Karthika Deepam 2 April 9th: దీపని ఇంట్లోంచి పంపించే ప్రయత్నంలో పారిజాతం.. బాధ్యత తన భుజాల మీద వేసుకున్న సుమిత

సుమిత్రను గుర్తు తెలియని వ్యక్తి ఎటాక్ చేయడంతో దీప కాపాడుతుంది. ఆ సమయంలో దీప తలకు గాయం అవ్వడంతో హాస్పిటల్‌లో చేర్పించారు. తనకు జరిగిన గాయానికి చికిత్స చేసిన తర్వాత సుమిత్ర తమ ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ కార్తీక్ ని చూసిన దీప షాక్ అవుతుంది. కార్తీక్ కూడా షాక్ అవుతాడు, తను తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశం అనుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 9వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 14వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

కూతుర్ని పడుకోమని చెప్పి దీప వాటర్ తాగటానికి వేరే గదికి వస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన పారిజాతం ఒంట్లో ఎలా ఉంది అని అడుగుతుంది. కొంచెం నొప్పిగా ఉంది అని చెప్తుంది దీప. అప్పుడు పారిజాతం మాట్లాడుతూ నువ్వు ఈ ఊరు ఎందుకు వచ్చావు, మాలాంటి గొప్ప వాళ్ళ ఇళ్ళల్లో పనిచేయటానికా,అయినా ఇక్కడే ఉండి పోయావంటే నీకు ఆత్మ అభిమానమైన లేకపోయి ఉండాలి

లేదంటే భర్త వదిలేసినవాడైనా అయి ఉండాలి. నిన్ను చూస్తే ఆత్మ అభిమానం ఉన్నదాని లాగే ఉన్నావు, నీ భర్త నిన్ను వదిలేసాడా అని అడుగుతుంది. దీప మాట్లాడుతూ నేను ఏ పరిస్థితులలో ఎక్కడ ఉన్నాను మీకు కూడా తెలుసు కదా మీరు అలా మాట్లాడకండి నా కూతురు వింటే బాధపడుతుంది అంటుంది దీప. దీపని మాటల్లో పెట్టి నువ్వు సుమిత్రని గాయపరిచిన వాడిని చూసావా అని అడుగుతుంది. ఇప్పుడు గుర్తు రావటం లేదు కానీ చూస్తే గుర్తుపట్టగలనేమో అంటుంది దీప.

ఇక్కడ ఉండటం ఉండకపోవటము నీ విజ్ఞత మీదే ఆధారపడి ఉంది సరే పడుకో అని చెప్పి వెళ్ళిపోతుంది పారిజాతం. పడుకోనిచ్చే మాటలు మాట్లాడారా అనుకుంటుంది దీప. మరోవైపు ఇంట్లో ఏవో ఫైల్స్ మర్చిపోయానని తీసుకురావడానికి బయలుదేరుతాడు కార్తీక్. కారు తీస్తూ ఉంటే ఒక చేతితో బ్యాగ్ ని మరొక చేత్తో కూతుర్ని పట్టుకొని ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతున్న దీప కనిపిస్తుంది. పరుగున ఆమె దగ్గరికి వెళ్లి ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు, మీరు ఎక్కడికి వెళ్తారు చెప్తే నేను డ్రాప్ చేస్తాను.

అయినా అత్తకి చెప్పకుండా ఎందుకు వెళ్తున్నారు అత్తకి చెప్పి వెళ్ళండి అని చెప్తాడు. ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు అంటుంది దీప. అయినా కార్తీక్ ఊరుకోడు, అత్తకి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళటానికి వీలు లేదు అంటాడు. సౌర్య కూడా నాకు నిద్ర వస్తుందమ్మా అని చెప్పడంతో ఏమి చేయలేక మళ్లీ వెనక్కి వెళ్ళిపోతుంది దీప. తర్వాత పొద్దున్నే ఆడుకుంటూ పూలను చూసిన శౌర్య కోయబోతుంది, మళ్ళీ ఎక్కడ గొడవ అవుతుందో అని ఆగిపోతుంది.

Big Twist in Karthika Deepam season 2 Episode Number 14 April 9th 2024

ఇంతలోనే అక్కడికి వచ్చిన పారిజాతం ఈ పిల్ల ఇక్కడ ఉంది అంటే దీప ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళినట్లుగా లేదు అనుకుంటుంది. తర్వాత పువ్వులు చూస్తున్న సౌర్య మీద కేకలు వేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ పారిజాతాన్ని మందలించి నీకు ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వులు కోసుకో అని సౌర్యతో చెప్తాడు. కానీ సౌర్య మాత్రం ఈ ఊర్లో పువ్వులు కోస్తే ఇలా గొడవ పెట్టుకుంటున్నారు ఏంటి, నాకు ఈ ఊరు నచ్చలేదు ఇప్పుడే అమ్మమ్మకు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని చెప్పి సుమిత్ర దగ్గరికి వెళ్తుంది సౌర్య.

ఇది ఏం చెప్తుందో ఏంటో అని కంగారు పడుతూ పారిజాతం కూడా వెనకే వెళుతుంది. సౌర్య జరిగిందంతా సుమిత్రికి చెప్పటంతో సుమిత్ర పారిజాతం మీద కేకలు వేస్తుంది. వాళ్లు నా కోసం వచ్చారు మీకేమైనా అభ్యంతరం ఉంటే నాతో మాట్లాడండి వాళ్లతో కాదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. నా పెద్దరికం ని తుంగలో తొక్కేసింది అని కోడల్ని తిట్టుకుంటుంది పారిజాతం.

Big Twist in Karthika Deepam season 2 Episode Number 14 April 9th 2024

ఇంతలోనే బంటు పోలీసులు వచ్చారని చెప్పటంతో కంగారుగా బయటకు వస్తుంది పారిజాతం. అప్పుడే ఎస్ఐ కొంతమంది రౌడీలను చూపించి ఇందులో సుమిత్ర గారిని అటాక్ చేసినవాడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. ఎవరు లేరు అని చెప్తుంది దీప. బంటుని గుర్తుపట్టలేనందుకు ఆనందపడతారు పారిజాతం, బంటు. ఎస్సై రౌడీలను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది దీప.

నువ్వు ఐ విట్నెస్ కాబట్టి ఈ కేసుకి చాలా అవసరం. నీకు అంత అర్జెంట్ పని ఉంది అంటే నాకు ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చి వెళ్ళు అంటుంది. అప్పుడు సుమిత్ర మాట్లాడుతూ అంత అవసరం లేదు తన బాధ్యత నాది, తను ఇక్కడే ఉంటుంది మీరు వెళ్ళండి అని చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X