twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam మోనితకు చెక్ పెట్టేందుకు వంటలక్క ప్లాన్.. కార్తీక్‌ను అలా వదిలేసి వెళ్లడంతో..!

    |

    ఆయుర్వేద మందుతో కార్తీక్‌కు గతం గుర్తొచ్చేలా చేయడానికి దీప ప్రకృతి చిక్సిత్సాలయానికి వెళ్లిందని చిక్ మంగళూరు డాక్టర్ తన తల్లితో చెబుతుండగా... వంటలక్క అక్కడికి వస్తూ కనిపించింది. ఏంటిరా దీప.. మందులు తీసుకు రావడానికి వెళ్లిందని చెప్పావు? కానీ ఆమె ఇలా వెనక్కి వచ్చిందేమిటని డాక్టర్ తల్లి అడిగింది. అంతలోనే దీప అక్కడికి వచ్చి.. సంజీవిని ప్రకృతి చికిత్సాలయం లేదు.

    ఆటో డ్రైవర్‌ను అడిగితే అలాంటి అడ్రస్ లేదని చెప్పాడు. నన్ను బోల్తాకొట్టించేందకు మోనిత ఆడుతున్న నాటకంలా ఉంది అని దీప చెప్పింది. అయితే నాకు ఏదో అనుమానం ఉంది. నిన్ను దూరంగా పంపించి.. కార్తీక్‌ను వేరే చోటికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నదని దీప అంటే.. అలాంటిదేమీ లేదు. వేరే ఏదో ప్లాన్ మోనిత వేసిందని డాక్టర్ చెప్పాడు. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్‌ 1460 లో ఇంకా ఏం జరిగిందంటే?

    శివకు వార్నింగ్ ఇచ్చిన మోనిత

    శివకు వార్నింగ్ ఇచ్చిన మోనిత

    శివ.. శివ అంటూ పిలిచిన మోనిత.. అతడు రాగానే.. నేను బయలుదేరుతున్నాను. రేపటి వరకు వస్తాను. అప్పటి వరకు కార్తీక్‌ను జాగ్రత్తగా చూసుకో. వంటలక్క చూపు కార్తీక్‌పైన పడకుండా చూసుకో అని మోనిత చెప్పింది. వంటలక్క కూడా ఊర్లో లేదు అని చెప్పింది. యితే ఏంటి మేడమ్.. సారును వదిలి ఒక్క క్షణం కూడా ఉండరు.

    ఇలా వదిలేసి ఎలా వెళ్తున్నారు. కావాలంటే మీతో కార్తీక్‌ను తీసుకెళ్లగలరు. కానీ ఎందుకు తీసుకెళ్లడం లేదు అని శివ అడిగితే.. చెప్తా.. చెప్తా.. అంటూ ఫోన్ చేసి.. శివ జాబ్ మానేస్తున్నాడు. వెంటనే ఎవరైనా ఉంటూ పంపించు అని మోనిత అంది. దాంతో ఇంకోసారి ప్రశ్నలు వేయను అంటూ శివ ప్రాధేయపడ్డాడు. దాంతో బుద్దిగా ఉండు అంటూ మోనిత వార్నింగ్ ఇచ్చింది.

    మా అమ్మను దేవుడు తీసుకెళ్లలేదు

    మా అమ్మను దేవుడు తీసుకెళ్లలేదు

    ఇక ఇంద్రుడు ఇంటికి చాలా సామాన్లు తీసుకు రావడంతో ఏంటి ఇన్ని ఎందుకు తెచ్చావు బాబాయ్ అంటూ శౌర్య అడిగింది. అయితే పక్క ఇంటి వాళ్లకు వంట చేయడానికి తెప్పించాను. వారికి వంట చేసి పెడితే కొన్ని డబ్బులు ఇస్తానని చెప్పారు. మనం డబ్బులు డిమాండ్ చేయడం లేదు అని చంద్రమ్మ చెప్పింది. దాంతో మా అమ్మ కూడా వంట చేసినా డబ్బులు ఎంత ఇస్తే అంత తీసుకొనేది అని శౌర్య అంటే.. మంచి వాళ్లను దేవుడు తీసుకెళ్తాడు అని చంద్రమ్మ అనగానే.. అలా అనకు. మా అమ్మను దేవుడు తీసుకెళ్లలేదని శౌర్య ఆగ్రహం వ్యక్తం చేసింది.

    ఆస్తిని మీరే ఉంచుకోండి అంటూ మోనిత

    ఆస్తిని మీరే ఉంచుకోండి అంటూ మోనిత

    చిక్ మంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మోనిత.. తన కొడుకును తీసుకెళ్లడానికి సిద్దమైంది. దాంతో లక్ష్మణ్ దంపతులు.. ఏంటి మేము పెంచాం. ఆనంద్‌ను విడిచి మేము ఉండలేం అని లక్ష్మణ్ చెబితే.. కొన్ని రోజులు నాతో ఉంచుకొంటాను. ఆ తర్వాత మీకే ఆనంద్‌ను ఇచ్చేస్తాను. నేను బాబును తీసుకెళ్తున్నానని ఆస్తిని వెనుకకు తీసుకొంటానని అనుకోకండి అని మోనిత అంటే.. బాబే లేకపోతే.. ఆస్తి ఎందుకు? మీరే ఆస్తిని తీసుకొండి అని లక్ష్మణ్ దంపతులు అన్నారు. రేపు ఏం జరుగుతుందో చెప్పలేం. బాబును మళ్లీ తిరిగి ఇచ్చే అవకాశం రావొచ్చు. కాబట్టి ఆస్తిని మీ వద్దే ఉంచుకోండి అంటూ మోనిత చెప్పింది. దాంతో బంధాలు, అనుబంధాలు ఇంత గొప్పగా ఉంటాయా అని ఆలోచనల్లో పడింది.

    ఆనంద్ కోసం సౌందర్య, హిమ

    ఆనంద్ కోసం సౌందర్య, హిమ

    మోనిత బాబును తీసుకెళ్లగానే.. సౌందర్య దంపతులు కారులో లక్ష్మణ్ ఇంటికి వచ్చారు. నా మనవడు ఎక్కడ అంటే.. మోనిత ఇప్పుడే వచ్చి బాబును మోనిత తీసుకెళ్లింది. బాబు మీ వద్ద ఉన్నట్టు మాకు ఎందుకు చెప్పలేదు అని సౌందర్య అంటే.. మోనిత చెప్పవద్దని చెప్పారు. ఎప్పుడైనా బాబును చూడాలనిపిస్తే.. బాబును మీ వద్దకు తీసుకొచ్చి నేను చూపిస్తానని చెప్పింది. మోనిత మంచిదమ్మా.. బాబును చూసుకోవడానికి ఆస్తి మొత్తం మాకే ఇచ్చింది. తిరిగి బాబును తీసుకెళ్లినా ఆస్తిని వెనుకకు తీసుకెళ్లలేదు అని లక్ష్మణ్ భార్య చెప్పింది. అయితే మళ్లీ బాబును వెనక్కి తెచ్చి ఇస్తే మాకు చెప్పండి అంటూ సౌందర్య ఫ్యామిలీ వెళ్లిపోయింది.

    మోనిత ఊరెళ్లిందని చెప్పడంతో దీప ప్లాన్

    మోనిత ఊరెళ్లిందని చెప్పడంతో దీప ప్లాన్

    మోనిత ఇంటిలోకి వెళ్లి.. ఎవరూ కనిపించడం లేదు. డాక్టర్ బాబును ఎక్కడికైనా తీసుకెళ్లిందా? అంటూ చూస్తుంది. ఇంట్లో పాటలు పాడుకొంటూ కార్తీక్ ఆనందంగా కనిపించాడు. అయితే కార్తీక్‌ను శివ చూసి.. మేడమ్ ఊరెళ్లిందని హ్యాపీగా ఉన్నారా అంటే.. కార్తీక్ లాగి చెంపపై కొట్టాడు. మేడమ్ లేకుంటే నేను హ్యాపీగా ఉన్నానని చెప్పినా అని శివకు వార్నింగ్ ఇచ్చాడు. అంతలోనే వంటలక్క రావడంతో.. శివ ఇంట్లో ఎవరు లేరు అని అబద్దం ఆడాడు. అంతలోనే కార్తీక్ పాట పడుకొంటూ కనిపించాడు. దాంతో కార్తీక్ ఉన్నాడు కదా అంటే. మోనిత ఎవరూ లేరని చెప్పమని చెప్పింది. నాలుగు రోజుల వరకు మేడమ్ రాదు అని చెప్పడంతో దీపకు మోనిత ప్లాన్ అర్ధమైంది. నన్ను రెచ్చగొట్టావు కదా.. నీ సంగతి చూస్తా అని దీప ప్లాన్ వేసుకొన్నది.

    English summary
    Karthika Deepam 17th September Episode number 1460.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X