Karthika Deepam రుద్రాణి చెంప పగలకొట్టి.. పవర్‌ఫుల్ ట్విస్టుతో సౌందర్య ఎంట్రీ!

కార్తీకదీపం సీరియల్‌‌లో మరోసారి హైడ్రామా కొనసాగుతున్నది. కార్తీక్, దీపను వెతుక్కొంటూ వచ్చిన మోనితకు డాక్టర్ బాబు కనిపించాడు. అయితే తనకు కార్తీక్ కనిపించారని చెబితే మోనిత మాటలను డాక్టర్ భారతీ కొట్టిపడేసింది. అయితే డాక్టర్ భారతీ కూతురు బర్త్ డే ఫంక్షన్‌లో మోనితకు కార్తీక్ చిక్కినట్టే చిక్కి తప్పించుకుపోయాడు. తాజా ఎపిసోడ్‌ 1270 ఇంకా ఏం జరిగిందంటే..

కార్తీక్ ఆచూకి గురించి మోనిత

కార్తీక్ ఆచూకి గురించి మోనిత

ఓ వైపు డాక్టర్ అంజలి కూతురు బర్త్ డే జరుగుతుండగా.. కార్తీక్ గురించి మోనిత ఆలోచిస్తూనే ఉంది. భారతీని పలు రకాల ప్రశ్నలతో విసిగిస్తుండగా గమనించిన అంజలి.. మీ ఇద్దరికి ఏదైనా ప్రాబ్లెమా అని అడిగింది. దాంతో ఏమీ లేదు అంటూ భారతీ సమాధానం ఇచ్చింది. నాకు కార్తీక్‌కు చిన్న గొడవ జరిగింది. అందుకే నాకు దూరంగా ఉంటున్నాడు.

ఇక్కడే ఉన్నాడు కాబట్టి.. నేను కార్తీక్‌తో మాట్లాడి.. సమస్యను పరిష్కరించుకొంటాను అని మోనిత చెప్పింది. ఇంతకు మీ హాస్పిటల్‌లో సర్జరీ జరిగిన చిన్నపాపకు తల్లిదండ్రులు ఎవరు అని అడిగితే.. నీకు కేక్ ఇచ్చిన వ్యక్తే అంటూ అంజలి సమాధానం చెప్పింది. దాంతో ముసుగులో ఉన్న కార్తీక్‌ను వెతికేందుకు మోనిత పరుగులు పెట్టింది.

మోనితను చూసి జారుకొన్న కార్తీక్, దీప

మోనితను చూసి జారుకొన్న కార్తీక్, దీప

వంటలు వండిన ప్రదేశానికి వెళ్లిన మోనిత.. కార్తీక్ గురించి అడిగితే.. ఇద్దరు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిపోయారు అని పని మనుషులు చెప్పగానే.. అటు ఇటూ చూసి వెతికింది. ఏంటి వాళ్లు భోజనం చేయకుండానే వెళ్లిపోయారా? అంటూ అంజలి బాధపడింది. మోనిత తమ వెంటపడుతున్నారని తెలుసుకొన్న కార్తీక్, దీప అక్కడి నుంచి జారుకొన్నారు. తమను మోనిత వదిలిపెట్టేలా కనిపించడం లేదు.. ఏం చేద్దాం అని అంటే.. ఇక్కడి నుంచి వెళ్లిపోదామని కార్తీక్ చెప్పాడు. అయితే రుద్రాణి అప్పు తీర్చకుండా ఎలా వెళ్లిపోతాం అని దీప సందేహాన్ని వ్యక్తం చేసింది.

రుద్రాణి.. నా బిడ్డ ఎక్కడ అంటూ

రుద్రాణి.. నా బిడ్డ ఎక్కడ అంటూ

ఇలాంటి పరిస్థితుల్లో హిమను రుద్రాణి మనుషులు తీసుకెళ్లారనే విషయం కార్తీక్, దీపకు తెలిసింది. హిమను బలవంతంగా ఎత్తుకెళ్లారని చెప్పగానే.. ఇద్దరు షాక్ గురయ్యారు. హిమను తీసుకురండి అంటూ శౌర్య ఏడుస్తూ కనిపించింది. ఇదిలా ఉండగా, అప్పరావు ఇంటిలో నుంచి హిమను తీసుకొచ్చిన రుద్రాణి మరో ప్లాన్ వేసింది. హిమ కావాలంటే.. డబ్బు చెల్లించు.

లేకపోతే నేను నెలరోజుల వరకు నీకు కనిపించను అని బెదిరిస్తాను అని రుద్రాణి ప్లాన్ చెప్పింది. అంతలోనే కార్తీక్, దీప వచ్చి.. నా బిడ్డ ఎక్కడ అంటూ అరిచాడు. రుద్రాణి నా బిడ్డను ఎక్కడ దాచావు అంటూ నిలదీశాడు. నా బిడ్డను ఎక్కడ దాచావో చెప్పు.. అంటే.. మాటలు లేవు.. మాట్లాడుకోవడం లేదు. ముందు డబ్బు ఇచ్చి బిడ్డను తీసుకెళ్లు అంటూ కార్తీక్‌ను రుద్రాణి హెచ్చరించింది.

సౌందర్య పవర్‌ఫుల్ ఎంట్రీ

సౌందర్య పవర్‌ఫుల్ ఎంట్రీ

అయితే రుద్రాణి ఇంట్లోకి వెళ్లి కార్తీక్, దీప వెతకడం ప్రారంభించారు. అయితే నేను ఊరు వెళ్లిపోతున్నాను. రెండు నెలల వరకు మళ్లీ రాను. మీకు ఎక్కువ సమయం ఉంది. డబ్బు ఏర్పాటు చేసుకొని బిడ్డను అప్పుడు తీసుకొని వెళ్లు అని రుద్రాణి బెదిరించింది.

దాంతో మీ కాళ్లు పట్టుకొంటాను అంటూ దీప కింద కూర్చొని ప్రాధేయపడుతుంటే.. ఓ చేయి తన భుజంపై పడింది. తీరా చూస్తే తన అత్తయ్య సౌందర్య కనిపించింది. దాంతో ఏంటి నీవు కూడా నా కాళ్లు పట్టుకొనేందుకు వచ్చావా అంటూ సౌందర్యను రుద్రాణి ఎగతాళి చేసింది. దాంతో రుద్రాణి చెంపను సౌందర్య చెళ్లుమనిపించింది.

Recommended Video

Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
వందల మంది చేతులెత్తి మొక్కుతారు అంటూ

వందల మంది చేతులెత్తి మొక్కుతారు అంటూ

దీపను చూస్తూ.. ఏంటే.. ఏం జరుగుతున్నదే అంటే.. ఈమె నీకు తెలుసా? అని రుద్రాణి అంటే.. దీప నా పెద్ద కోడలు అని సౌందర్య చెప్పింది. దాంతో ఈయన నీకు తెలుసా అంటూ కార్తీక్‌ను చూస్తూ రుద్రాణి అంటే.. ఈయనేంటే? కార్తీక్ నా పెద్ద కొడుకు. డాక్టర్ కార్తీక్.. ది గ్రేట్ కార్డియాలజిస్టు. కార్తీక్ వందల మందికి గుండె ఆపరేషన్ చేశాడు. కార్తీక్ పేరు చెబితే వందల మంది చేతులెత్తి మొక్కుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X