Karthika Deepam 2 April 10th: దీప ప్రయాణానికి సుమిత్ర గ్రీన్ సిగ్నల్ .. బ్రేకులు వేసిన శివ నారాయణ!
తలకు తగిలిన గాయానికి చికిత్స చేసిన తర్వాత సుమిత్ర దీప ని శౌర్యని తమ ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ కార్తీక్ ని చూసిన దీప షాక్ అవుతుంది. కార్తీక్ కూడా షాక్ అవుతాడు, తను తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశం అనుకుంటాడు. తను ఎక్కడ దొరికిపోతుందో అని పారిజాతం దీపని బాధపడేలాగా మాట్లాడుతుంది. ఆ మాటలకు బాధపడిన దీప ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటే కార్తీక్ ఆపుతాడు.ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 10వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 15వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
దీప రెస్పాన్సిబిలిటీ నాది మీరు వెళ్ళండి అని చెప్పి పోలీసులని పంపించేస్తుంది సుమిత్ర. తర్వాత దీపతో మాట్లాడుతూ ఇప్పుడు ఎక్కడికని వెళ్తావు అని అడుగుతుంది. వెళ్లాలమ్మ, ఇక్కడైతే మాత్రం ఉండలేను అంటుంది దీప. నువ్వు వెళ్లిపోవడానికి కారణం నేను అని తెలుసు కానీ ప్రతిసారి ఆపలేను కదా అనుకుంటాడు కార్తీక్. నువ్వు ఇలా చెప్తే వినవు అని సుమిత్ర కార్తీక్ తో శౌర్య ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళు అని చెప్తుంది.

శౌర్య వద్దంటున్నా వినిపించుకోకుండా బలవంతంగా ఇంట్లోకి తీసుకువెళ్లిపోతాడు కార్తీక్. అప్పుడు సుమిత్ర దీపని తీసుకొని వెళ్లి పక్కన కూర్చోబెట్టి నీకు వచ్చిన కష్టం ఏమిటి చెప్పు నేను తీరుస్తాను, ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు, నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతుంది. నన్ను ఎవరు ఏమీ అనలేదు కానీ నేను ఇక్కడ ఉండలేను, నా మీద చూపిస్తున్న ప్రేమకి, అభిమానానికి కృతజ్ఞతలు అయినా నేనంటే ఎందుకు అంత ప్రేమ అని అడుగుతుంది దీప.
అది ఆ దేవుడిని నువ్వే అడుగు, నువ్వు నాకు సాయం చేశావు అని ఉద్దేశంతో నేను ఇలా మాట్లాడటం లేదు కానీ నువ్వు దెబ్బ తగిలి అమ్మ అని పిలిచినప్పుడు నా కడుపులో కన్న పేగు కదిలింది ఆ అభిమానంతోనే చెప్తున్నాను ఇక్కడే ఉండు నీ కష్టాన్ని తీర్చే బాధ్యత నాది నీకోసం ఏమైనా చేస్తాను అంటుంది సుమిత్ర. అలా అయితే నన్ను బయటకు వెళ్ళనివ్వండి అని అంటుంది. ఇక చేసేదేమీ లేక సుమిత్ర ఆమె ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

కానీ నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఈ ఇంటి గుమ్మం ముందుకు వస్తే నీకోసం ఈ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అది గుర్తుంచుకో అని చెప్తుంది. వెళ్లే ముందు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి వెళ్ళు అని దీపకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మా నాన్నని చంపిన వాడు నా కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే మా నాన్న శవాన్ని గుండెల మీద పెట్టుకున్నంత భారంగా ఉంది అని మనసులోనే బాధపడుతుంది దీప. ఇంట్లోంచి బయలుదేరుతు ఇంట్లో వాళ్ళందరికీ వెళ్లి వస్తాను అని చెప్తుంది దీప.
మరొకసారి చెప్తున్నాను ఆలోచించు అంటుంది సుమిత్ర. అయినా వెళ్తాను అని మొండికేస్తున్న దీపతో సరే ఎక్కడికి వెళ్తావో చెప్పు మేము డ్రాప్ చేస్తాం అంటుంది. అక్కడ నుంచి అయినా నేనే వెళ్లాలి కదా వద్దులేండి అమ్మ ఇక్కడి నుంచే వెళ్తాను అంటుంది దీప. తను బయలుదేరుతున్నందుకు ఆనందపడుతుంది పారిజాతం. తను వెళ్ళిపోతే నిజాన్ని చెప్పుకునే అవకాశం ఉండదు అని బాధపడతాడు కార్తీక్.
ఇంతలోనే శివ నారాయణ వచ్చి ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం, మా ఇంటి మహాలక్ష్మి కాపాడిన నీకు ఏమి చేయకుండానే ఇంట్లోంచి పంపించేస్తానా, రేపు ఉగాది పండుగ కదా అందరం కలిసి పండగ చేసుకుని ఆ తర్వాత నీ ప్రయాణం సంగతి ఆలోచిద్దాం అంటాడు శివ నారాయణ. ఉండటానికి బట్టలు లేవు అంటుంది శౌర్య. శౌర్యకి,దీపకీ బట్టలు తీసుకోమని కార్తీక్ కి చెప్తాడు శివ నారాయణ.



Click it and Unblock the Notifications











