Karthika Deepam సౌందర్య మాస్టర్ ప్లాన్‌.. పద్మవ్యూహంలో చిక్కుకొన్న మోనిత

మోనిత కుమారుడే ఆనంద్ అని తెలిసిన తర్వాత కార్తీక్ కుటుంబంలో ఒకరకమైన పరిస్థితి నెలకొన్నది. తమ ఇంటి సభ్యుల హృదయానికి చేరువైన ఆనంద్ తమ నుంచి దూరమైతే అనే ఆలోచననే జీర్ణించుకోలేని పరిస్థితిలోకి కార్తీక్ ఫ్యామిలీ వెళ్లింది. తమను బంధాలు అనే పద్మవ్యూహంలోకి నెట్టిన మోనిత వ్యవహారం దీప, సౌందర్యను అతలాకుతలం చేసింది. అయితే ఆనంద్‌ను విడిచి శౌర్య, హిమ ఉండలేని పరిస్థితి చూసి సౌందర్య, దీప తల్లడిల్లిపోయారు. అన్నీ తెలిసే మోనిత తమ కుటుంబంతో ఆడుకొంటున్నది అని మోనిత మనసులో అనుకొన్నది. అంతలోనే ఆనంద్ కోసం కారు బొమ్మ తీసుకొచ్చి ముద్దు చేయడంతో దీప చూసి ఓ రకమైన భావోద్వేగానికి గురైంది. తమ కుటుంబాన్ని రిమోట్‌తో ఆడించినట్టు ఆడిస్తున్నది అంటూ దీప అనుకొన్నది. అంతలోనే కార్తీక్ ఫోన్ వచ్చింది.. ఇంకా కార్తీక దీపం సీరియల్‌ తాజా ఎపిసోడ్ 1288 లో ఏం జరిగిందంటే..

మోనితపై కార్తీక్ సీరియస్

మోనితపై కార్తీక్ సీరియస్

కార్తీక్ తనకు వచ్చిన ఫోన్ కాల్‌ను లిఫ్ట్ చేసి.. హలో అంటే.. నేను మోనిత. నా అసిస్టెంట్ ఫోన్ నుంచి మాట్లాడినా నా గొంతు గుర్తుపట్టావు. నీవు గుర్తు పట్టవని అనుకొన్నాను. అందే ప్రేమంటే అని మోనిత అంటే.. మరిచిపోయే గతం కాదు కదా అని కార్తీక్ సమాధానం ఇచ్చారు. మోనిత ఏదో మాట్లాడుతుంటే.. అసలు విషయం చెప్పు.. లేదా ఫోన్ కట్ చేయాలా? అని అంటే.. నా బిడ్డను వెతికే పనిచేస్తున్నావా అంటే.. అవును.. నీవు నాకు ఒక పని అప్పజెప్పావు. ఆ పనిలోనే ఉన్నాను. నువ్వు పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం లేదు. పదేపదే విసిగించకు అని కార్తీక్ అంటే.. నా మాట విను.. బాబును వెతకడంలో హెల్ప్ చేస్తాను అని మోనిత అంటే.. నాకు హెల్ప్ చేసే బదులు.. నీవే వెతుక్కోవచ్చు కదా అని కార్తీక్ అన్నాడు.

కార్తీక్ ఇంటికి వస్తున్నాడంటూ మోనిత

కార్తీక్ ఇంటికి వస్తున్నాడంటూ మోనిత


కార్తీక్ మాటలకు అడ్డు పడుతూ.. నా దగ్గర ప్లాన్ ఉందంటూ మోనిత చెప్పబోతుంటే.. నీవు ప్లాన్ అంటూ నా ఇంటికి వచ్చే ప్రయత్నం చేయకు అంటూ మోనిత తన అసిస్టెంట్‌తో కలిసి ఆనందాన్ని పంచుకొన్నది. మోనిత ఫోన్ పెట్టేసి ఆనందంలో మునిగిపోయి గంతులేసింది. ఈ రోజు చెప్పలేనంత ఆనందం కలిగింది. నా ఇంటికి నా కార్తీక్ వస్తున్నాడు. ఇళ్లంతా శుభ్రం చేయాలి అంటూ ఎగిరి గంతులేస్తుంటే.. కాలు జారి కింద పడింది. అంతలోనే కార్తీక్ కారులో మోనిత ఇంటికి వచ్చాడు. మోనిత అసిస్టెంట్ వచ్చి లోనిక రమ్మంటే.. ఆమెనే రమ్మని చెప్పండి అని కార్తీక్ అన్నాడు. అయితే మోనిత కిందపడి కాలు బెణికింది. అందుచేత రాలేదు అంటే.. ఇలాంటి నాటకాలు చాలా చూశాను. తననే రమ్మని చెప్పండి.. లేకపోతే నేను వెళ్లిపోతాను. కాలికి దెబ్బ తగిలిందంటే.. నేను నమ్మను అంటూ కార్తీక్ అన్నాడు. లేదు నిజంగానే దెబ్బ తగిలింది అంటూ నర్సు చెప్పడంలో మోనిత ఇంటిలోకి అడుగుపెట్టబోయాడు.

గోడపై ఫోటో చూసి కార్తీక్ షాక్

గోడపై ఫోటో చూసి కార్తీక్ షాక్


ఇక మోనిత ఇంటిలోకి అడుగుపెట్టడానికి కాలు పెట్టగా.. నేలపై గులాబీ రెక్కలతో స్వాగతం పలుకుతూ అలంకరించింది. కార్తీక్‌ను చూసి స్వాగతం.. సుస్వాగతం అంటూ ఆహ్వానం పలికింది. అయితే కాలు పెట్టాలా లేదా అని అలోచించుకొంటూ పూలదారిపై నడుచుకొంటూ వచ్చింది. అయితే ఇంట్లోకి వచ్చి.. నిజంగానే కాలు బెణికిందా? అంటే అవును అని సమాధానం చెప్పింది. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పావు.. ఇస్తే వెళ్లిపోతాను అంటే చూడగానే.. ఇంటి గోడపై శాంతిపూజ చేసినప్పటి ఫోటో కనిపించింది.

హాస్పిటల్‌కు వెళ్లిన మోనిత, కార్తీక్

హాస్పిటల్‌కు వెళ్లిన మోనిత, కార్తీక్


దాంతో కోపంతో ఊగిపోయి.. ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? అని కార్తీక్ ప్రశ్నించాడు. మన బాబు, నువ్వు, నేను కలిసి దిగిన ఫోటో ఇది.. నువ్వు, నేను కలిసి ఉన్న ఫోటో అరుదు కదా.. నా ఆనందం కోసం పెట్టుకొన్నాను అని మోనిత అంటే.. ఆధారాలు ఏంటో చెబితే వెళ్లిపోతాను అంటే.. లేదు మనం హాస్పిటల్‌కు వెళ్లి లిస్టు తీసుకోవాలి అని చెప్పింది. హాస్పిటల్‌కు నేను వెళ్తాను.. నీవు ఎందుకు? అని కార్తీక్ అంటే.. అప్పుడు హాస్పిటల్‌కు డెలివరికి వచ్చిన లిస్టు ఉంటుంది. వారి వివరాలు సేకరిద్దామంటే.. సరే అని మోనితను తీసుకొని కార్తీక్ హాస్పిటల్‌కు వెళ్లాడు.

 ఆనంద్ మిస్ అయింది అక్కడే..

ఆనంద్ మిస్ అయింది అక్కడే..


కార్తీక్‌తో హాస్పిటల్‌‌కు వెళ్లిన మోనిత.. కొన్ని వివరాలు సేకరించింది. అయితే ఇంకా ఎన్ని హాస్పిటల్స్ తిరగాలి అని కార్తీక్ అంటే.. తప్పదు.. బాబు ఆచూకీ తెలియాలంటే.. వివరాలు సేకరించాల్సిందే. ఇక్కడికి దగ్గర్లోనే షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. అక్కడే బాబు మిస్ అయ్యాడు. మిస్ అవ్వడానికి రెండు రోజుల ముందు ఎవరెవరూ వచ్చారే వివరాలు ఉన్నాయి. ఈ లిస్టులో నుంచి శ్రీవల్లి, కోటేష్ పేర్లను తొలగించాను. నీకు ఎప్పటికీ ఆ వివరాలు తెలియవు. కాబట్టి నీవే వెతుకుతుంటావు. ఆలోగా నేను నీకు దగ్గరవుతాను అని తన ప్లాన్‌ను మోనిత మనసులో అనుకొన్నది.

 పిల్లల తీరుపై సౌందర్య అసహనం

పిల్లల తీరుపై సౌందర్య అసహనం


ఇక ఆనంద్‌తో ఆడుకొంటుంటే.. హిమ, శౌర్యను మీరు ఎప్పుడు వాడితో ఆటలేంటి.. చదువుకోండి అంటూ సౌందర్య సీరియస్ అయింది. దాంతో నానమ్మ నీవు ఎందుకో మారిపోయావు అంటే.. పక్కనే ఉన్న దీప.. హిమకు అలా మాట్లాడుకూడదని వార్నింగ్ ఇచ్చింది. నాన్నమ్మ, సౌందర్య తీరుపై కోపం ప్రదర్శిస్తూ పిల్లలు ఇంట్లోకి వెళ్లారు. అయితే పిల్లలు ఎదురు తిరిగే పరిస్థితి ఏర్పడింది. పిల్లలకు, కార్తీక్‌కు నిజం చెప్పాలి దీప అంటే.. మోనిత మనల్ని చాలా గట్టిగా ఇరికించింది. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. ఎలా బయటపడాలో తెలియడం లేదు. ఆనంద్‌ను చూస్తే పిల్లల పరిస్థితి అర్ధం కావడం లేదు అని సౌందర్య అంది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
ఆనంద్ దత్తత అంటూ మోనితకు షాక్

ఆనంద్ దత్తత అంటూ మోనితకు షాక్


అయితే తాజా ప్రోమోలో సౌందర్య షాకింగ్‌గా ప్లాన్ వేసింది. ఆనంద్‌ను వేరే వాళ్లకు దత్తత ఇచ్చేందుకు పూజకు ఏర్పాట్లు చేసింది. పూజపై కార్తీక్, దీప కూర్చొని ఉండగా.. మోనిత వచ్చి ఆపండి అంటూ అరిచింది. కార్తీక్ ఏం చేస్తున్నావు.. బాబును దత్తత ఇవ్వడం ఏమిటి అంటూ ప్రశ్నించింది. దాంతో ఆనంద్‌ను దత్తత ఇస్తున్నారా,, అని కార్తీక్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దాంతో అవును.. పిల్లలు లేని వాళ్లు అడిగారు. అందుకే వారికి దత్తత ఇచ్చేందుకు నిర్ణయించాను అంటూ సౌందర్య జవాబిస్తే.. అందుకు నేను ఒప్పుకోను అని మోనిత గట్టిగా అరిచింది. దాంతో నువ్వెవరు ఒప్పుకోకపోవడానికి అంటూ సౌందర్య కౌంటర్ ఇచ్చింది. దాంతో నేను ఆనంద్‌కు తల్లిని కాబట్టి.. ఒప్పుకోను అంటూ మోనిత చెప్పడంతో కార్తీక్ షాక్ తిన్నాడు. ఇలా ప్రోమో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X