twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam నాకు దీప విలన్.. కార్తీక్ నుంచి తప్పిస్తా.. మోనిత శపథంతో మరో ట్విస్టు

    |

    కార్తీక్‌పై మోనిత పన్నిన కుట్రలకు దిమ్మతిరిగేలా దీప అలియాస్ వంటలక్క చెక్ పెట్టిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. కార్తీక్ కుటుంబంలో సంతోషాలు నెలకొన్నడంతో అందరూ ఆనందంతో ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొంటూ కనిపిస్తున్నారు. తమ తల్లిదండ్రుల మధ్య ప్రేమానురాగాలు కనిపించడంతో పిల్లలు శౌర్య, హిమ కూడా ఆనందంలో మునిగిపోతున్నారు. దీప చేతిలో మరోసారి పరాభవం పొందడంతో మళ్లీ కొత్తరకం కుట్రలకు మోనిత పదును పెట్టింది. ఈ నేపథ్యంలో కార్తీకదీపం సీరియల్‌లోని 1210 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

    బస్తీలో ఇల్లు ఉంటే ఆనందంగా

    బస్తీలో ఇల్లు ఉంటే ఆనందంగా

    అయితే దీపకు ఇష్టమైన బస్తీలో ఇల్లు కట్టుకోవాలని, అలాగే అక్కడే హాస్పిటల్ పెట్టుకోవాలని కార్తీక్ నిర్ణయం తీసుకోవడంతో పిల్లల్లో కూడా ఉత్సాహం ఉరకలేసింది. బస్తీలో ఇల్లు కడుతున్నారనే విషయాన్ని శౌర్య చెప్పినప్పటి నుంచి హిమ ఆనందంలో మునిగిపోయింది. శౌర్యతో హిమ మాట్లాడుతూ.. అక్కడ ఇల్లు ఉంటే బాగుంటుంది కదా అని అంటే.. అవును అక్కడ ఉంటే మనుషులు కనిపిస్తారు. పిల్లలు ఉంటారు అని శౌర్య అంటే.. అవును.. మనం ఆడుకోవడానికి పిల్లలు కూడా ఉంటారు. బస్తీలో ఉంటే ఆనందంగా ఉంటుంది అని హిమ సమాధానం చెప్పింది.

    నేను గొప్ప ప్రేమికురాలిని అంటూ మోనిత

    నేను గొప్ప ప్రేమికురాలిని అంటూ మోనిత

    ఇక బస్తీవాసులకు కార్తీక్ వైద్యం చేస్తుండగా వెళ్లిన మోనిత వెళ్లి రచ్చ చేయడంతో అక్కడి వారు చీపురు కట్టలతో సన్మానం చేస్తామని తరిమి కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని నవ్వుల్లో మునిగిపోయింది. అయితే బస్తీవాసుల తిటినా మోనిత నవ్వుల్లో ఉండటం చూసి ప్రియమణి కంగారుపడిపోయింది. అయితే ప్రియమణిని చూసి మోనిత మాట్లాడుతూ.. బస్తీవాసులు తరిమికొట్టినా నవ్వుకుంటుందేంటి అనుకొంటున్నావా? సరిగా నన్ను అర్ధం చేసుకోవడం లేదు. నేను గొప్ప ప్రేమికురాలిని. కానీ నా ప్రేమ ప్రపంచం ఎవరికీ అర్ధం కావడం లేదు. కార్తీక్, దీప, మా అత్తగారు అర్ధం చేసుకోవడం లేదు. వారికి అర్ధమయ్యేలా చేయడం నా పని అని మోనిత చెప్పింది.

    దీపను కష్టపెడితే.. కార్తీక్ నాకు దగ్గరవుతాడంటూ

    దీపను కష్టపెడితే.. కార్తీక్ నాకు దగ్గరవుతాడంటూ

    అంతటితో ఆగకుండా తన కుమారుడు ఆనందరావును చూసి.. నీవు పుట్టినప్పటి నుంచి నాకు అంతా మంచి జరుగుతున్నది. నాకు మంచి జరుగుతున్నదంటే.. నీ పెద్దమ్మకు చెడు జరుగుతున్నట్టే కదా అని మోనిత అంటే.. పాపం దీపమ్మ ఏం చేసిందమ్మ.. కావాలంటే.. నీ ఫ్రెండ్ కార్తీక్‌తో తేల్చుకోండి. దీపమ్మను ఇబ్బంది పెడితే నీకు లాభమేంటి అంటూ ప్రియమణి సూచించింది. అయితే లైట్ ఆర్పాలంటే స్విచ్ ఆఫ్ చేయాలి.. కార్తీక్ దారిలోకి రావాలంటే.. దీపను కష్టపెట్టాలని తన లాజిక్‌ను ప్రియమణికి మోనిత చెప్పింది.

    దీపను ఎలా తప్పించాలంటూ ప్లాన్స్

    దీపను ఎలా తప్పించాలంటూ ప్లాన్స్

    అయితే కృత్రిమ గర్భానికి సంబంధించిన సీక్రెట్ దీపకు ఎలా తెలిసింది. ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి. నా దారి నుంచి దీపను ఎలా తప్పించాలనే ఆలోచనలో పడింది. టెన్సన్ తట్టుకోలేక ప్రియమణిని పిలిచి బుర్ర వేడెక్కింది. ఓ స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు అంటే.. ప్లాన్ల మీద ప్లాన్స్ వేస్తున్నారు. ఇక బుర్ర వేడెక్కకపోతే ఏమౌతుంది అంటూ ప్రియమణి గొణుక్కొన్నది. ఏంటో ఈ మోనితమ్మ అంటూ విసుక్కొన్నది.

    కార్తీక్ ప్రసిడెంట్ అయితే నాకేంటి?

    కార్తీక్ ప్రసిడెంట్ అయితే నాకేంటి?

    అంతలోనే మోనితకు డాక్టర్ భారతీ ఫోన్ చేసి.. కార్తీక్‌ను డాక్టర్ల అసోసియేషన్స్‌కు ప్రసిడెంట్‌గా ఎన్నుకొంటారు. నీవు వస్తావా అంటే.. ఎవరు ప్రసిడెంట్ అయితే నాకేంటి? నేను చాలా టెన్షన్లో ఉన్నాను. నాకు ఎందుకు ఈ విషయాలు చెబుతున్నావు అంటూ మోనిత విసుక్కొన్నది. దాంతో నీవు వస్తే ఎక్కడ రచ్చ జరుగుతుందోనని నేను భయపడ్డాను. నీవు రావడం లేదంటే చాలా సంతోషంగా ఉందని చెప్పింది.

     నా కథలో దీప విలన్ అంటూ మోనిత

    నా కథలో దీప విలన్ అంటూ మోనిత

    అయితే ఫోన్ పెట్టేసిన మోనిత.. తన కార్తీక్ ఫోటోను చూసి తనలో తాను మాట్లాడుకొన్నది. ఏంటి కార్తీక్ నా ప్రేమను అర్ధం చేసుకోవా? ఇంకా ఏం చేస్తే నువ్వు నమ్ముతావు. నీ కోసం చావు అంచుల దాక వెళ్లి వచ్చాను. జైలు శిక్ష అనుభవించి వచ్చాను. అయినా నీవు కరగలేదు. బిడ్డను కని ఇచ్చాను.. అయినా కరగలేదు. నా కథలో దీప విలన్. దీప ఉన్నంత కాలం కార్తీక్‌ను కలువనీయదు. మాట్లాడనీయదు. నాకు, కార్తీక్ మధ్య నుంచి దీపను ఎలా తప్పించాలి. ఇక నుంచి జాగ్రత్తగా ప్లాన్ వేయాలి అంటూ మోనిత మరో ప్లాన్‌కు సిద్దమైంది. దీప నీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి.. నీ ఆట నీవు ఆడు.. నా ఆట నేను ఆడుతా. నా కార్తీక్‌ను దక్కించుకొంటాను అని మోనిత అంది.

    కార్తీక్ నాకు అన్యాయం చేశాడంటూ..

    కార్తీక్ నాకు అన్యాయం చేశాడంటూ..

    అయితే కార్తీక్ అసోసియేషన్ ప్రసిడెంట్‌గా ఎన్నికైన కార్యక్రమానికి ఊహించని విధంగా వచ్చిన మోనిత భారీ ట్విస్ట్ ఇచ్చింది. కార్తీక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నామని డాక్టర్ భారతీ ప్రకటించగానే.. కార్తీక్ గురించి మీకంటే నేనే మంచిగా చెబుతాను అని మోనిత చెప్పి అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. నాకు న్యాయం చేస్తేనే డాక్టర్ ప్రసిడెంట్‌గా కొనసాగుతారు అని వార్నింగ్ ఇచ్చింది.

    దాంతో మోనిత రాకతో కార్తీక్ కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. అయితే మోనితకు షాకిస్తూ.. డాక్టర్ కార్తీక్ ప్రసిడెంట్‌గా పనికిరారు అని అంది.. కానీ అసలు డాక్టర్‌గా మోనిత పనికిరారు అంటూ దీప స్టేజ్ ఎక్కి బండారం బయటపెట్టినట్టు తాజా ప్రోమోలో స్పష్టమైంది.

    Recommended Video

    Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
    46వ వారం కార్తీకదీపం రేటింగ్

    46వ వారం కార్తీకదీపం రేటింగ్

    ఇదిలా ఉంటే.. కార్తీకదీపం సీరియల్ తన రేటింగ్‌ను నిలకడగా కొనసాగిస్తున్నది. ప్రస్తుత ఏడాదిలో 46వ వారంలో కార్తీకదీపం సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతున్నది. తాజా రేటింగుల ప్రకారం.. అర్బన్ ప్రాంతంలో ఈ సీరియల్ 14.57 రేటింగ్‌తో, రూరల్‌ ప్రాంతంలో 15.90 రేటింగ్‌తో కొనసాగుతున్నది. తెలుగులో ప్రసారమయ్యే అన్ని సీరియల్స్‌లో కార్తీకదీపం సీరియల్ నంబర్ వన్ స్థానంలో ఉంది.

    English summary
    Highest rated Telugu serial Karthika Deepam's November 30th Episode number 1210
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X