Karthika Deepam నాతో పెట్టుకొంటే మోక్షమే.. పిస్టల్ తీసి మోనిత కుట్ర.. కార్తీక్‌కు ముప్పు అంటూ పూజారి ట్విస్టు!

అత్యంత హైడ్రామా మధ్య మోనితకు తన కుమారుడు ఆనంద్‌ను అప్పగించడంతో కార్తీక్, దీప కూతురు హిమ భోరున ఏడుస్తూ తల్లడిల్లిపోయింది. నాకు తమ్ముడు కావాలి. అందరూ ఏదో చేశారు. నా తమ్ముడిని ఎవరికో ఇచ్చారు అంటూ ఆదిత్యకు వెళ్లి ప్రాధేయపడింది. బాబాయ్, పిన్నిలను చేయిపట్టి లాగి తమ్ముడిని తెచ్చుకొందాం అని కంటతడి పెట్టింది. తాత, నానమ్మ వద్దకు వెళ్లి తమ్ముడు కావాలని అడిగింది. అయితే ఎవరూ మాట్లాడకపోవడంతో తమ్ముడంటే ఎవరికి ప్రేమ లేదా? మీరు ఎప్పుడు నిజాలు చెప్పారని.. మీరు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా? నేనే వెతికి పెట్టుకొంటాను.

శౌర్య నీకు తమ్ముడి మీద ప్రేమ లేనే లేదు కదా.. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. హిమ వెళ్లిపోయిన తర్వాత సౌందర్య ఎమోషనల్ అయింది. బాబు విషయంలో నేను తప్పు చేశాను అంటూ కార్తీక్ చేతులు పట్టుకొంది. పిల్లల్ని తీసుకొని కొన్నాళ్లు ఎక్కడికైనా వెళ్లి రండి అని చెప్పింది. కార్తీకదీపం సీరియల్‌ తాజా ఎపిసోడ్‌ 1292 లో ఇంకా ఏం జరిగిందంటే..

జీవితంలో రాక్షసపర్వం ముగిసింది

జీవితంలో రాక్షసపర్వం ముగిసింది

తల్లి సూచనతో కార్తీక్, దీప, హిమ, శౌర్య అందరూ కర్ణాటకలో విహారయాత్రకు వెళ్లారు. అయితే విహారయాత్రకు వెళ్తున్నామంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇలా ట్రిప్‌కు వెళ్లి చాలా రోజులైంది అని శౌర్య అంటే.. నాకు కూడా నమ్మబుద్ది కావడం లేదు. ఇలా టూర్‌కు వెళ్లి ఎన్నో రోజులైందో. ఈ సంతోషం ఇలాగే ఉంటుందా అంటే.. అవును.. మన జీవితంలో రాక్షస పర్వం ముగిసింది.

ఇక ఎప్పటికి ఇలానే సంతోషంతో ఉంటాం. మనమెక్కడ ఉన్నా ఎప్పటికీ ఇలా సంతోషంగా ఉండాలి అని కార్తీక్ అన్నాడు. ఎన్నో కష్టాలు పడటం, తాడికొండకు వెళ్లడం, హోటల్‌లో పనిచేయడం ఓ కలలా ఉంది అని దీప అంటే.. అవును.. పిల్లలకు ఓ పూట భోజనానికి కూడా కష్టంగా మారింది. ఆ విషయం గుర్తు చేసుకొంటే భయంగా ఉంది అని కార్తీక్ అన్నారు.

 హిమకు నచ్చ చెప్పిన దీప, కార్తీక్

హిమకు నచ్చ చెప్పిన దీప, కార్తీక్

కార్తీక్, దీప ఇలా మాట్లాడుకోవడాన్ని చూసి హిమ ఆవేదన చెందింది. తమ్ముడు గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు. తమ్ముడు లేడనే బాధ కూడా ఎవరికి కలుగలేదు అని హిమ అంటే. అయితే ఆనంద్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకొంటే.. అంత మంచింది. ఆనంద్ విషయం ఎత్తితే.. ఎవరికి ఇచ్చారని అడుగుతుంది అని దీప, కార్తీక్ మనసులో అనుకొన్నారు. అయితే హిమకు నచ్చచెప్పుతూ.. నీవు, నేను వేర్వేరుగా ఉన్నాం.

అప్పుడు మనిద్దరి ఎంత బాధపడ్డామో నీకు తెలుసా? మనం కలుసుకొన్న తర్వాత ఎంత సంతోషపడ్డామో గుర్తు చేసుకో. ఆనంద్ ముద్దుగా ఉంటాడు. అందరికి వాడంటే ఇష్టమే.. ఆకలేస్తే తప్ప ఏడ్చిన సందర్భాలు లేవు. అలాంటి ఆనంద్ తల్లిదండ్రుల వద్దకు చేరితే సంతోషంగా ఉంటాడు. మనతో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాడు. మనకు నిజమైన సంతోషం ఎప్పుడంటే.. ఇతరులకు సంతోషం కలిగినప్పుడే అని హిమతో దీప చెప్పింది.

ఆనంద్ గురించి ఎక్కువగా..

ఆనంద్ గురించి ఎక్కువగా..

ఆనంద్ గురించి ఎక్కువగా గుర్తు చేసుకోవద్దు. ఎందుకంటే.. ఆనంద్ గుర్తుకు వస్తే తాడికొండలో మనం పడిన కష్టాలు గుర్తుకొస్తాయి. ఇలాంటి సంతోష సమయంలో అలాంటి వాటిని గుర్తు చేసుకోవడం వద్దు. చిక్‌మంగళూరు వెళ్తున్నాం కాబట్టి హ్యాపీగా ఉందాం అని దీప చెప్పింది. అయితే హిమ ముభావంగా ఉండటంతో అలిగినావా అని దీప ప్రశ్నిస్తే.. అలిగిన వాళ్లు అలిగామని చెప్పుకొంటారా అని హిమ జవాబిచ్చింది. అయితే హిమ అలక తీర్చడం నాకు తెలుసు అంటూ కార్తీక్ కారు ఆపి.. నీవు కారు డ్రైవింగ్ నేర్చుకొంటానని చెప్పావుగా.. ముందుకు రా అంటూ హిమను తనపై కూర్చోబెట్టుకొని కార్తీక్ కారు డ్రైవింగ్ చేస్తూ ముందుకు వెళ్లారు.

హిమ కారు డ్రైవింగ్‌తో

హిమ కారు డ్రైవింగ్‌తో

కార్తీక్‌పై కూర్చొని హిమ కారు నడుపుతూ ఉంటే దీప, శౌర్య భయపడిపోయారు. అయితే కారు స్పీడ్ ఎలా పెంచాలి.. బ్రేక్ ఎక్కడ ఉందో చెప్పు అంటే.. దీప వారించింది. కారు నడపడం రాదు కాబట్టే మేమంత భయపడుతున్నాం అని శౌర్య చెప్పింది. కారు నడపడం రాకపోయినా ఏం కాదు.. మనమేమి చచ్చిపోలేం. మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డువేస్తా అంటూ హిమ డైలాగ్స్ కొట్టింది. అయితే అలాంటి మాటలు మాట్లాడటం వద్దు అని దీప అంటే.. పైన మనకు తథాస్తు దేవతలు ఉంటారు. అలాంటి మాటలు మాట్లాడవద్దు అని శౌర్య నచ్చ చెప్పింది.

పూజారి వార్నింగ్‌తో మరో ట్విస్టు

పూజారి వార్నింగ్‌తో మరో ట్విస్టు

తమ కుటుంబంలో అంతా మంచి జరుగుతుండటంతో గుడికి వెళ్లి పూజారిని సౌందర్య, ఆనందరావు కలిసి పూజలు చేయించారు. అయితే మా ఇంటిలో అంత ప్రశాంతత చేకూరింది. రాక్షస పీడ వదలింది అని సౌందర్య అంటే.. అందరూ కలిసి దైవదర్శనానికి రావొచ్చు కదా అని పూజారి అడిగాడు. దాంతో వాళ్లు చిక్‌మంగళూరు విహారయాత్రకు వెళ్లారు. ఎక్కడైతే వాళ్ల జీవితంలోకి కష్టాలు వచ్చాయో.. అక్కడే వారు సంతోషాన్ని వెతుక్కోవాలని అనుకొంటున్నారు అని సౌందర్య అంటే.. అక్కడికి ఎందుకు వెళ్లారు.. పూర్వ జన్మలో పాపాలు వెంటాడుతుంటాయి.

ఎక్కడైతే కార్తీక్, దీప జీవితం విచ్చిన్నమైందో అక్కడికి వెళ్లడం తప్పు. నా మనసు ఏదో కీడు శంకిస్తున్నది. కాబట్టి వీలైతే వెనక్కి రమ్మనమండి.. లేదా జాగ్రత్తగా ఉండమని చెప్పండి అంటూ సౌందర్య, ఆనందరావు ఊహించిన షాక్ పూజారి ఇచ్చాడు.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
మోనితతో పెట్టుకొంటే మోక్షమే అంటూ..

మోనితతో పెట్టుకొంటే మోక్షమే అంటూ..

దత్తత నాటకంలో ఘోర పరాజయం పొందడంతో మోనిత రగిలిపోయింది. మా ఇంట్లో పెరుగుతున్న బిడ్డను నీ కొడుకే అని నీ నోటితో చెప్పించాలని దత్తత నాటకం ఆడించాను. నీవు కోరినట్టే నీ బిడ్డను నీకు అప్పగించాను. ఇక మా కుటుంబానికి దూరంగా ఉండు అంటూ సౌందర్య చెప్పిన మాటలను గుర్తు చేసుకొన్నది. నలుగురిలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకొని ఆవేశంగా తనలో తాను మాట్లాడుకొంటూ.. నేను అందరి లాంటిది దాన్ని కాదు.

ఊరి జనాల ముందు అవమానించి నా పరువు తీస్తారా? నాకు దక్కకుండా .. మీకు కావాల్సింది తీసుకొంటే ఊరుకొంటానా? మోనితతో పెట్టుకొంటే మోక్షమే అంటూ తుపాకీ చేతులోకి తీసుకొన్నది. తన తల వద్ద పిస్టల్ పెట్టుకొని.. నా ఆవేశం కార్తీక్‌పై ప్రేమను కోరుకొన్నది. కానీ ఇప్పుడు బలి కోరుకొంటున్నది అని మోనిత చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X