Karthika Deepam దేవుడైనా.. పతి దేవుడైనా కార్తీకే.. సౌందర్య మాస్టర్‌ ప్లాన్‌కు మోనిత చిత్తు!

కార్తీక్ తన ఇంటికి రావడంతో ఆనందంలో పొంగిపోయిన మోనిత బస్తీవాసులకు చీరలు పంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. బస్తీవాసులారా.. కార్తీక్ దీపకు మాత్రమే మొగుడు కాదు.. నాకు కూడా మొగుడే అంటూ స్పీచ్ ఇస్తున్న సమయంలో చెంప పగలడంతో షాక్ తిన్నది. పక్కకు తిరిగి చూస్తే ఎదురుగా కోపంతో ఊగిపోతున్న దీప కనిపించింది. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే.. ఏంటే చూస్తున్నావు. మళ్లీ అను. వారణాసి చీపిరి కట్ట తీసుకో. సన్మానం చేస్తాను. ఏం మోనిత.. నీకు మతిపోయిందా? డాక్టర్ బాబు ఇంటికి వస్తే మొగుడైపోతాడా? చీరలు పంచేస్తావా? పిచ్చి పిచ్చివేస్తే పీక పిసికి చంపేస్తాను. అడ్డదారిలో బిడ్డను కన్నావు. వెధవ వేషాలు వేస్తే.. అడ్డంగా నరికేస్తాను జాగ్రత్త.. మొగుడంటా మొగుడు అంటూ కోపంతో ఊగిపోయింది. ఇంకా కార్తీకదీపం సీరియల్‌లో తాజా ఎపిసోడ్ 1290లో ఏం జరిగిందంటే...

మోనిత అరవకు.. పీక పిసికేస్తా అంటూ దీప

మోనిత అరవకు.. పీక పిసికేస్తా అంటూ దీప


బస్తీవాసులతో దీప మాట్లాడుతూ.. తన మెడలో తానే తాళి కట్టుకొన్నది. బిడ్డను పోగొట్టుకొన్నది. పరువు పోగొట్టుకొన్నది. జైలుకు వెళ్లి వచ్చింది. ఇక్కడ ప్రజావైద్యశాల పెట్టి ప్రజా సేవ చేస్తున్నది అని దీప అంటుంటే.. దీప అని గట్టిగా మోనిత అరిచింది. దాంతో అరవకు. గుడ్లు పీకెస్తా. ఏంటి అలా చూస్తున్నావు అని అంటే.. ఏంటీ దీపక్క.. కార్తీక్‌తో నేను ఒక డీల్ పెట్టుకొన్నాను. కార్తీక్ నాకు బిడ్డను తెచ్చి ఇవ్వాలి. లేకపోతే చాలా జరిగిపోతాయి దీపక్క, నీవు తిట్టినా.. కళ్లు ఉరిమి చూసినా.. కను బొమ్మలు ఎగేరిసినా నేను ఇలానే మాట్లాడుతాను అంటూ మోనిత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దాంతో ఛీఛీ అంటూ బురదలో రాయివేస్తే ఇలానే ఉంటుంది అని దీప.. బురద కాదు దీపక్క.. బురదలో పెరిగే తామరపువ్వును. వెళ్లండి.. వెళ్లి నా బాబును ఇవ్వండి. లేకపోతే నీ ఇంట్లో పెరిగే బిడ్డను ఇవ్వండి అని మోనిత అంటే.. నోర్మూయ్ అని దీప వార్నింగ్ ఇచ్చింది.

నా పేరు దీపే కాదు.. అంటూ

నా పేరు దీపే కాదు.. అంటూ


మోనితకు వార్నింగ్ ఇచ్చి బస్తీ నుంచి దీప వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. దాంతో దీపను కవ్వించేందుకు ప్రయత్నం చేసింది. దీప వెళ్లి పోతుంటే.. దీపక్క ఓ చీర నువ్వు కూడా తీసుకెళ్లు అంటే.. మోనిత నీకు రోజులు దగ్గరపడ్డాయి. అందుకే ఇలా మిడిసిపడుతున్నావు. నీ సంగతి చూడకపోతే.. నా పేరు దీపే కాదు అని వార్నింగ్ ఇచ్చింది. అయితే దీప ఇచ్చిన షాక్ నుంచి మోనిత కోలుకోలేకపోయింది. ఇక మోనిత వ్యవహారంపై కార్తీక్ సీరియస్‌గా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒకవేళ నా బిడ్డ దొరకకపోతే.. నీ ఇంట్లో పెరిగే బిడ్డ ఇవ్వమని అడిగిన విషయాన్ని కార్తీక్ గుర్తు చేసుకొన్నాడు.

 నాకే ఇలాంటి కష్టాలా? అంటూ కార్తీక్

నాకే ఇలాంటి కష్టాలా? అంటూ కార్తీక్


అయితే మోనితను వదిలించుకొనేందుకు కార్తీక్ ఆలోచిస్తుండగా.. తల్లి సౌందర్య వచ్చింది. కార్తీక్ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు. పద భోంచేద్దాం అంటే.. నాకు ఆకలి లేదు అంటూ కార్తీక్ అన్నాడు. కష్టాలు వస్తే అధైర్యపడొద్దు అంటూ తల్లి అంటే.. ఒకసారో.. రెండుసార్లో కష్టాలు వస్తే.. ఎదుర్కోవచ్చు. నాకేంటి.. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అసలు నాకు నా తలరాత ఏంటో నాకే అర్ధం కావడం లేదు అంటూ కార్తీక్ ఆవేదన చెందాడు. ఇలాంటి పరిస్థితుల్లో దీప ఇంట్లోకి అడుగుపెట్టింది. అయితే కన్నీళ్లు పెట్టుకోవడంతో ఏం జరిగిందని సౌందర్య అడిగితే.. మోనితతో జరిగిన విషయాన్ని చెప్పి బాధపడింది. మోనిత పీడను వదిలించుకొనేందుకు సౌందర్య ఓ ప్లాన్ చెప్పింది.

పూజ చేస్తున్నామంటూ సౌందర్య

పూజ చేస్తున్నామంటూ సౌందర్య


ఇక సౌందర్య నేరుగా బస్తీకి వెళ్లింది. సౌందర్యను చూసి బస్తీవాసులు ఆనందంగా స్వాగతం పలికారు. వారితో మాట్లాడుతూ.. మిమ్మల్ని ఓ కార్యక్రమానికి పిలుస్తున్నాం. కార్తీక్, దీపకు దొరికిన బిడ్డను పిల్లలు లేని వారికి దత్తత ఇస్తున్నాం. ఆ ఫంక్షన్‌ను గుడిలో చేస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి. అందర్ని తీసుకొని తప్పకుండా రావాలి అంటూ సౌందర్య బస్తీవాసులను ఆహ్వానించింది. అయితే సౌందర్య ఇంటికి రాగానే.. ఎదురుపడిన కార్తీక్‌తో ఎక్కడికి వెళ్తున్నావు అంటే.. ఊరి బయట తప్పిపోయిన పిల్లల గురించి సమాచారం ఇచ్చే వ్యక్తిని కలువబోతున్నాను అని కార్తీక్ అంటే.. ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్లనక్కర్లేదు. ఈ రోజు పూజ చేస్తున్నాం అని సౌందర్య చెప్పింది. అయితే పూజ ఏంటని కార్తీక్ అడిగితే.. ఆ వివరాలు అడగకు.. పూజ చేస్తున్నాం. నీవు వస్తున్నావు. నీవు బయటకు వెళ్లకు అని సౌందర్య చెప్పింది. అయితే ఏంటీ పూజ అని దీప అడిగితే, ఆమె కూడా మౌనంగా ఉండటంతో కార్తీక్ ఇంట్లోకి వెళ్లిపోయాడు.

నా ప్లాన్ రివర్స్ అయిందా?

నా ప్లాన్ రివర్స్ అయిందా?


సౌందర్య బస్తీకి వచ్చి అందర్నీ పూజకు ఆహ్వానించడాన్ని తెలుసుకొన్న మోనిత కోపంతో ఊగిపోయింది. నేను వేసిన ప్లాన్‌కు ఇలా కథ అడ్డం తిరిగిందేమిటి? నా బిడ్డ, నా తమ్ముడు, మా ప్రాణం అంటూ చిలకపలుకులు పలికారు. ఏంటి? ఆనంద్ మీద ప్రేమ లేదా? అంటూ అసహనంతో ఊగిపోయారు. ఇన్నాళ్లు అంత ప్రేమ చూపించిన వాళ్లు.. ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు. నా ఆనందరావును దత్తత ఇవ్వడమేమిటి? కార్తీక్ నా బిడ్డను వెతికి ఇవ్వలేకపోతాడని.. భయంతో ఇలా చేస్తున్నారా? లేక ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా? నేను ఏమో బిడ్డను అడ్డం పెట్టుకొని.. దత్తత ఇవ్వడమేమిటి? ఈ ప్లాన్ నాకు అర్ధం కావడం లేదు. నా బిడ్డను దత్తత ఇవ్వడం ఏమిటి? నా బిడ్డను అని చెప్పలేను. కానీ గేమ్ నేను ఆడిస్తాను. వీళ్ల ప్లాన్ చెడగొట్టి సంగతి తేలుస్తాను.. దత్తత అంట దత్తత అంటూ మోనిత ఆవేశపడింది.

పూజలో కార్తీక్, దీప.. ఆపండి అంటూ మోనిత

పూజలో కార్తీక్, దీప.. ఆపండి అంటూ మోనిత

ఇక కార్తీక్ కుటుంబం పూజ కోసం గుడికి వెళ్లారు. గుడి మెట్లు ఎక్కుతూ.. పూజా ఎందుకు చేస్తున్నారో చెప్పలేదు అంటూ కార్తీక్ అడిగితే.. ఎవరైనా పూజ ఎందుకు చేస్తారు.. అందరూ బాగుండాలనే కదా అని సౌందర్య చెబితే.. ఏరా మాతో కలిసి గుడికి రావడం ఇదే తొలిసారి కదా అంటూ ఆనంద్‌ను కార్తీక్ ముద్దు చేశాడు. కార్తీక్ కుటుంబాన్ని చూసిన పూజారులు.. మేడం వాళ్లు వచ్చారు.. పూజకు సిద్దం చేయండి అని అన్నారు. అయితే పూజ వద్ద బస్తీవాసులను చూసి కార్తీక్ ఆశ్చర్యపోయాడు. ఏంటి బస్తీవాసులందరూ అక్కడ ఉండటాన్ని చూసి.. వీళ్లంతా ఇక్కడ ఎందుకున్నారు అంటే.. నువ్వు కూర్చో... అంత నీకే తెలుస్తుందన్నట్టు సౌందర్య సైగ చేసింది. పూజ చేస్తున్న స్థలానికి వచ్చిన మోనిత.. ఆపండి అంటూ మోనిత గట్టిగా అరిచింది. ఒడిలో బాబు.. గుడిలో మీరు.. ఏం జరుగుతున్నదంటూ ప్రశ్నించింది.

 నేను నటినంటే.. నీవు పెద్ద నటుడివి..

నేను నటినంటే.. నీవు పెద్ద నటుడివి..


అయితే మోనితను చూసిన సౌందర్య.. రా మోనిత.. నిన్ను పిలువడం మరిచిపోయాను. రా దేవుడుకి దండపెట్టుకో అంటే.. నాకు దేవుడైనా.. పతిదేవుడైనా కార్తీక్ అని మోనిత అంటే.. సౌందర్య, దీప అసహనంతో ఊగిపోయారు. ఏంటి కార్తీక్ బాబును దత్తత ఇవ్వడం ఏమిటి? అని మోనిత ప్రశ్నిస్తే.. దత్తత ఏమిటి అని కార్తీక్ అన్నాడు.. నేను నటిని అంటే.. నాకంటే పెద్ద నటుడివి నువ్వు. ఏమి తెలియని వాడిలా నటిస్తున్నావు అని మోనిత అంటే.. వెంటనే తల్లితో ఏమిటి మమ్మి.. ఆనంద్‌ను దత్తత ఇస్తున్నామా? కార్డులు కూడా ప్రింట్ చేసి ఇస్తున్నామా? అని కార్తీక్ అడిగితే.. అవును అంటూ సమాధానం చెప్పింది. దాంతో కార్తీక్ షాక్‌కు గురయ్యాడు.

Recommended Video

Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
ఆనంద్ ఎక్కడ అంటూ..

ఆనంద్ ఎక్కడ అంటూ..


కార్తీక దీపం సీరియల్‌ తాజా ప్రోమోలో మరో ట్విస్టు ఇచ్చారు. ఆనంద్‌ను కనిపించకపోవడంతో హిమ ఇంటి సభ్యులందర్నీ ప్రశ్నించింది. తమ్ముడు ఎక్కడ అంటూ గట్టిగా అరిస్తే.. వాళ్ల బంధువులు వచ్చి తీసుకెళ్లారు అని సౌందర్య సమాధానం చెప్పింది. దాంతో బంధువులు లేరని చెప్పారు. నాకు తమ్ముడు కావాలి అంటూ హిమ గట్టిగా అరవడం ప్రోమోలో హైలెట్‌గా మారింది. రకరకాల ట్విస్టులతో కార్తీక దీపం సీరియల్ మంచి రేటింగ్‌తో ముందుకెళ్తున్నది. ఈ వారం 13.45 రేటింగ్‌తో తెలుగు సీరియల్‌లో టాప్ స్థానంలో నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X