Karthika Deepam నేను మహానటిని.. మోనిత చెంప పగలకొట్టిన సౌందర్య
ఆనంద్ దత్తత వ్యవహారం పెద్ద ఘనకార్యంగా కార్డులు ప్రింట్ చేసి అందర్నీ ఆహ్వానించింది అని మోనిత అంటే.. మమ్మీ ఆనంద్ దత్తత గురించి కార్డులు పంచావా? అని కార్తీక్ అంటే.. అవును అని సౌందర్య చెప్పింది. ఆనంద్‌ను ఎలా దత్తత ఇస్తావు అని కార్తీక్ సీరియస్ అయితే.. అవును.. పిల్లలు లేని వాళ్లు నన్ను కలిశారు. దాంతో వారికి దత్తత ఇవ్వాలని నిర్ణయించుకొన్నాను. అందుకే కార్డులు పంచాను అని సౌందర్య సమాధానం చెప్పింది. దాంతో దీప, కార్తీక్ షాక్ తిన్నారు. అయితే కార్తీక, సౌందర్య సంభాషణలో మోనిత జోక్యం కలిగించుకొంటూ.. దత్తత ఇవ్వడానికి మీరు ఎవరు? తీసుకోవడానికి వాళ్లు ఎవరు అంటూ మోనిత సీరియస్ అయింది. ఇక కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1291 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

కన్నతల్లిని నేను కాబట్టి అంటూ
మోనిత మాటలకు గట్గిగా సౌందర్య జవాబిస్తూ.. ఇచ్చేది నువ్వంటే.. ఆనంద్‌ను దత్తత ఇచ్చేది నేను. తీసుకొనేది వాళ్లు. పంతులు గారు మీరు పూజా కార్యక్రమం కానివ్వండి. కార్తీక్, దీప మీరు కూర్చొండి అని సౌందర్య అంది. దాంతో సౌందర్య గారు.. నేను ఒప్పుకోను అని మోనిత అంటే.. నువ్వెవరివే ఒప్పుకోకపోవడానికి అని సౌందర్య గట్టిగా కౌంటర్ ఇచ్చింది. దాంతో ఆ బాబు కన్నతల్లిని నేను కాబట్టి అని మోనిత గట్టిగా అరిచింది. దాంతో మోనిత మతిపోతుందా అంటూ కార్తీక్ గట్టిగా అరిచాడు. దాంతో అవును.. ఈ బాబును కన్నది నేను. ఆనంద్ నా బిడ్డ అంటూ మోనిత తన మనసులోని మాటను బయటపెట్టింది.

నిన్ను రప్పించడానికే నాటకం ఆడా
మోనిత మాటలతో కంగారుపడిన కార్తీక్.. ఏంటి? మమ్మీ.. ఏంటి ఇదంతా? అని కార్తీక్ అంటే.. అవును. మోనిత ఆడే నాటకాన్ని బయటపెట్టడానికి ఈ దత్తత పూజను ఏర్పాటు చేశాను అని సౌందర్య అంటూ.. నాటక శిరోమణి.. నీ బిడ్డ నా ఇంట్లోనే ఉన్నాడని తెలిసి. నీవు కార్తీక్‌తో డ్రామాలు ఆడుతున్నావు. కార్తీక్‌కు దగ్గరవ్వాలని ప్లాన్ వేస్తూ.. బిడ్డను వెతికి ఇవ్వాలని నువ్వే చెబుతావా? ఏంటీ నాటకాలా? ఇంకా ఎన్నాళ్లు నా ఫ్యామిలీతో ఆడుకొంటావు. బాబును ఎవ్వరికి దత్తత ఇవ్వడం లేదు. నిన్ను ఇక్కడికి రప్పించడానికి కార్డులు ప్రింట్ చేసి.. బస్తీవాసులకు పంచాను. నీకు తెలిసి ఇక్కడకి వస్తావని నాటకం ఆడాను. నీవు మామూలు నటిని అయితే.. నేను మహానటినే. తెలివి తేటలు ఏ ఒక్కరి సొత్తు కాదు. భగవంతుడా నన్ను క్షమించు. నీ సన్నిధిలో ఓ మంచి పని జరుగుతున్నది. సారీ పెద్దోడా అని సౌందర్య చెప్పింది.

మోనితకు షాకిచ్చిన రత్నసీత
ఆనంద్ గురించి తెలిసినా మోనిత నాటకం ఆడింది. ఆ వంకతో నీకు దగ్గర కావాలని.. నిన్ను తిప్పించి ఆ తర్వాత చెప్పాలని.. దాంతో తను లాభం పొందాలని మోనిత ప్లాన్ చేసింది అని సౌందర్య చెప్పింది. అయితే బాబుపై మనం మమకారం పెంచుకొన్న తర్వాత నీకు దగ్గర కావాలని ప్లాన్ చేసింది అని సౌందర్య అంటే.. బాబు మన వద్దకు ఎలా చేరాడు అని కార్తీక్ అమాయకంగా అడిగితే.. కోటేష్ బిడ్డను ఎత్తుకొచ్చిన విషయాన్ని చెప్పింది. దాంతో కార్తీక్ షాక్ తిన్నాడు. కోటేష్ బిడ్డను దొంగలించిన విషయాన్ని చెప్పవద్దని కానిస్టేబుల్ రత్న సీత చెప్పింది అని సౌందర్య అంటే.. రత్నసీతకు నేను ఎందుకు చెబుతాను అంటే.. రత్న సీత అంటూ సౌందర్య పిలువగానే ఆమె అక్కడికి వచ్చింది. రత్న సీతను చూడగానే మోనిత, కార్తీక్ షాక్ తిన్నారు.

జైలుకెళ్లినా బుద్ది మారలేదు
కోటేష్ ఎత్తుకెళ్లడం, ఆనంద్ మోనిత బిడ్డ అనే విషయం మాకు ఆలస్యంగా తెలిసింది. అందుకే మోనిత కుట్రను బయటపెట్టడానికే నిన్ను దత్తత డ్రామా ఆడాను అని సౌందర్య చెప్పింది. దాంతో రత్న సీత తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను కార్తీక్‌కు రత్నసీత చూపించింది. దాంతో అవును.. కార్తీక్‌కు దగ్గర కావడానికి నేనే ప్లాన్ చేశాను అని మోనిత సమాధానం చెప్పడంతో కోపంతో రగిలిపోతున్న సౌందర్య వచ్చి మోనితను చెంపపై కొట్టింది. నీవు ఆడదానివేనా? చిన్న పిల్లాడిని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతావా? జైలుకు పోయి వచ్చినా నీ బుద్ది మారలేదు. బిడ్డను ఇస్తే.. కార్తీక్‌ను వదిలేస్తావని అన్నావట.. ఇదిగో అంటూ దీప ఒడిలో ఉన్న ఆనంద్‌ను తీసుకొచ్చి మోనితకు ఇచ్చింది. దాంతో కార్తీక్, దీప ఆవేదన చెందారు. అయితే మీరు మధ్యలో రాకండి.. బాబును ఇవ్వమని మోనితకు నమ్మకం. ఇక ముందు మా ఇంటివైపు రావొద్దు. నీ బిడ్డ మా ఇంటి వారసుడివి కాలేవు. ఎప్పటికీ నా కోడలు కాలేవు. నాకు ఇద్దరు కొడుకులు.. ఇద్దరు కోడళ్లు.. ఇద్దరు మనవరాళ్లు.. ఒక మనవడు అని సౌందర్య చెప్పింది.

పీడ విరుగడైంది అంటూ
మోనిత నాటకాలు అందరూ చూశారుగా.. ఈమెకు మాకు ఎలాంటి సంబంధం లేదు. పిలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు. పదండి.. ఈ రోజుతో పీడ విరుగడైంది అని సౌందర్య అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆనంద్ దూరమయ్యాడనే బాధతో కార్తీక్, దీప, సౌందర్య ఆవేదన చెందారు. ఆనంద్ లేకపోవడంతో కార్తీక్ కుటుంబ సభ్యులు బాధలో మునిగిపోయారు.

కార్తీకదీపం సీరియల్‌కు టాప్ రేటింగ్
కార్తీక దీపం సీరియల్ బుల్లి తెర ప్రేక్షకులను విశేషంగా రంజింపజేస్తున్నది. గత మూడేళ్లుగా టాప్ రేటింగ్‌తో కొనసాగుతున్నది. ప్రస్తుతం లేటేస్ట్ వారంలో కూడా అధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో కార్తీక దీపం సీరియల్ 13.12 రేటింగ్ నమోదు చేసింది. మిగితా స్థానాల్లో గృహలక్ష్మి 11.34, గుప్పెడంత మనసు 11.31, దేవత 10.55 స్థానాల్లో ఉన్నాయి. జానకి కలగనలేదు 8.21 రేటింగ్‌తో కొనసాగుతున్నది.


Click it and Unblock the Notifications











