Karthika Deepam నా ప్రాణం తీయకండి.. అందుకు నాకు అదే శిక్ష.. హిమ షాకింగ్ నిర్ణయం
తను చిన్నతనంలో పెరిగిన బస్తీకి వస్తావా అని ప్యాసింజర్ అడిగితే.. వెంటనే ఆటోను శ్రీరామ్ నగర్ బస్తీకి బయలుదేరింది. బస్తీలో ప్యాసింజర్‌ను వదలేసిన తర్వాత చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యింది. ప్యాసింజర్ డబ్బులు ఇవ్వడానికి వస్తే.. డబ్బులు వద్దు అని శౌర్య చెప్పింది. అయితే డబ్బులు తీసుకోకుండా ఎలా ఆటో నడుపుతావు అని ప్యాసింజర్ అంటే.. బతకడానికి డబ్బులు కావాలి. కానీ డబ్బుల కోసమే బతకవద్దు అంటూ శౌర్య సమాధానం ఇచ్చింది.
దాంతో సరే అంటూ ప్యాసింజర్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత వెంటనే తిరిగి వచ్చి.. ఆటో ఎక్కే ముందు నన్ను బాబాయ్ అన్నావు. ఆటో దిగిన తర్వాత బాబాయ్ అంటున్నావు. ఈ బస్తీతో ఏమైనా అనుబంధం ఉందా? అని పెద్దాయన అడిగితే.. ఈ బస్తీతో అనుబంధం మాటల్లో చెప్పలేనంతగా అని సమాధానం చెప్పింది. దాంతో ప్యాసింజర్ వెళ్లిపోయాడు. ఈ బస్తీతో ఉన్న అనుబంధం ఓ ఫోటో ఆల్బమ్ చేయవచ్చు అని శౌర్య అనుకొన్నది. ఇక కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1316 లో ఇంకా ఏం జరిగిందంటే..

ఆనంద్ మా డాడీ కొడుకేనా?
శ్రీరామ్ నగర్ బస్తీలోని మోనిత ఇంటిలోకి అడిగిపెట్టిన హిమకు తన కుటుండానికి మోనిత చేసిన పని తలచుకొని కుమిలిపోయింది. హిమ వేధింపులకు నాన్న, అమ్మ ఎంత బాధపడ్డారో. నాన్నను, అమ్మను వేధించిన తీరు ఇప్పుడు నాకు అర్ధం అవుతుంది. ఆనంద్ నాకు సొంత తమ్ముడు అన్నమాట. అందుకే వాడంటే చిన్నప్పుడే అంత ప్రేమ ఉండేది. వాడు నా రక్తమే. మా డాడీ కొడుకే. అందరూ కలిసి ఆనంద్‌ను దూరం చేశారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో అని హిమ కన్నీరు పెట్టుకొన్నది.

కార్తీక్ ఫోటో చూసిన శౌర్య షాక్
ప్యాసింజర్‌ను దించేసి శౌర్య ఆటో నడుపుకొంటూ వచ్చి బస్తీలో తాము ఉన్న ఇంటి ముందు ఆగింది. ఇంటిలో లైట్లు వేసి ఉండటంతో ఎవరైనా ఉన్నారా? వారణాసిని అడిగితే.. హిమ ఆచూకీ తెలిసేదేమో? ఇంట్లో ఎవరు ఉన్నారు? అంటూ మెల్లగా ఇంటిలోకి శౌర్య అడుగుపెట్టింది. ఇంటిలోకి అడుగుపెట్టిన శౌర్య తొంగి చూడగానే కార్తీక్ ఫోటో కనిపించింది. ఆ తర్వాత కార్తీక్, మోనిత పూజ చేస్తున్న ఫోటో కనిపించగానే షాక్ తిన్నది. ఏమిటి? మోనిత అంటీతో నాన్న పూజ చేయడం ఏమిటి? ఇది మోనిత ఇళ్లా? అంటూ పక్కకు చూడగానే.. ఆనంద్‌ను ఎత్తుకొన్న మోనిత ఫోటో కనిపించింది. దాంతో ఒక్క క్షణం శౌర్యకు ఏమీ తోచలేదు.

ఆనంద్ నా తమ్ముడేనా?
ఆనంద్ నాన్న కొడుకా? నిజంగా నా తమ్ముడేనా? అని అనుకొంటుండగా.. మోనిత చేసిన మోసానికి అంటూ తన తల్లి, నాన్నతో చెబుతున్న మాటలు గుర్తుకు వచ్చాయి. దాంతో నిజంగానే నాన్నను మోనిత అంటీ మోసం చేసిందా అని శౌర్య ఆవేదన చెందింది. మోనిత అంటీ అమ్మను మోసిం చేసిందా? అమ్మ ఎంత బాధపడిందో.. మొదటి నుంచి అమ్మ జీవితంలో అన్నీ కష్టాలే.
ఆనంద్ నాకు తమ్ముడైతే.. ఆ మోనిత ఆంటీ కొడుకు.. మా అమ్మను మోసం చేసిన మోనిత ఆంటీ కొడుకు తమ్ముడే కదా అని కన్నీరుపెట్టింది. అప్పుడే వాడిని ఇంటి నుంచి పంపించి మంచి పనిచేశారు. ఇప్పటి వరకు అక్కా, చెల్లెలి బంధమే నచ్చేది కాదు. ఈ రోజు అక్కా, తమ్ముళ్ల బంధం కూడా నచ్చదు అని శౌర్య చెప్పింది.

ఓ యువతి వచ్చి వెళ్తుందని..
ఇంట్లోకి అడుగులు వేస్తూ దీపాలు వెలుగుతున్నాయంటే.. ఈ ఇంట్లో ఎవరో ఉన్నారనే మాటే కదా.. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు పలకరేంటి అని శౌర్య అనగానే.. ఓ ముసలావిడ వచ్చి.. ఎవరమ్మా అని అడిగితే.. అసలు నీవు ఎవరు? ఈ ఇంటికి నీకు సంబంధం ఏమిటి? అని శౌర్య అడిగితే.. ఈ ఇంటి గురించి కథలు కథలుగా చెప్పుకొంటారు. ఈ ఇంటికి ఎవరో వస్తారని.. ఏవేవో మాట్లాడుకొంటారు అని చెప్పుకొంటారు. అందుకే ఈ ఇంటి వైపు ఎవరూ కూడా కన్నెత్తి చూడరు. అందరూ భయపడుతున్నారు అని పెద్దావిడ అంటే.. ఇళ్లంతా బాగానే ఉంది కదా.. అంటే.. అప్పడప్పుడు ఈ వయసు ఉన్న యువతి వచ్చి వెళ్తుంది అని చెప్పగానే శౌర్య షాక్ తిన్నది.

హిమ వచ్చి వెళ్లిందా అంటూ
ఇంటికి ఎవరో ఒకరు వస్తారు.. ఇంటిని ఊడ్చి వెళ్తారు. నేను వచ్చినప్పుడు నేను శుభ్రం చేస్తాను అని పెద్దావిడ చెప్పగానే.. నా ఈడు అమ్మాయినా? అని అడిగితే అవును.. వస్తుంది.. ఫోటో ముందు దీపం వెలిగిస్తుంది. నాకు అప్పుడప్పుడు డబ్బులు కూడా ఇస్తుంది అని పెద్దావిడ చెప్పగానే.. హిమ వచ్చి వెళ్తుందా? అని మనసులో అనుకొంటుంటే.. ఆ అమ్మాయి ఇప్పుడే వచ్చి వెళ్లింది? నాకు తెలిసి వీధి కూడా దాటి ఉండదు అని పెద్దావిడ చెప్పగానే.. పరుగెత్తుకొంటూ వెళ్లి హిమ అని గట్టిగా అరిచింది. ఆ తర్వాత నిన్ను వదిలేదే లేదు అని అరిచింది.

సరైన సమయానికి భోజనం చేయాలి..
మోనిత ఇంటి నుంచి బయలుదేరి హిమ ఇంటికి చేరుకొన్నది. హిమను చూడగానే సౌందర్య, ఆనందరావు అదిగో హిమ వచ్చింది అంటూ సంబరపడిపోయారు. హిమను చూసి ఆనందరావు.. రా భోజనం చేద్దామంటే.. లేదు మీరు తినండి.. నేను తినను అని హిమ అంటే.. లేదు నీ కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నాం అని సౌందర్య చెప్పింది. దాంతో తాతయ్య.. మీకు ఎన్నిసార్లు చెప్పాను. సరైన సమయానికి భోజనం చేయాలి. నిద్ర పోవాలి అని హిమ అంది. ఆ తర్వాత గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయింది.
Recommended Video


నాకు నేను విధించుకొనే శిక్ష ఇదే..
హిమ తలలో పూలు పెడుతుంటే.. ఆనందరావు వచ్చి.. హిమను పెళ్లికూతురిలా తయారు చేస్తున్నావు అని అంటే.. పూలు పెట్టుకొంటే పెళ్లి కూతురేనా? ఎప్పుడూ పెళ్లి గొడవేనా? శౌర్య కనిపించేంత వరకు నేను పెళ్లి చేసుకోను. శౌర్య కనిపించడమే ముఖ్యం. నేను చేసిన తప్పుకు శౌర్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. తనను కలువాలి. తప్పును క్షమించమని అడగాలి. నా వల్లే కదా నాన్న, అమ్మ అలా అయ్యారు. శౌర్య ఒప్పుకోకపోతే బతిమాలుతాను. కాళ్లు పట్టుకొంటాను. పాపం శౌర్య ఎలా ఉందో.. ఏం చేస్తుందో.. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి గొడవ పెట్టకండి.. శౌర్య దొరికే వరకు పెళ్లి ప్రస్తావన తేకండి. శౌర్య దొరకకపోతే పెళ్లి చేసుకోకుండా ఉండి పోతాను. శౌర్యను బాధించినందుకు నాకు నేను విధించుకొన్న శిక్ష. పెళ్లి పెళ్లి అంటూ నా ప్రాణం తీయకండి అంటూ హిమ తీవ్రంగా స్పందించింది.


Click it and Unblock the Notifications











