Karthika Deepam కొడుకును వదిలేసిన మోనిత.. కార్తీక్ మరణం తర్వాత షాకింగ్ నిర్ణయం

చిక్ మంగళూరు విహారయాత్రకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన కార్తీక్, దీప దంపతులకు కర్మకాండలు నిర్వహించారు. ఓ వైపు కార్తీక్ కుటుంబం, మరో వైపు ప్రియురాలు మోనిత తన బిడ్డ ఆనందరావుతో కలిసి పిండాలు పెట్టింది. అయితే కార్తీక్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కార్తీక్ కుటుంబం, మోనిత కుమిలిపోయారు. ఆనందరావును వెతికి ఇస్తే.. నన్ను వదిలేసి వెళ్తావా అని కార్తీక్ అడిగిన విషయాన్ని గుర్తు చేసుకొంటూ.. కార్తీక్ ఇలా వదిలేసి వెళ్తావని అనుకోలేదు అని మోనిత కంటతడి పెట్టింది. మరో చోట జరిగిన కర్మకాండ వద్ద భావోద్వేగాలు కనిపించాయి. పూజారి పిండాలకు దండాలు పెట్టమని చెప్పడంతో తల్లి సౌందర్య కుమిలి కుమిలి ఏడ్చింది. పిండాలను నదిలో వదిలేయమని అనగానే సౌందర్య, మోనితకు గుండె పగిలినంత పనైంది. విషాదం మునిగి తేలుతూ పిండాలను నీటిలో వదిలారు. కార్తీకదీపం తాజా ఎపిసోడ్ 1300లో ఏం జరిగిందంటే?

నా బిడ్డను మీరే పెంచండి

నా బిడ్డను మీరే పెంచండి


కార్తీక్ మరణంతో మోనిత తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తన ఇంటిలో కార్తీక్ ఫోటోను చేతితో రాస్తూ ఏడ్చింది. తన ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొని బస్తీవాసి లక్ష్మణ్ చేతిలో పెట్టింది. చిన్న తప్పు చేస్తేనే నా కార్తీక్ ఆస్తి రాసి ఇచ్చాడు. నేను చాలా పెద్ద పెద్ద తప్పులే చేశాను. నా భర్త నడిచిన అదే దారిలో నేను అదే నడవాలని అనుకొంటున్నాను. నా ఆస్తి మొత్తం మీకు రాసిస్తున్నాను. ఇందులో నా స్వార్ధం కూడా ఉంది. నా ఆస్తితోపాటు నా బిడ్డను మీ చేతిలో పెడుతున్నా. నా బిడ్డను డాక్టర్ చేయండి. ఈ ఇంటిని కార్తీక్, నా గుర్తులుగా ఉంచండి. మీరు దూరంగా వెళ్లి నా బిడ్డను పెంచండి అని మోనిత ఎమోషనల్ అయింది.

నేను లేనప్పుడు కార్తీక్ ఆత్మ అంటూ

నేను లేనప్పుడు కార్తీక్ ఆత్మ అంటూ


మోనిత మాటలు, చర్యలతో లక్ష్మణ్ దంపతులు షాక్ అయ్యారు. మీరు ఎక్కడికి వెళ్తారు అని లక్ష్మణ్ అంటే.. నడవడం మొదలుపెడితే.. ప్రపంచం మన అడుగు అంత చిన్నది. ఎంత దూరమైన నడిచే కొద్ది దగ్గర అవుతుంది కానీ.. దూరం కాదు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకొండి. నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉంచండి. నేను ఉన్నప్పుడు ఎలా ఇళ్లు క్లీన్‌గా ఉందో.. అలానే ఉంచడానికి ప్రయత్నించండి. అందుకోసం పని మనిషిని పెట్టండి అని మోనిత అంటే.. మీరు లేకుండా ఇంటి తలుపులు ఎందుకు తెరిచిపెట్టడం అని లక్ష్మణ్ భార్య అంటే.. నా కార్తీక్ బతికి ఉన్నప్పుడు.. నా ఇంటికి రాకపోయినా.. నేను లేని సమయంలో కార్తీక్ ఆత్మ ఇంటికి వచ్చి సంతృప్తి చెందితే అంతకంటే నా జీవితానికి ఏమి ఉండదు. నా బిడ్డను తీసుకో అరుణ అంటూ మోనిత ఎమోషనల్ అయింది.

ఆనంద్‌ను చూసినప్పుడల్లా కార్తీక్ గుర్తుకొస్తాడంటూ

ఆనంద్‌ను చూసినప్పుడల్లా కార్తీక్ గుర్తుకొస్తాడంటూ

మోనిత మాటలకు అడ్డుపడుతూ.. అమ్మా.. మీరు ప్రాణం ప్రేమించిన డాక్టర్ బాబు లేడు. ఆయన గుర్తుగా బాబును మీ వద్దే ఉంచుకొండి. నేను మోయలేని స్మృతులు గుండెల్లో ఉన్నాయి. బాబు నా వద్ద ఉంటే.. చూసినప్పుడల్లా కార్తీక్ నా వద్దే ఉంటాడు. అది నాకు ఇష్టం లేదు. దయచేసి ఈ బస్తీలో ఆనంద్‌ను ఉంచకండి. నా మీద కోపంతోనో.. దీపపై ప్రేమతోనో నా బిడ్డను ఏమైనా చేయవచ్చు. కావాల్సినంత డబ్బు ఇచ్చాను. జాగ్రత్తగా వాడుకొని నా బిడ్డను చూసుకొండి. జాగ్రత్త. నా విలువైన గుర్తును మీ వద్ద వదలేసి వెళ్తున్నా అని కార్తీక్‌ ఫోటోకు మొక్కి మోనిత ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.

కార్తీక్ మేము ఏం పాపం చేశాం అంటూ

కార్తీక్ మేము ఏం పాపం చేశాం అంటూ


పిండ ప్రదాన కార్యక్రమం తర్వాత ఇంటికి చేరుకొన్న కార్తీక్ కుటుంబ సభ్యులు పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారు. దండలు వేసి ఉన్న ఫోటోలను చూసి.. మీరు నవ్వుతూ ఉంటే చూడాలని కోరుకొన్నాం. కానీ మీ నవ్వును ఫోటోలకు పరిమితం చేసి మాత్రమే వెళ్లారు. మాకు కన్నీళ్లను మిగిల్చి.. మీరు ఇలా నవ్వుతూ మిగిలిపోయారు. ఆనందాన్ని వెతుక్కొంటూ వెళ్లారు. ఆనందంగా తిరిగి వస్తారని అనుకొంటే.. కనిపించనంత దూరానికి వెళ్లిపోయారు. మేము ఏం పాపం చేశాం రా కార్తీక్. చివరి చూపు కూడా చూసుకోకుండా చేశారు. మనుషుల మధ్య సంతోషం ఉండదని, మనుషులు లేని చోటుకు మీరు మాత్రమే వెళ్లిపోయారా? ఏంటి దీప.. ఎంత స్వార్ధపరురాలివే. అత్తమ్మ అంటూ అన్నీ నాతోనే చెప్పుకొనే వానివి. అలా కార్తీక్‌ను నాకు ఎప్పటికీ దగ్గర కానంత దూరంగా తీసుకెళ్తావా? అని సౌందర్య భోరున ఏడ్చింది. మనల్ని ఏడిపిస్తూ వాళ్లు ఎలా నవ్వుతున్నారో చూడండి అని సౌందర్య అంటుండగా.. శౌర్య అక్కడికి వచ్చింది.

నీ ప్రాణాలకు నేను నా ప్రాణాలు అడ్డువేస్తా అంటూ

నీ ప్రాణాలకు నేను నా ప్రాణాలు అడ్డువేస్తా అంటూ

చిక్ మంగళూరులో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకొంది. హిమ నీకు కారు నడపడం రాదు. నాకు భయంగా ఉంది అంటే.. మనం ఏమీ చచ్చిపోం. నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డువేస్తా అని చెప్పడం.. యాక్సిడెంట్‌లో కారు బోల్తా కొట్టి పేలి పోవడం జరిగిపోయాయి. ఆ విషయాన్ని గుర్తు చేసుకొని.. తన తల్లిదండ్రుల వద్ద ఉన్న హిమ ఫోటోను చూసి కోపంతో ఊగిపోయింది. అమ్మా, నాన్న పక్కన దాని ఫోటో ఎందుకు అంటూ విసిరికొట్టింది. హిమ ఇంటిలోకి అడుగుపెట్టపోతుంటే.. ఫోటోను బయటపడేస్తూంటే అది వెళ్లి హిమ వద్ద పడింది. దానిని చేతిలోకి తీసుకొని హిమ షాక్ తిన్నది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
హిమ ఫోటోను విసిరికొట్టిన శౌర్య

హిమ ఫోటోను విసిరికొట్టిన శౌర్య

కార్తీక దీపం తాజా ప్రోమోలో మరో ఆసక్తికరమైన ట్విస్టు కనిపించింది. హిమకు సంబంధించిన ఒక్క గుర్తు కూడా ఇంటిలో ఉండటానికి వీలు లేదు. అమ్మా, నాన్నను మింగేసిన రాక్షసి. నేను దానిని వదిలిపెట్టను. మళ్లీ దాని పేరు ఇంటిలో ఎత్తితే.. నేను మీకు దక్కను అంటూ శౌర్య ఆవేశంగా అరవడంతో.. ఆ సంఘటన చూసిన హిమ కంటతడి పెట్టింది. అయితే శౌర్య తీరును చూసిన హిమ అక్కడి నుంచి మోనిత ఇంటికి వెళ్లింది. ఆంటీ అంటూ ఇంటిలోకి అడుగుపెట్టగానే.. గోడపై కార్తీక్, మోనిత పూజ చేస్తున్నట్టు ఉన్న ఫోటోను చూసి షాక్ తిన్నది. ఫోటోను చూసి.. మోనిత ఆంటీ.. డాడీ కలిసి పూజా చేశారా? అని పక్కకు చూడగానే బాబు ఆనందరావు ఫోటో కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X