Karthika Deepam కార్తీక్ నా మొగుడు.. మోనిత చెంపలు వాయించిన దీప
ఆనంద్ వ్యవహారాన్ని మోనిత ఓ వైపు వాడుకొని కార్తీక్‌కు దగ్గర కావాలని ప్రయత్నిస్తూ తన కపట నాటకాన్ని కొనసాగిస్తున్నది. తమ వద్ద పెరుగుతున్న ఆనంద్ మోనిత కొడుకని తెలియడంతో సౌందర్య, దీపలో ఆందోళన మొదలైంది. తమ కుటుంబానికి బాగా దగ్గరైన ఆనంద్‌ను వదులు కోవాల్సి వస్తే.. జరిగే పరిణామాలను ఊహించుకొంటూ కార్తీక్ కుటుంబం కంగారుపడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఆనంద్‌ను వెతికేందుకు కార్తీక్, మోనిత హాస్పిటల్స్ తిరగడం మొదలుపెట్టారు. అయితే ఓ లిస్టు ఇచ్చి..ఇందులో ఆ సమయంలో హాస్పిటల్‌లో డెలివరీ అయిన లిస్టు.. వీరిలో ఎవరైనా ఎత్తుకెళ్లి ఉంటారేమో.. ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేస్తే.. డబ్బు కోసం ఫోన్ చేసి ఉండే వారేమో కదా అంటూ కార్తీక్‌పై కావాలనే తుళ్లిపడింది. దాంతో మోనితను చూసి ఈసడించుకొన్నాడు. ఈ క్రమంలో కార్తీకదీపం సీరియల్‌లో తాజా ఎపిసోడ్ 1289 లో ఇంకా ఏమి జరిగిందంటే..

కార్తీక్ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా
తనపై మోనిత తుళ్లిపడటంతో కార్తీక్ సీరియస్‌గా చూస్తే అయితే.. ఏంటి కార్తీక్ అలా చూస్తున్నావు. నేను కిందపడిపోతుంటే కూడా పట్టుకోవా. నేను అంటే నీకు ఎందుకంత కోపం.. నేను ప్రేమించాను. ప్రేమిస్తూనే ఉంటాను. ప్రేమించడం తప్పా? ఎన్నో అవమానాలు పడ్డాను. సమాజం చీత్కరించుకొన్న భరించాను. నీ కోసం బిడ్డను కన్నాను. నా మీద కోపం ఎందుకు కార్తీక్ అని మోనిత అంటే.. నీ ఆటోబయోగ్రఫి వినడానికి రాలేదు అంటూ కార్తీక్ సీరియస్ అయ్యాడు. నా ఆటోబయోగ్రఫి కాదు.. ఫిల్మోగ్రఫి అని మోనిత సమాధానం ఇచ్చింది. నా బిడ్డను ఎక్కడో వెతకడం అవసరం లేదు. నీ ఇంట్లోనే ఉన్నాడు. నా ప్రేమ తెలిసే వరకు నా బిడ్డ కోసం నిన్ను ఇలానే తిప్పుతుంటాను. ఈ వంకతోనైనా నిన్ను కలువొచ్చు.. నీతో మాట్లాడవచ్చు. నీ పక్కన నడువ వచ్చు. ఎప్పుడో ఒకప్పుడు నా ప్రేమలో పడకతప్పదు అంటూ మోనిత తనదైన శైలిలో ఆనందపడింది.

ఒకవేళ మన బిడ్డ దొరకకపోతే
హాస్పిటల్ నుంచి కారులో తీసుకెళ్లి మోనితను ఆమె ఇంటి వద్ద దిగబెట్టాడు. కారు దిగిన మోనిత..ఇలా నీ పక్కన కారులో ప్రయాణించి ఎన్నాళ్లైందో. నీతో జీవితాంతం ప్రయాణించాలని ఎన్నో కలలు కంటున్నాను కార్తీక్. ఎప్పుడు నిజమవుతుందోనని వేచి చూస్తున్నాను అని మోనిత మనసులో అనుకొన్నది. దాంతో నీ బిడ్డను వెతికిస్తే.. నాకు దూరం అవుతానని చెప్పాను. అందుకే నీతో కలిశాను. లేకపోతే జీవితాంతం నీ ముఖం కూడా చేసేవాడిని కాదు అని కార్తీక్ అంటే.. కొన్ని మనం కావాల్సుకొన్న జరగవు కార్తీక్. మన పరిచయం కూడా అంతే.. వద్దనుకొన్నా కాలం కలుపుతుంది. నీవు మాట మీద నిలుచొంటావు. ఒకవేళ మన బిడ్డ దొరకకపోతే అనే అనుమానం మోనిత వ్యక్తం చేసింది

మోనిత పిచ్చి పిచ్చిగా మాట్లాడకు..
మోనిత మాటలకు కోపంతో కారులో నుంచి కార్తీక్ దిగి.. ఏంటి అన్నాడు. ఒకవేళ బిడ్డ దొరకకపోతే.. మీరు పెంచుకొంటున్న బిడ్డను నాకు ఇవ్వండి అని మోనిత అంటే.. షటప్ మోనిత.. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంటూ కార్తీక్ వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకు అలా అరుస్తున్నావు. ఆ బిడ్డలో నా కొడుకును చూసుకొంటాను అని కార్తీక్ అంటే.. వాడు మా ప్రాణం. వాడి గురించి పిచ్చిపిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని మోనితకు కార్తీక్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడు. కార్తీక్ వెళ్లిపోతుంటే.. టాటా.. బైబై కార్తీక్.. మనం ఒక్కటయ్యే బ్రహ్మండమైన ప్లాన్ వేశాను. ఈ రోజు ఇంటి వరకు వచ్చావు. రేపు ఇంట్లోనే ఉండిపోతావు. నాకు తెలుసు. మోనిత అనుకొంటే జరుగుతుంది అంటూ మోనిత సంబరంలో మునిగిపోయింది.

పిల్లలు మానసికంగా దూరం అంటూ దీప
ఆనంద్‌ను పట్టించుకోవడం లేదనే విషయంపై తన తల్లితో హిమ గొడవపడింది. గతంలో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆనంద్‌ను ఎంతో మంచిగా చూసుకొనేదానివి. కానీ ఇప్పుడు మాత్రం ఆనంద్‌ను దూరంగా ఎందుకు పెడుతున్నారు అని హిమ నిలదీసింది. అయితే మోనిత కొడుకే ఆనంద్ అని కార్తీక్‌తో చెబుతానని దీప అనడంతో సౌందర్య కంగారుపడిపోయింది. ఏంటి కార్తీక్‌కు నిజం చెబుతావా? అలా చెబితే సమస్య పెద్దదవుతుంది. కానీ పరిష్కారం కాదు అని సౌందర్య అంది. అయితే నిజం చెప్పకుండా కార్తీక్‌ను మోసం చేస్తున్నాననే ఫీలింగ్ కలుగుతుంది. ఇలా నేను చేస్తే పిల్లలు నాకు మానసికంగా దూరమయ్యే ప్రమాదం ఉంది. రోజు రోజుకు ఆనంద్‌కు హిమ, శౌర్య దగ్గరవుతున్నారు. ఒకవేళ మోనిత వాడిని తీసుకెళ్తే పరిస్థితి ఏమిటనే విషయం గురించి ఊహించుకోలేకపోతున్నా అని సౌందర్యతో దీప చెబుతుండగా.. కార్తీక్ అక్కడకు వచ్చాడు.

ప్రపంచానికి నా బిడ్డ అని చెబుతా
నీరసంగా ఉన్న కార్తీక్‌ను చూసి ఏంటి పెద్దోడా లేట్ అయిందని సౌందర్య అడిగితే.. మోనిత బిడ్డ కోసం వెతుకుతున్నాను అని సమాధానం చెప్పాడు. ఆనంద్ మన ఇంట్లో ఉన్న విషయం నీకు చెప్పకుండా దాచిపెడుతున్నాం అంటూ సౌందర్య, దీప ఆవేదన చెందాడు. ఒకవేళ బిడ్డ దొరకకపోతే.. మన ఇంట్లో ఉన్న ఆనంద్‌ను ఇవ్వమని అడుగుతున్నది. కానీ ఆనంద్‌ను ఎలా? ఎందుకు ఇస్తాం. ఇవ్వమంటే ఇచ్చేస్తామా? వింటున్నామని ఏవోవో చెబితే ఊరుకొంటామా? ఆనంద్ మనోడు. వాడిని చూస్తే ఎన్ని కష్టాలు ఉన్నా.. అన్ని ఎగిరిపోతాయి. ఆనంద్ మన కుటుంబ సభ్యుడిగా రేషన్, ఆధార్ ఇతర అన్ని డాక్యుమెంట్లలో చేర్చాలి. ఆనంద్ ఎవరో అని మోనిత అంటున్నది కదా.. వాడు నా బిడ్డ అని చెప్పాలి. ఆనంద్ ఎవరో కాదు.. నా కొడుకు అని ప్రపంచానికి తెలియజేయాలి అని కార్తీక్ ఆవేశంగా అన్నాడు

మోనితను నమ్మి మోసపోయా అని కార్తీక్
మోనిత విషయం నుంచి ఎలా బయటపడాలనే విషయం గురించి ఆలోచిస్తుంటే.. ఏంటి కార్తీక్ ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావని సౌందర్య అంటే.. బిడ్డను వెతికి ఇస్తానని మోనితకు మాటిచ్చాను. అది మీకు నచ్చలేదు. మోనితను ఎందుకు నమ్ముతున్నావని అంటున్నారు. మోనిత నమ్మి మోసపోయాను. కానీ మోనితను వదిలించుకొనేందుకు ఇది మంచి అవకాశం అని కార్తీక్ అన్నాడు. దాంతో కార్తీక్ నీకు నిజం చెప్పలేక మోసం చేస్తున్నాం అని సౌందర్య మనసులో అనుకొన్నది. అయితే మీ వద్ద ఈ సమస్యకు పరిష్కారం ఉందా అని కార్తీక్ తన తల్లిని అడిగాడు. అంతలోనే వారణాసి ఫోన్ చేయడంతో దీప పక్కకు వెళ్లిపోయింది.

చీరలు కొనుక్కురా అంటూ మోనిత
కార్తీక్ ఇంటిలో దిగబెట్టిన తర్వాత ఆలోచనల్లో పడిపోయింది. కుంటుతూ నడిచిన మోనిత మంచిగా నడుస్తుంటే.. మేడమ్ కాలి నొప్పి అంటూ సందేహ పడితే.. అవసరం మనిషిని దేనికైనా దిగజార్చుతుంది. కార్తీక్‌ను ఇంట్లోకి రప్పించడానికే నాటకం ఆడాను. నా గురించి ఇంకా తెలియదు అని మోనిత అంటే.. మీలో చాలా టాలెంట్ ఉంది మేడమ్ అంటే.. ఇంకా చాలా చూసి నేర్చుకోవాలి అంటూ మోనిత సంతోషపడిపోయింది. ఆ తర్వాత నర్సు చేతికి డబ్బు ఇచ్చి.. ఎన్ని చీరలు వస్తే.. అన్ని చీరలు తీసుకురా.. కార్తీక్ నా ఇంటికి వచ్చాడు కదా.. బస్తీ వాళ్లందరికి చీరెలు పంచుతాను. మంచి క్వాలిటీ చీరలు తీసుకురా అంటూ నర్సును పంపించింది. ఇంటికి వచ్చినందుకు థ్యాంక్స్ కార్తీక్. త్వరలో శాశ్వతంగా ఇంటికి రప్పిస్తాను అంటూ మోనిత ఆనందపడిపోయింది.
Recommended Video

మోనిత చెంప చెళ్లుమనిపించిన దీప
నర్సు తెచ్చిన చీరలను పంచుతూ.. ఈ రోజు పండగ లాంటి రోజు. కార్తీక్ నా ఇంటికి వచ్చాడు. అంతకంటే గొప్ప పండుగ ఏముంటుంది? కార్తీక్ మోనిత మొగుడు అనే సందేహాలు ఉంటే.. వాటికి సమాధానం చెబుతాను. దీపకు కార్తీక్ మొగుడే కాదు. నాకు మొగుడే అంటూ మోనిత మాట్లాడుతుంటే.. ఆమె చెంప పగిలిపోయింది. ఆ షాక్ నుంచి చూస్తే పక్కనే దీప ఉంది. దీప కొట్టిన దెబ్బకు బస్తీవాసులంతా షాక్ తిన్నారు. ఇదిలా ఉండగా.. దత్తత కోసం చేస్తున్న పూజ సందర్భంగా ఆనంద్ తన కుమారుడే అని కార్తీక్ కుటుంబానికి మోనిత చెప్పడం ట్విస్టుగా మారింది. తాజా ప్రోమో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











