Karthika Deepam 2 April 11th: కోపంతో రగిలిపోతున్న శౌర్య.. దీపని ఆ ప్లేస్ లో చూసి షాకైన ఆమె భర్త!
కార్తీక్ ని చూసిన దీప షాక్ అవుతుంది. కార్తీక్ కూడా షాక్ అవుతాడు, తను తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశం అనుకుంటాడు. తను ఎక్కడ దొరికిపోతుందో అని పారిజాతం దీపని బాధపడేలాగా మాట్లాడుతుంది. ఆ మాటలకు బాధపడిన దీప ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటే కార్తీక్ ఆపుతాడు. అయినా వెళ్ళిపోతాను అంటున్న దీపని పండగ వెళ్ళాక చూద్దాం పండుగ ఇక్కడ జరగనివ్వండి అని చెప్తాడు శివ నారాయణ. తప్పక ఒప్పుకుంటుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 11వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 16వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
నువ్వు ఎలాగ మాట్లాడాలో, ఏం మాట్లాడాలో పేపర్ మీద రాసి ఇవ్వు వాటిని ఒకటికి పది సార్లు చదువుకొని అలాగే మాట్లాడతాను అంటుంది శౌర్య. అన్నిటికీ సమాధానం చెప్తావు కానీ నాన్న ఎప్పుడు వస్తాడు అంటే మాత్రం సమాధానం చెప్పవు, పండక్కి నాన్న వస్తాడా అని ఆశగా అడుగుతుంది.

రాడు, పండగ పోయిన తర్వాత మనమే వెళదాము అంటుంది దీప. ఆ మాట విని ఆనందపడుతుంది శౌర్య. పద బట్టలు కొనుక్కోవడానికి వెళ్దాము అని కూతురితో చెప్పి డబ్బులు తీసుకోవడానికి లోపలికి వెళుతుంది. డబ్బులు చూసి బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు సరిపోవేమో అనుకుంటుంది. తనికి బట్టలు కొనుక్కోకుండా దీపకు మాత్రమే బట్టలు కొనాలి అనుకొని కూతుర్ని తీసుకొని స్ట్రీట్ బజార్ కి వెళుతుంది.
అక్కడ ఒక గౌను నచ్చటంతో దాని ఖరీదు 300 అని తెలుసుకొని 200 కి బేరం ఆడుతుంది దీప. అయితే షాపు వాడు అవమానకరంగా మాట్లాడి శౌర్య దగ్గర నుంచి గౌను లాక్కుంటాడు. ఆ మాటలకి కోపంతో రగిలిపోతుంది శౌర్య నీ గౌను నువ్వు తీసుకున్నవు కదా అయినా మా అమ్మని ఎందుకు అలా కోప్పడుతున్నావు అంటూ అతని మీద విసరటానికి రాయి ఎత్తుతుంది.
ఇదంతా వెనకనుంచి చూస్తున్న కార్తీక్ శౌర్య చేయి పట్టుకొని పెద్ద రౌడీ లాగా రాయెత్తుతున్నావేంటి కొట్టదామనే అంటూ ఆమె చేతిలో రాయి తీసుకొని కింద పడేస్తాడు. షాపు వాడితో మర్యాదగా మాట్లాడమని హెచ్చరిస్తాడు. ఇక్కడ వద్దు పదండి వేరే షాప్ కి వెళ్లి బట్టలు కొనుక్కుందాం అంటాడు కార్తీక్. మాకు అంత స్తోమత లేదు మేము ఇక్కడే కొనుక్కుంటాము అంటుంది దీప. ఇక్కడికన్నా అక్కడ బట్టలు బాగా చవక నా మాటలు నమ్మండి అంటాడు కార్తీక్. మాకు ఎవరు సాయం వద్దు అంటుంది దీప.
సాయం చేస్తున్నది నేను కాదు, మా అత్త. తనే మీకోసం నన్ను పంపించింది మీ మంచి కోరుకునే వాళ్లని మీరు బాధ పెట్టకండి అంటాడు కార్తీక్. శౌర్య కూడా వెళ్దాం అనటంతో తప్పక కార్తీక్ కార్ లో బయలుదేరుతారు దీప, శౌర్య. ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు కారు ఆపుతాడు కార్తీక్. షాపుని చూసి ఆశ్చర్యపోతారు దీప, శౌర్య. మమ్మల్ని అవమానించడానికి కాకపోతే మేము ఇక్కడ బట్టలు కొనగలమా, మేము వెళ్ళిపోతాము అంటుంది దీప.

చూడటానికే షాప్ ఇలా ఉంటుంది కానీ లోపల బట్టలు చాలా చవక అని వాళ్ళని మభ్యపెట్టి లోపలికి తీసుకు వెళ్తాడు కార్తీక్. షాపు మా ఊరంతా ఉంది అని కార్తీక్ తో చెప్తుంది శౌర్య. అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చూసి మన ఊరి అమ్మవారు మన కోసం హైదరాబాద్ వచ్చింది అని దండం పెట్టుకుంటుంది. శౌర్య అమాయకత్వానికి నవ్వుకుంటాడు కార్తీక్.
ఆ ఊరి దేవత వేరు, ఈ ఊరి దేవత వేరు అని వివరిస్తుంది దీప ఇంతలో షాపు వాడు ఏం కావాలి అని అనడంతో కిడ్స్ వేర్ కావాలి అంటాడు కార్తీక్. కిడ్స్ కౌంటర్ చూపిస్తాడు షాప్ అతను.దీప కార్తీక్ తో మీరు మాతో రావద్దు, మా రేంజ్ బట్టలు మేము కొనుక్కుంటాము అని కూతురు తీసుకొని కిడ్స్ కౌంటర్ కి వెళుతుంది. అప్పుడు కార్తీక్ షాప్ అతని నెంబర్ తీసుకొని వాళ్లు ఏ బట్టలు కావాలనుకుంటే అవే 90% డిస్కౌంట్ అని చెప్పండి.
రిమైనింగ్ బిల్ నాకు పంపిస్తే నేను పే చేస్తాను అని చెప్పడంతో గౌను 2000 అని వెనకాడుతున్న దీపతో ఇది 90% డిస్కౌంట్ అండి 200 వస్తుంది అని చెప్పి శౌర్యతో ఆ ఫ్రాక్ కొనిపిస్తాడు. కార్తీక్ సౌజ్ఞ చేయడంతో చీరలు కూడా చాలా తక్కువ ధరకు వస్తాయి అని చెప్పి చీర కూడా కొనిపిస్తాడు షాప్ అతను. ఆ తర్వాత శౌర్య తనని సార్ అనే పిలుస్తుంటే తనని పేరు పెట్టి పిలవమని చెప్తాడు కార్తీక్. అందుకు ఒప్పుకుంటుంది శౌర్య.
ఆనందంగా కార్తీక్, శౌర్య బోత్ ఆర్ ఫ్రెండ్స్ అనుకుంటారు. నవ్వుకుంటూ వాళ్ళు షాప్ నుంచి బయటకు వస్తుంటే దీప భర్త చూస్తాడు. ఇది ఇంకా ఊరు వెళ్లి పోలేదా అయినా అతని కారులో వెళ్తుందేంటి అని అనుమానం పడతాడు. విషయం కనుక్కుందామని బయటకు వచ్చేటప్పటికి దీప కార్లో వెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











