Karthika Deepam తమ్ముడు ఎక్కడ అంటూ కంటతడి పెట్టిన హిమ
కార్తీకదీపం సీరియల్‌లో హై డ్రామా మధ్య ఆనంద్‌ను మోనితకు అప్పగించడంతో ఇళ్లంతా ఒకరకమైన వైరాగ్యంతో నిండిపోయింది. అంతలోనే తల్లి వద్దకు వచ్చిన హిమ.. తన తమ్ముడు ఆనంద్ కనిపించకపోవడంతో కంగారుపడిపోయింది. తమ్ముడు ఎక్కడా? అందరూ ఇక్కడే ఉన్నారు? తమ్ముడు కనిపించడం లేదు అని చుట్టుపక్కల వెతికింది. డాడీ వద్దకు వెళ్లి తమ్ముడు ఎక్కడా అని అడిగింది. తండ్రి నుంచి సమాధానం రాకపోవడంతో నానమ్మ వద్దకు వెళ్లి తమ్ముడు ఎక్కడ అని అడిగింది. ఎవరూ మాట్లాడకపోవడంతో చెప్పండి అని హిమ ప్రాధేయపడింది. దాంతో కంటతడి పెట్టుకొన్న సౌందర్య.. తమ్మడిని వాళ్ల బంధువులు వచ్చి తీసుకెళ్లారు అని చెప్పడంతో హిమ షాకైంది.
అయితే నానమ్మ మాటలపై స్పందిస్తూ.. తమ్ముడు లేని విషయం తెలిసి ఆనంద్‌ను తీసుకెళ్లారా? తీసుకెళ్లడమేమిటి? తమ్ముడికి బంధువులు ఎవరు లేరు కదా.. అయినా మీరు ఎలా ఇస్తారు? అంటూ భోరున హిమ ఏడ్చింది. అమ్మా.. తమ్ముడిని ఎవరికి ఇచ్చారు.. వెళ్లి మనం తెచ్చుకొందాం.. డాడీ తమ్మడిని తెచ్చుకొందా పదండి అంటూ హిమ కంటతడి పెట్టింది. శౌర్య వద్దకు వెళ్లి తమ్ముడు వెళ్లిపోతే నీకు బాధ లేదా? అంటూ ప్రశ్నించింది. అయితే ఎవరు మాట్లాడకపోవడంతో.. నాకు తమ్ముడు కావాలి.. నాకు ఆనంద్ కావాలి అంటూ నేలపై కుప్పకూలింది.

అయితే హిమను నానమ్మ ఓదార్చే ప్రయత్నం చేసింది. అయితే ఎవరు ఏమి చెప్పినా వినను.. నాకు తమ్ముడు కావాలి అంటూ హిమ భోరున ఏడుస్తూ విలపించింది.
ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తున్నది. ప్రస్తుత వారంలో 13.11 రేటింగ్‌తో ముందుకెళ్తున్నది.


Click it and Unblock the Notifications











