For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam మోనిత బండారం బయటపెట్టిన దీప.. బిడ్డకు తండ్రి ఎవరో తేల్చేసిన వంటలక్క

  |

  కార్తీకదీపం సీరియల్‌లో ఎవరూ ఊహించిన ట్విస్ట్‌కు తెరలేచింది. మోనిత నాటకాలకు మద్దతు తెలియజేస్తూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన దీప భారీ షాకిచ్చింది. మోనిత ఇంట్లో బారసాలకు ఏర్పాట్లు చేసుకోమని చెప్పిన దీప సూట్‌కేసు బాంబును వంటలక్క పేల్చింది. బారసాల వేడుకలో ఏం జరుగబోతుందనే విషయంతో కంగారు పడిన ఇంటి సభ్యులకు మోనిత నిజస్వరుపాన్ని బయటపెట్టేందుకు రంగం సిద్దం చేసింది. కార్తీకదీపం సీరియల్‌లో 1204 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

  పెద్దవాళ్లతో ఇదే తలనొప్పి అంటూ దీప

  పెద్దవాళ్లతో ఇదే తలనొప్పి అంటూ దీప

  తన పుట్టిన రోజున శౌర్య, హిమను రెస్టారెంట్‌కు తీసుకెళ్లిన దీప.. వారిని అక్కడి నుంచి ఇంటికి పంపించి.. తను మాత్రం తన పుట్టినింటికి వెళ్లింది. తండ్రికి కొత్త బట్టలు తీసుకొని వెళ్లడంతో ఆయన కాసేపు సంతోష పడ్డారు. ఎవరైనా పండగకు కూతురు, అల్లుడికి బట్టలు తెస్తారు. కానీ నువ్వేంటమ్మ.. నాకు బట్టలు తెచ్చావు. ఇంతకు అల్లుడు రాలేదంటమ్మా అంటూ దీపను ప్రశ్నించాడు. అయితే మీ పెద్దవాళ్లతో ఇదే తలనొప్పి.. మీరు ఆలోచించే విధానం ఏమిటో అర్ధం కాదు. నేను మీ అల్లుడు గొడవ పడ్డామని కంగారుపడుతున్నావా? అని దీప అడిగింది.

  తండ్రితో దీప ఎమోషనల్‌గా

  తండ్రితో దీప ఎమోషనల్‌గా

  అయితే దీప మాట్లాడుతున్న తీరును చూసి నువ్వు బాగున్నావా అని తండ్రి అడిగాడు. అయితే బాగుండటమంటే.. సంతోషంతో కనిపించడమా? సంతోషంలో ఉన్నట్టు నటించడమా? మీరేం బయపడకండి.. అల్లుడితో గొడవ పడి పుట్టింటికి వచ్చావని అనుకోవద్దు. అలాంటిదేమీ లేదు నాన్న అని దీప చెప్పింది. పెళ్లి తర్వాత పుట్టింటికి కూతురు వస్తే ఏ తండ్రైనా సంతోషపడుతాడు. కానీ ఒంటరిగా వస్తేనే కంగారు పడుతుంటాడు. ఇంతకు నీకు మోనిత వల్ల ఏమైనా కష్టం వచ్చిందా అంటే..నాకు కష్టాలు కూడా బోర్ కొడుతున్నాయి. అదేమన్నా కొత్త విషయమా? దానిని వదిలేయమ్మా అంటూ దీప చెప్పింది.

  నాకు ఆస్తి ఎందుకు అంటూ

  నాకు ఆస్తి ఎందుకు అంటూ

  పిన్ని భాగ్యం కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లిందని దీప అడిగితే.. పుట్టింటికి వెళ్లిందని తండ్రి చెప్పాడు. పుట్టింటి నుంచి 4 ఎకరాలు ఆస్థి రావాల్సి ఉంది. అది వస్తే నీకు 2 ఎకరాలు, శ్రావ్యకు 2 ఎకరాలు ఇద్దామని అనుకొంటున్నాం అంటే.. నాకు ఎందుకు నాన్న.. మొత్తం 4 ఎకరాలు శ్రావ్యకే ఇద్దాం అని దీప చెప్పింది. అంతేకాకుండా.. కలిసి భోజనం చేసి చాలా రోజులైంది. కలిసి భోజనం తిద్దామని కాస్త తేడాగా మాట్లాడటంతో దీప తండ్రి కంగారుపడిపోయాడు. మళ్లీ ఏదైనా సమస్య వచ్చిపడిందా అనే అనుమానంతో టెన్షన్ పడిపోయాడు.

  బారసాల వేడుకల్లో మోనిత హడావిడి

  బారసాల వేడుకల్లో మోనిత హడావిడి

  తన కుమారుడు ఆనందరావుకు బారసాల ఫంక్షన్ చేస్తూ ఇంటిలో అలంకరణ విషయంలో మోనిత హడావిడి చేసింది. ప్రియమణితో పనుల చేయించమని హంగామా చేసింది. అంతలోనే ఇంటికి వచ్చిన డాక్టర్ భారతీ.. ఏర్పాట్లు చూసి కంగారుపడిపోయింది. ఏంటి హడావిడి ఏమిటి అని అడిగితే.. బారసాల ఫంక్షన్ చేస్తున్నాం.

  రేపు ఏదైనా జరిగితే అందరి ముందు తలెత్తుకోలేవు అని భారతీ అంటే.. కార్తీక్ కుటుంబ సభ్యులను దీప స్వయంగా తీసుకు వస్తున్నదని మోనిత చెప్పడంతో భారతీ షాక్ తిన్నది. అయితే ఇలాంటి పనులు చేయకు అని భారతీ సలహా ఇస్తే.. అవన్నీ పట్టించుకోకు.. నీవు నీ భర్త కలిసి ఈ ఫంక్షన్‌కు రావాలి అంటూ ఆహ్వానం పంపింది.

  తప్పు చేస్తున్నామా అంటూ కార్తీక్ తల్లిదండ్రులు

  తప్పు చేస్తున్నామా అంటూ కార్తీక్ తల్లిదండ్రులు

  ఇక మోనిత ఇంట్లో జరిగే ఫంక్షన్‌కు వస్తూ కార్తీక్, తన తల్లిదండ్రుల దీర్గమైన ఆలోచనల్లో పడ్డారు. మోనితను బారసాల ఫంక్షన్‌కు ఏర్పాట్లు చేసుకొమని దీప చెప్పడంపై ఏం జరుగుతున్నదో అర్ధం కాకుండా తికమక పడ్డారు. తాము చేస్తున్నది తప్పు అంటూ ముగ్గురు మదనపడ్డారు. దీపకు తీరని అన్యాయం చేస్తున్నామని సౌందర్య కన్నీటిపర్యంతమైంది.

  మోనిత ఇంట్లోకి దీప సూట్ కేసుతో

  మోనిత ఇంట్లోకి దీప సూట్ కేసుతో

  బారసాల ఫంక్షన్‌కు మోనిత ఏర్పాట్లు చేసుకొంటూ సంతోషంలో ఉండగా.. దీప ఆటోలో దిగింది. డ్రైవర్ వారణాసిని వెళ్లిపోమ్మని చెప్పింది. అయితే నేను ఇక్కడే ఉంటాను. నీవు వెళ్లిపో అంటే కాసేపు వారణాసి వెళ్లను అని బెట్టు చేసింది. అనంతరం వారణాసిని పంపించి.. మోనిత ఇంట్లోకి దీప అడుగుపెట్టింది. దీపను చూసి వెల్‌కమ్ దీప.. స్వాగతం.. సుస్వాగతం అంటూ మోనిత ఆనందంలో మునిగిపోయింది. దీప సూట్ కేసుతో రావడంతో చూసి డాక్టర్ భారతీ షాక్ గురైంది. ప్రియమణికి సూట్ కేసు ఇచ్చి నేను అడిగినప్పుడు ఇవ్వమని చెప్పింది.

  Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
  ప్రోమోలో సూట్ కేసు బాంబు పేల్చిన వంటలక్క

  ప్రోమోలో సూట్ కేసు బాంబు పేల్చిన వంటలక్క

  తాజా ప్రోమోలో మోనితను దీప కడిగిపడేసింది. నీ కడుపున పుట్టిన బిడ్డకు కార్తీక్ తండ్రి కాదనే విషయాన్ని చెప్పినట్టు ప్రోమోలో స్పష్టమైంది. ప్రియమణితో సూట్ కేసు తప్పించి అందులోని కొన్ని డాక్యుమెంట్లను చూపించి మోనితను బెదరకొట్టింది. అసలు ఏం జరుగుతన్నదనే విషయం అర్ధం కాక మోనిత షాక్‌లో ఉండిపోయింది. రానున్న ఎపిసోడ్‌లో దీప ప్లాన్ ఏమిటో అర్ధం అవుతుంది.

  English summary
  Highest rated Telugu serial Karthika Deepam's November 23rd Episode number 1204
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X