Karthika Deepam అమ్మ, నాన్నను చంపేసిన రాక్షసి.. హిమ కనిపిస్తే చంపేస్తా.. శౌర్య శపథం
చిక్‌మంగళూరు రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన హిమ స్థానికుల సహాయంతో హైదరాబాద్‌లోని ఇంటికి చేరుకొన్నది. అయితే కార్తీక్, దీపకు కర్మకాండలు నిర్వహిస్తున్న సమయంలోనే ఆమె ఇంటి గడప వద్దకు చేరుకోగానే.. కోపంతో శౌర్య ఆమె ఫోటోను విసిరి కొట్టడంతో హిమ షాక్‌కు గురైంది. తన కాళ్ల వద్ద పడిన ఫోటోను తీసుకొని కంటతడి పెట్టింది. అమ్మా, నాన్నను పొట్టనపెట్టుకొన్న రాక్షసి ఫోటో ఇంటిలో ఉండటానికి వీల్లేదు అంటూ శౌర్య అంటే.. ఏంటి అమ్మా అంటూ కార్తీక్ కుటుంబం కంగారుపడింది.
హిమను పరాయి దాన్ని చేసి మాట్లాడకు అంటూ ఆదిత్య అంటే.. హిమ పరాయిదే, నాకు అమ్మా, నాన్నలను కాకుండా చేసిన అది నాకు ఎప్పటికి ఏమీ కాదు. అయితే గియితే నాకు శత్రువు అవుతుంది. కారు డ్రైవ్ చేయాలనే కోరికే అమ్మా, నాన్నను చంపేసింది. వద్దు వద్దు అంటే మొండిగా వ్యవహరించింది కాబట్టే ఇలా మిగిలిపోయారు అంటూ శౌర్య భోరున విలపించింది. ఇంకా కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1301 లో ఇంకా ఏం జరిగిందంటే..

హిమ నా చెల్లెలు కానే కాదు..
శౌర్య మాటలకు అడ్డుపడుతూ... చెల్లెలిపై ఇలా ద్వేషం పెంచుకోకు అని సౌందర్య అంటే.. అది నా చెల్లెలు కాదు. మీరు కూడా అది నా చెల్లెలు అని చెప్పవద్దు. నాకు అమ్మా నాన్నలను లేకుండా చేసిన దానిని చెల్లెలు ఎలా అనాలి. ఒకవేళ ప్రమాదం నుంచి బయటపడినా నా ముందుకు రాకపోతేనే మంచింది. వచ్చిందా? నాకున్న కోపానికి నేను ఏం చేస్తానో నాకే తెలియదు. కాళ్ల ముందే అమ్మ, నాన్నల చావుకు కారణమైన దాని గురించి ఇంకా ఎలా మాట్లాడాలి అంటూ ఆవేశంగా శౌర్య అరిచింది.

హిమ కనిపిస్తే చంపేస్తా
సౌందర్య మాటలకు అడ్డుపడుతూ నాకు తెలిసి హిమ బతికే ఉంటుంది. అది ఏదో ఒక రోజు ఎదురు పడుతుంది. ఆ రోజు మాత్రం నేను హిమను వదిలిపెట్టను నానమ్మ అని శౌర్య అంది. ఒకవేళ హిమ కనిపిస్తే ఏం చేస్తావని సౌందర్య అంటే.. చంపేస్తాను అంటూ శౌర్య ఆవేశంగా అరిచింది.
ఇంట్లో దాని వస్తువులు ఏవీ ఉంచకూడదు. బతికి ఉన్నా నాకు అది చెల్లెలు కాదు. ఒకవేళ హిమ కావాలనుకొంటే.. నేను కూడా అమ్మ, నాన్న వద్దకు వెళ్లిపోతాను. నేను కూడా మిగలను. మళ్లీ దాని పేరు ఎవరైనా ఎత్తితే నేను దక్కను. నేను దక్కను అంటూ శౌర్య భోరున ఏడ్చింది. శౌర్య మాటలు విన్న హిమ వెనుకకు తిరిగింది.

మోనిత ఇంట్లోకి వెళ్లిన హిమకు షాకింగ్‌గా
శౌర్య మాటలతో కుంగిపోయిన హిమ నేరుగా మోనిత ఇంటికి వెళ్లింది. ఇక నాకు ఎవరు దక్కంటూ మోనిత ఇంట్లోకి అడుగుపెట్టిన హిమకు గోడపై కార్తీక్, మోనిత పూజ చేస్తున్న ఫోటో కనిపించింది. దాంతో డాడీ, మోనిత ఆంటీ పూజా చేశారా అని ఆలోచిస్తుంటే.. మరో గోడపై ఆనందరావును ఎత్తుకొన్న మోనిత ఫోటో కనిపించింది. తమ్ముడి ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది. తమ్ముడు మోనిత వద్దకు ఎందుకు వచ్చాడు అనే ప్రశ్నలు హిమను వెంటాడాయి.
కార్తీక్, మోనిత మధ్య ఉన్న సంబంధంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. తమ్ముడు ఆంటీకి ఎప్పుడు కలిశాడు? ఆ ఫోటో ఎప్పుడు తీసుకొన్నది. తమ్ముడు మోనిత ఆంటీ కొడుకా? తమ్ముడు నిజంగానే తమ్ముడా? అసలు నాకు ఏమి అర్ధం కావడం లేదు అంటూ హిమ సందిగ్దంలో పడింది.

మీతోనే ఉండిపోతా అంటూ హిమ
తనను చిక్ మంగళూరు నుంచి తీసుకొచ్చిన ఇంద్రుడు, చంద్రమ్మలు మోనిత ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుడటంతో పోలీస్ వచ్చి ఎవరు మీరు.. దండుపాళ్యం బ్యాచ్ మాదిరిగా ఉన్నారు అని ప్రశ్నిస్తుంటే.. హిమ వచ్చి.. వారిద్దరు మా పిన్ని, బాబాయ్‌లు. వాళ్లు చిక్ మంగళూరు నుంచి వచ్చారు. మేము మోనిత ఆంటిని కలువడానికి వచ్చాం అని హిమ సర్ది చెప్పింది.
దాంతో అయితే మీరు డాక్టర్ మోనిత గురించి చెప్పారు కాబట్టి.. వదిలేస్తున్నాను అంటూ పోలీస్ కానిస్టేబుల్ వదిలేసి వెళ్లిపోయారు. హిమ మాట్లాడిన తీరు చూసి.. ఎంత ధైర్యంగా మాట్లాడావు. మా ఇద్దరిని భలేగా కాపాడావు. మీ ఇంటి వాళ్లను కలిశావా అంటే హిమ మౌనంగా ఉండిపోయింది. ఇంద్రుడు, చంద్రమ్మతో మాట్లాడుతూ.. ఎప్పటికి మీ ఇద్దరితో ఉండవచ్చా? అని అడిగింది. దాంతో ఆనందంలో మునిగిపోయిన చంద్రమ్మ.. ఇక బిడ్డ మనతోనే ఉండిపోతుంది అని చెప్పింది.

నా కూతురు శాపమే తగలింది
కార్తీక్, దీప ఫోటోల వద్ద సౌందర్య, శౌర్య ఏడుస్తూ నిలబడిపోయారు. అంతలోనే ఆనందరావు వచ్చి నువ్వే ధైర్యం కోల్పోతే పిల్లలు ఎలా ఉంటారో తెలుసా అని అన్నారు. అయితే కార్తీక్, దీప పోయిన తర్వాత ఎలా మామూలుగా ఉండాలి అని సౌందర్య అంటే.. కార్తీక్, దీప తీపి గుర్తులను మిగిల్చి వెళ్లారు. ఆ గుర్తులతోనే పిల్లలను మంచిగా చూసుకోవాలి అని ఆనందరావు అన్నారు.
దాంతో మనకు జీవితాంతం కష్టాలతోనే గడుస్తున్నాయి. కార్తీక్, దీప ఉన్నన్ని నాళ్లు టెన్షన్‌తో గడిచాయి. సంతోషంగా ఉంటారనుకొన్న సమయంలోనే వెళ్లిపోయారు. మన కుటుంబానికి ఏదో శాపం తగిలింది. నా కూతురు స్వప్న నాపై దుమ్మెత్తిపోసింది. నా కూతురు శాపం తగిలిందేమో.. అందుకే మన కుటుంబం ఇలా అయింది అని రోధించింది.

నేనే విహారయాత్రకు వెళ్లి రమ్మన్నాను..
కార్తీక్ కుటుంబంలో మోనిత ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటి నుంచి వాడికి, మన కుటుంబానికి ఆనందం దూరమైంది అని సౌందర్య అంది.. ఎప్పుడైతే కార్తీక్ జీవితంలోకి మోనిత వచ్చిందో అప్పుడే కార్తీక్‌కు ఆనందం దూరమైంది. దీపను, పిల్లల్ని దూరం చేసుకొన్నాడు.
మనం చూస్తూ ఉండిపోయాం అని ఆనందరావు అన్నాడు. దాంతో 11 ఏళ్లు దూరమయ్యారు. నానా కష్టాలు పడ్డారు. నేనే పాపిష్టిరాలిని. నేనే సరదాగా విహారయాత్రకు వెళ్లిరమ్మన్నాను. ఏ ముహుర్తాన అన్నానో గానీ.. వెళ్లిన వాళ్లు తిరిగి రాలేదు అని సౌందర్య కంటతడి పెట్టేసింది.
Recommended Video


కార్తీకదీపం సీరియల్ రేటింగ్ ఇలా..
ఇదిలా ఉండగా, కార్తీకదీపం గత రెండేళ్లుగా టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తున్నది. ప్రతీ వారం మెరుగైన రేటింగ్‌ను నమోదు చేస్తున్నది. తాజా వారంలో కూడా ఉత్తమమైన రేటింగ్‌ను నమోదుచేసింది. మార్చి మొదటి వారంలో కార్తీక దీపం సీరియల్ 13.05 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. కార్తీక్, దీప యాక్సిండెంట్‌లో మరణించడం సీరియల్‌ను ఎమోషనల్‌గా మార్చేసింది.


Click it and Unblock the Notifications











