twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam కార్తీక్‌కు గతం గుర్తుకు రాదు.. మోనిత సవాల్‌కు దీప జవాబు ఏమిటంటే?

    |

    మోనిత ఇంట్లో లేని సమయంలో కార్తీక్, శివ ఇద్దరు మందు పార్టీ చేసుకోవడం, ఆ మత్తులో డాక్టర్ బాబు నిద్రలోకి జారుకొంటే దీప తగిన జాగ్రత్తలు తీసుకొన్నది. ఉదయం లేవగానే.. నిద్ర బాగా పట్టిందా అని దీప అడిగితే.. తల అంతా పట్టేసినట్టు ఉంది అని కార్తీక్ చెప్పాడు. దాంతో ఈ కాఫీ తాగండి.. అంతా సెట్ అవుతుంది అని దీప చెప్పింది. అంతలోనే మోనిత బిడ్డను చంకలో పెట్టుకొని వచ్చి.. కాఫీ కప్పును చేతితో పక్కకు నెట్టింది. మోనిత చంకలో ఆనంద్‌ను చూసి దీప షాక్‌కు గురై.. ఓహో.. బాబును తీసుకు రావడానికి వెళ్లిందా? అని మనసులో అనుకొన్నది.

    అయితే మా ఇంటి మీద నీ నీడ పడకూడదని చెప్పానుగా.. మళ్లీ ఎందుకు వచ్చావు అని మోనిత కోపగించుకొంటే.. వచ్చి రాగానే ఎందుకు అలా కోపంతో ఊగిపోతున్నావు అని కార్తీక్ అన్నాడు. ఇంతకీ ఆ బాబు ఎవరు? అంటే.. చెప్పనుగా మన బాబు తీసుకు రావడానికి వెళ్తున్నానని.. అది కూడా మరిచిపోతావా? అని మోనిత అంటే.. అవసరమైనవి గుర్తుంచుకోకుండా.. అవసరం లేనివి గుర్తు పెట్టుకోవాలంటే కుదరదు మోనిత అని దీప సమాధానం ఇచ్చింది. కార్తీకదీపం సీరియల్‌లో 1462 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

    బాబును కార్తీక్ ఎత్తుకోగానే..

    బాబును కార్తీక్ ఎత్తుకోగానే..

    దీప మాటలకు అడ్డుపడుతూ.. నేను మా ఇంటికి రావొద్దని చెప్పానుగా. ఊరికి వెళ్తానని చెప్పవుగా.. రెండు రోజులు ఊర్లో ఉండవని చెప్పావుగా అని మోనిత అంటే.. అది నేను ఊర్లో ఉండకుండా వేసిన ప్లాన్ డాక్టరమ్మ. ప్లాన్ వేస్తే వంటలక్క వేయాలి.. కానీ వంటలక్క మీదే ప్లాన్ అంటే.. వర్కవుట్ కాదు అని దీప అంటే.. నిన్ను ఊరిలో నుంచి లేకుండా చేయాలని ఎవరు ప్లాన్ చేశారు అని కార్తీక్ అడిగితే.. అది తర్వాత చెబుతాను అని దీప సమాధానం చెప్పింది.

    అయితే నువ్వు బాబును తీసుకు రావడానికి వెళ్లావా? డాక్టరమ్మ.. బాబు ముద్దొస్తున్నాడు అని దీప అడిగితే.. వెనక్కి లాగేసుకొన్నది. బాబును అడిగితే..లాగేసుకోవాలా అని కార్తీక్ అన్నాడు. బాబు గుక్క పెట్టి ఏడుస్తుంటే.. మీరు ఎత్తుకొంటే బాబు ఏడుపు ఆపేస్తాడు అని దీప చెప్పడంతో కార్తీక్ తీసుకొన్నాడు. దాంతో బాబు ఏడుపు మానేశాడు. దాంతో నువ్వు చెప్పినట్టే...ఏడుపు మానేశాడని కార్తీక్ అన్నాడు.

    తండ్రి స్పర్శతోనే బిడ్డ..

    తండ్రి స్పర్శతోనే బిడ్డ..

    అయితే బాబును చూస్తే గుర్తుకు వస్తున్నాడా అని దీప అంటే.. కార్తీక్ ఆలోచనల్లో పడ్డాడు. దాంతో నా బిడ్డ ఆయన చేతుల్లోకి వెళ్లాడు. బిడ్డలు స్పర్శతోనే తల్లిదండ్రులను గుర్తు పడుతారు. నా బిడ్డ ఆయన తండ్రిని స్పర్శతోనే గుర్తు పట్టాడు అని మోనిత చెప్పింది. బిడ్డను గుర్తు చేసుకోవడానికి జాపకాలతో పనేండి? అని కార్తీక్ అన్నాడు.

    దాంతో మీ కోసమే ఈ బిడ్డను తీసుకొచ్చాను అని అంటే.. అవునా.. నా కోసం కలకత్తా నుంచి తెచ్చావా అని కార్తీక్ అంటే.. కలకత్తా కాదు. చెన్నై నుంచి అని శివ అంటే.. అరేయ్.. నువ్వు ఆపరా.. ఎక్కడి నుంచి అయితే ఏంటి? నా బిడ్డ తండ్రి వద్దకు వచ్చాడు అని మోనిత చెప్పింది. అయితే తాను వేసిన ప్లాన్ బెడిసికొట్టిందని దీప కంగారు పడింది.

    దీప ఇంటికి డాక్టర్ బాబు

    దీప ఇంటికి డాక్టర్ బాబు

    తన చుట్టు జరుగుతున్న విషయాలను ఆలోచించుకొంటూ కూరగాయలు కోస్తూ ఉంది. అయితే తన అత్త, మామ హైదరాబాద్‌కు వచ్చారా? వారి కోసం వెళ్లి వద్దామంటే.. డాక్టర్ బాబును మోనిత తీసుకొని ఎక్కడ మకాం ఎత్తేస్తుందనే భయం ఉంది అని అనుకొంటూ కత్తితో వేలిని కోసుకొన్నది. అంతలోనే కార్తీక్ అక్కడికి వచ్చి.. ఏం ఆలోచిస్తూ వేలు కోసుకొన్నావు అని అంటే.. ఏం కాదులే.. ఇది చిన్న గాయం తగ్గిపోతుంది అని దీప సమాధానం ఇచ్చింది.

    అయితే మీరు ఎందుకు వచ్చారని దీప అడిగితే.. కాఫీ ఇస్తుంటే.. మోనిత చేతితో నెట్టిసింది. అందుకే సారీ చెబుదామని వచ్చాను అని కార్తీక్ అన్నాడు. దాంతో మీరు కాఫీ తాగారో లేదో.. నేను కాఫీ తెస్తాను అని దీప వెళ్లింది.

    డాక్టర్ బాబు మీది హైదరాబాద్ అంటూ

    డాక్టర్ బాబు మీది హైదరాబాద్ అంటూ

    కార్తీక్‌కు కాఫీ ఇస్తూ. డాక్టర్ బాబు మీది ఏ ఊరు అని అంటే.. నాకు గుర్తుకు లేదు మోనిత అంటే.. నా పేరు మోనిత కాదు. దీప అని చెప్పింది. దాంతో అవును మీ పేరు దీప కదా.. అయినా నేను మీకు తెలుసా అని కార్తీక్ అడిగితే.. నా భర్తను నా ఎదుటే కూర్చొబెట్టుకొని.. పరాయిదానిలా ఉన్నాను అని దీప కంటతడి పెట్టుకొన్నది. దురదృష్టం నీది కాదు.. నాది. నరకం అనుభవిస్తున్నాను.

    మీ ఊరు హైదరాబాద్ అని దీప చెప్పింది. అయితే మాది హైదరాబాద్ అయితే మోనిత వేరే ఊరు అని చెప్పింది. నాకు అమ్మా, నాన్న ఉన్నారా అని కార్తీక్ అడిగితే.. ఉన్నారు.. తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారు.. మీరు యాక్సిడెంట్ గురై ఇక్కడ ఉన్నారు అని చెప్పగానే.. ఆలోచిస్తూ తల పట్టుకొని కుర్చీలో పడిపోయాడు.

    ఆనంద్ పేరు ఎక్కడో ఉన్నానంటూ..

    ఆనంద్ పేరు ఎక్కడో ఉన్నానంటూ..

    అంతలోనే మోనిత పరుగున వచ్చి.. ఏమైంది.. దీప నీవు ఏ మందు పెట్టావు అని కార్తీక్ ముఖంపై నీళ్లు చల్లింది. దాంతో లేచి.. ఒక రకంగా దీపను చూస్తూ ఉండిపోయాడు. దాంతో దీప ఏం చేసింది.. కార్తీక్‌కు గతం గుర్తుకు వచ్చేలా చేసిందా అని మోనిత కంగారు పడిపోయింది. అయితే నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అని కార్తీక్ అంటే.. మనమే దీపతో మాట్లాడేందుకు ఇద్దరం వచ్చాం. ఇక ఇంటికి పోదాం అని కార్తీక్‌ను తీసుకెళ్లింది. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత బాబు పేరు ఏం పెట్టావు అని కార్తీక్ అడిగితే.. ఆనంద్ అని చెబితే.. తండ్రి పేరు గుర్తుకు వస్తుందేమోనని భయపడి.. తర్వాత ఆనంద్ అని చెప్పింది. దాంతో ఈ పేరు ఎక్కడో విన్నాను అంటూ కార్తీక్ ఆలోచనల్లో పడ్డాడు.

    కార్తీకదీపం సెప్టెంబర్ 20 ప్రోమోలో

    కార్తీకదీపం సెప్టెంబర్ 20 ప్రోమోలో

    తాజా ప్రోమోలో వంటలక్క, మోనిత మధ్య వాడివేడి వాదన జరిగింది. కార్తీక్‌కు గతం గుర్తుకు వచ్చే వరకు..గతం గుర్తుకు వచ్చిందంటే.. పిచ్చి వదిలిపోతుంది అని దీప అంది..అయితే గతం గుర్తుకు రాదు అని మోనిత గట్టిగా అరిచింది. వాడిని తెచ్చి ఒడిలో పెట్టి కార్తీక్‌ను తండ్రిని చేశాను అని మోనిత అంటే.. ఆనంద్‌ను కార్తీక్‌ చేతిలో పెడితే.. టెన్షన్ పడ్డాను. కానీ ఆనంద్ వల్ల కార్తీక్‌కు గతం గుర్తుకు వచ్చి.. నా గురించి ఆయన తెలుసుకొనే అవకాశం ఉంది అని దీప అంటే.. ఆ ఛాన్సే లేదు అని మోనిత సవాల్ విసిరింది. దాంతో పోయిన నేను తిరిగి వచ్చాక.. పోయిన గతం గుర్తుకు రావడం పెద్ద కష్టం కాదని దీప సమాధానం ఇచ్చింది.

    English summary
    Karthika Deepam 20th September Episode number 1462.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X