంద్రమ్మ, ఇంద్రుడిని కోరింది. అయితే హిమ మాటలు ఉన్న చంద్రమ్మ.. మన వద్ద అంత డబ్బు ఎక్కడిది? హైదరాబాద్‌కు అమ్మాయిని చేర్చాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా అని ఇంద్రుడిని అడిగింది. అయితే తన పేరు ఇంద్రుడు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అనుకొన్నది చేస్తాను అని ఇంద్రుడు అన్నాడు. ఇంకా తాజా కార్తీక దీపం సీరియల్‌లో 1299 ఎపిసోడ్‌‌లో ఏం జరిగిందంటే..

హైదరాబాద్‌కు వెళ్తానని హిమ

హైదరాబాద్‌కు వెళ్తానని హిమ

హిమను హైదరాబాద్‌కు చేర్చే ప్రయత్నంలో ఇంద్రుడు ఉంటే.. నీవు దొంగతనం చేసి ఇతరలకు పెట్టడం ఏమిటో అర్ధం కావడం లేదు అని చంద్రమ్మ అంటే.. పైవాడు ప్రతీ పనికి ఒక్కడిని పెడుతాడు. కాబట్టి మనం చేయాల్సింది చేయడమే. మనల్ని దొంగతనం చేయని దేవుడు చెప్పాడు. అవసరం మేరకే దొంగతనం చేస్తూ.. లేనివాళ్లకు పెడుతున్నాం. దీనికి నీవు ఏం పేరు పెట్టుకొంటావో అని ఇంద్రుడు అన్నాడు. అయితే హైదరాబాద్‌కు ఎలా చేర్చుతావు అని చంద్రమ్మ అడిగితే. ఎవరో ఒకరు వస్తారు లే అంటుండగానే.. ఒక వ్యక్తి అటుగా వచ్చి ఫోన్‌లో మాట్లాడుతూ.. ఏటీఎంలో డబ్బు డ్రా చేసి.. పంపిస్తాను అని చెప్పాడు. అయితే చిన్న నాటకం ఆడి.. అందులో నుంచి 4 వేలు తీసుకొన్నాడు. అలా హిమను హైదరాబాద్‌కు పంపేందుకు డబ్బును ఇంద్రుడు, చంద్రమ్మ రెడీ చేశారు.

నా చేయిపై హిమ పేరు వద్దు..

నా చేయిపై హిమ పేరు వద్దు..

హిమ కారణంగా తన తల్లిదండ్రులు ప్రాణాలు పోగొట్టుకోవడాన్ని శౌర్య జీర్ణించుకోలేకపోయింది. హిమ అంటే సహించలేనని, తనకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా తనకు కనిపించకూడదని ఏడుస్తూ బాధలో మునిగింది. తన చేతిపై ఉన్న పచ్చబొట్టును చెరిపేసేందుకు ప్రయత్నించింది. ఏం చేస్తున్నావని శౌర్యను అడిగితే.. హిమ పేరు నా చేయిపై ఉంది. దానిని చెరిపేసుకొంటున్నానని బదులిచ్చింది. చేతిపై అక్షరాలు తుడిపేసుకొంటే.. అనుబంధాలు చెరిగిపోతాయా ఎవరు చెప్పారు నీకు అంటూ సౌందర్య చెప్పింది. అమ్మా, నాన్నను చంపేసిన హిమ పేరు నా చేయిపైన ఉండకూడదు అని సౌందర్యతో శౌర్య చెప్పింది. శౌర్య బాధను గమనించిన ఆదిత్య.. మళ్లీ వాళ్లను గుర్తు చేసుకొని ఎందుకు బాధపడుతున్నావు? మేము ఉన్నాం కదా అని అన్నాడు.

హిమను క్షమించను అంటూ

హిమను క్షమించను అంటూ

తన కొడుకు, కోడలు కార్తీక్, దీప చనిపోవడంతో సౌందర్య తీవ్రంగా కుమిలిపోయింది. కార్తీక్‌ను కడుపులో పెంచితే.. దీపను గుండెల్లో పెంచుకొన్నాను అని సౌందర్య రోదించింది. ఈ రోజు ఆ ఇద్దరు నాకు గుండె కోత పెట్టారు. నా బాధను ఎవరు అర్ధం చేసుకొంటారు అని సౌందర్య అంది. శౌర్య ఆవేదనను చూసి.. హిమపై కోపం పెంచుకొని నువ్వేమీ అయిపోతావనే బాధ మమ్మల్ని వెంటాడుతున్నది అని శ్రావ్య అంటే.. అమ్మా, నాన్న ఎన్నెన్నో కష్టాలు పడ్డారు. చివరకు ఆనందంతో జీవితం కొనసాగించాలనుకొంటే.. ఎవరికి ఆనందం లేకుండా హిమ చేసింది. నా జీవితంలో హిమను క్షమించను అంటూ శౌర్య అరిచి.. ఇంటిలోకి వెళ్లింది. దాంతో లేని వారి గురించి బాధపడలా.. తల్లిదండ్రలు లేని శౌర్య గురించి బాధపడాలా అనేది తెలియడం లేదు. జీవితానికి ఇలాంటి పరిష్కారం లభిస్తుందని అనుకోలేదు అంటూ సౌందర్య వాపోయింది.

కార్తీక్, దీప లేరని బాధపడ్డాం..

కార్తీక్, దీప లేరని బాధపడ్డాం..

కార్తీక్ కుటుంబాన్ని ఓదార్చేందుకు వారణాసి, బస్తీవాసులు వచ్చారు. శౌర్య కంటతడి పెట్టడాన్ని చూసి వారణాసి దు:ఖంలో మునిగిపోయారు. వారణాసి హిమ పేరును వారణాసి ఎత్తగానే.. నా ముందు హిమ పేరు ఎత్తకు అంటూ శౌర్య అరిచింది. దాంతో మాకు ఏ కష్టమొచ్చినా మాకు ఎవరున్నారు? అని వారణాసి రొదిస్తుంటే.. దాంతో మీకు మేము తోడుంటాం. మీరు ఏం చేస్తారో చేయండి. మేము మీకు ఎప్పుడూ తోడుంటాం అని ఆదిత్య అన్నారు. కార్తీక్, దీప లేరని బాధపడ్డాం. కానీ వాళ్లు మీ మనసుల్లో బతికి ఉన్నారని..మిమ్మల్ని చూస్తే తెలుస్తున్నది. వెళ్లండి.. మీరు ఏం చేసినా మేము అండగా ఉంటాం అని చెప్పింది. ఇక శౌర్యను చూస్తూ చనిపోయిన హిమను ఇంకా ఎందుకు చంపుతున్నావు? అని సౌందర్య అంటే.. హిమ చావలేదు.. బతికే ఉంది అంటూ శౌర్య చెబుతూ.. ఇంటిలోకి పరుగెత్తింది. శౌర్య గురించి ఆలోచిస్తూ.. ఏమౌ పోతుందోననే భయం వేస్తున్నది అని సౌందర్య కంటతడి పెట్టింది.

Recommended Video

Karthika Deepam Vantalakka Live Video || కార్తీక దీపం సీరియల్‌ నుంచి తప్పుకోవడం పై దీప క్లారిటీ !
 శౌర్య కోపంతో హిమ ఫోటోను

శౌర్య కోపంతో హిమ ఫోటోను

కార్తీక్, దీప ఫోటోలు పెట్టుకొని నది ఒడ్డున పిండం పెట్టారు. విషాద వదనంతో కార్తీక్ కుటుంబం కనిపించింది. అలా ఎమోషనల్‌గా సాగిన ఎపిసోడ్ చివరన తాజా ప్రోమోతో కొత్తగా ఓ ట్విస్టు ఇచ్చారు. ఇంద్రుడు, చంద్రమ్మ సాయంతో హిమ ఇంటికి చేరుకొన్నది. అయితే ప్రోమోలో శౌర్య కోపంతో హిమ ఫోటోను బయటకు విసిరి వేసి.. హిమ ఆనవాళ్లు ఇంట్లో ఒక్కటి కనిపించకూడదు అంటూ ఫోటోను విసిరి వేసింది. అయితే హిమ ఇంటిలో అడుగుపెట్టే ముందు ఆ ఫోటో వచ్చి కాళ్ల ముందు పడింది. అయితే హిమ పేరు ఎవరైనా ఎత్తితే.. నేను దక్కను అంటూ కోపంతో అరిచింది. ఆ మాటలు విన్న హిమ.. కంటతడి పెట్టింది. ఈ సీన్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతోపాటు తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తి పెంచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X