twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam నీకు మంచి మొగుడిని గిఫ్టుగా ఇస్తా..ఆమెకు షాకిచ్చిన నిరుపమ్

    |

    నిరుపమ్ పెళ్లి జ్వాలాతో హిమ చేయాలని ప్రయత్నించడంపై స్వప్నతో డాక్టర్ శోభ రకరకాల డౌట్స్ వెల్లడించింది. నిరుపమ్ పెళ్లిపై నాకు చాలా డౌట్స్ ఉన్నాయి అంటే.. ఎందుకు ఆ డౌట్స్ అని స్వప్న ప్రశ్నించింది. నిరుపమ్ డాక్టర్, హిమ డాక్టర్. ప్రస్తుతం రకరకాల రోగాలు తగ్గిపోతున్నాయి. హిమ మరో నెలనో, రెండు నెలల్లో చనిపోతుందని అనుకొంటాం.

    నేను రెండో,మూడో నెలలు వెయిట్ చేస్తాను. కానీ హిమకు ఉన్న వ్యాధి నయమైతే నా పరిస్థితి ఏమిటి అని శోభ అంటే.. పెద్ద పెద్ద రోగాలను నయం చేయడం కష్టం. నీవు కూడా డాక్టర్‌వే కదా. అయితే హిమ మాయలో నిరుపమ్ పడ్డాడు. వాడి ఆలోచనను మార్చలేం. దాని ఆయుష్షు తీరగానే నిరుపమ్‌తో నీకు పెళ్లి చేస్తాను అని స్వప్న భరోసా ఇచ్చింది. కార్తీకదీపం సీరియల్‌ 1394 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

    హిమ ప్లాన్‌లో ఏదో తిరకాసు

    హిమ ప్లాన్‌లో ఏదో తిరకాసు

    నిరుపమ్‌కు జ్వాలాను ఇచ్చి పెళ్లి చేయాలనుకొంటున్న హిమ ప్లాన్‌లో ఏదో తిరకాసు ఉందనిపిస్తుంది. నిరుపమ్‌కు పెళ్లి చేసుకోవడం ఇష్టలేకపోతే.. పర్టిక్యులర్‌గా జ్వాలాతో పెళ్లి చేయాలని అనుకోవడంలో ఏదో మతలబు ఉంది. నిశ్చితార్థం జరిగే సమయంలో చివరి నిమిషంలో ఎందుకు రిజెక్ట్ చేసింది. దీని వెనుక ఏదో తెలియని విషయం జరుగుతున్నది. కాబట్టి ఆ ఇంటిపై ఒక నజర్ పెట్టాల్సిందే అని శోభ చెప్పింది. ఇక నేను చెప్పాల్సింది చెప్పాను. స్వప్న ఆంటి మనసులో అనుమానాలు నాటాను. ఏం జరుగుతుందో చూద్దాం అని శోభ మనసులో అనుకొన్నది.

    మీ మైండ్‌లో ఏమున్నది? అంటూ..

    మీ మైండ్‌లో ఏమున్నది? అంటూ..

    శోభ నాటిన అనుమానాలు మోసుకొంటూ స్వప్న నేరుగా పుట్టింటికి వచ్చింది. టిఫిన్ పట్టుకొని ఎటో వెళ్తున్నారు అని అంటే.. తెలిసిన వాళ్ల ఇంటికి వెళ్తున్నాం అని సౌందర్య అంటే.. మీరు రోజుకు ఒక్కో విధంగా కనిపిస్తారు. మీ మైండ్‌లో ఏమున్నదో తెలియడం లేదు. ఏదో జరుగుతున్నది. అది నాకు అర్ధం కావడం లేదు అని స్వప్న అంటుంటే.. ఫోన్ మోగింది.

    అయితే ఫోన్ ఎత్తడానికి ఆలోచిస్తుంటే.. ఫోన్ ఎత్తమ్మా.. లేదంటే నేను ఎత్తి మాట్లాడుతాను అంటూ సౌందర్య అని. ఫోన్ ఎత్తగానే.. జ్వాలా మాట్లాడింది. మీరు వస్తానని చెప్పారు.. వస్తున్నారా అంటే.. వస్తున్నాను జగదీశ్వరి అని చెప్పింది. అయితే జగదీశ్వరి ఎవరు అని వెంటనే స్వప్న అడిగింది. అయితే నీకు తెలియదులే.. అని స్వప్నకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

    పెళ్లి చేసుకొంటావా? లేదా?

    పెళ్లి చేసుకొంటావా? లేదా?

    అయితే తన తల్లిదండ్రులను ఉద్దేశించి.. నిశ్చితార్థం రోజున చివరి నిమిషంలో నాకు ఇష్టం లేదని చెప్పింది. పెళ్లి రోజున అదే పని చేయదనే గ్యారెంటీ ఏమిటి? అని స్వప్న అనుమానం వ్యక్తం చేసింది. అయితే నిరుపమ్ బావ పెళ్లి జరుగుతుంది. అందులో ఎలాంటి డౌట్స్ లేవు అని హిమ బదులిచ్చింది. దాంతో స్వప్న నీవేమి కంగారు పడకు. హిమ క్లారిటి ఇచ్చింది కదా అని సౌందర్య సమాధానం ఇచ్చింది. అయితే తాము బయటకు వెళ్తున్నాం అని సౌందర్య, ఆనందరావు వెళ్లబోతుంటే.. నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి అని స్వప్న విసుగును ప్రదర్శిస్తూ బయటకు వెళ్లింది.

    నీకు మంచి మొగుడిని గిఫ్టుగా

    నీకు మంచి మొగుడిని గిఫ్టుగా

    నిరుపమ్‌కు డాక్టర్ శోభ కాల్ చేసి.. నీ పెళ్లికి ఏం గిఫ్టు ఇవ్వాలా అని ఆలోచిస్తున్నా. నీకు ఏం గిఫ్టు కావాలి అని అడిగితే.. ఎవరైనా అడిగి గిఫ్టు ఇస్తారా అని నిరుపమ్ సమాధానం ఇచ్చాడు. అయితే నేనే నీకు మంచి గిఫ్టు ఇవ్వాలని అనుకొంటున్నాను అని నిరుపమ్ అంటే.. ఏమిటా గిప్టు అని అడిగింది. అయితే నీకు మంచి మొగుడిని ఇవ్వాలని అనుకొంటున్నాను. కెనడాలో నా ఫ్రెండ్ ఉన్నాడు. ఇండియాకు వచ్చి సెటిల్ కావాలని అనుకొంటున్నాడు. నీ ఫోటోలు ఆయనకు పంపాను. త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుంది అని శోభకు నిరుపమ్ షాకిచ్చాడు. దాంతో శోభకు నోట రాలేదు. అయితే నేను మొగుడు కావాలనుకొన్న వ్యక్తి నాకు మొగుడిని తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ శోభ మండిపడింది.

    పెళ్లిని ఆపండి అంటూ

    పెళ్లిని ఆపండి అంటూ

    అయితే తనకు పెళ్లి చేయాలని నిరుపమ్ ప్లాన్ చేసిన సంగతిని స్వప్నకు చెప్పి శోభ కంగారు పడింది. నేను నిరుపమ్‌ను పెళ్లి చేసుకోవాలని చూస్తే.. నాకు ఆయన పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. నాకేం అర్ధం కావడం లేదు. టెన్షన్‌తో నాకు ఏం చేయాలో తెలియడం లేదు. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపండి. పెళ్లంటే నాకు ఇష్టం లేదని హిమ చెబుతుంది.

    కాబట్టి నిరుపమ్ పెళ్లిని ఆపండి శోభ అంటే.. పెళ్లిని ఆపడం అసాధ్యం. హిమ పోగానే.. నిరుపమ్‌తో నీ పెళ్లి జరిపిస్తా. అప్పటి వరకు వెయిట్ చేయి అని స్వప్న అంటే.. హిమకు క్యాన్సర్ లేదు. ఆమె చనిపోదు. కానీ నా పెళ్లి నిరుపమ్‌తో చేస్తానని అంటున్నది. నాకు అప్పులు ఎక్కువైపోతున్నాయి. నా ప్లాన్స్ నేను వేసుకొంటే బెటర్ అని మనసులో అనుకొన్నది. అయితే ఆ ఇంటిపై ఓ కన్ను వేసి ఉంచండి అని స్వప్నకు శోభ చెప్పింది.

    నేను ఊరు విడిచి వెళ్లిపోతా అంటూ

    నేను ఊరు విడిచి వెళ్లిపోతా అంటూ

    సౌందర్య, ఆనందరావు టిఫిన్ బాక్స్ తీసుకొని జ్వాలా ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ హిమ చేసిన మోసాన్ని చెప్పుకొని జ్వాలా ఎమోషనల్ అయింది. నాకు చెప్పి ఉంటే.. వారిద్దరి పెళ్లి చేసేదాన్ని. అది ఫ్రెండ్ షిప్‌గా ఉండేది. కానీ నాకు చెప్పకుండా నా ప్రేమను కూల్చింది. ఆ విషయాన్ని నేను తట్టుకోలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అని జ్వాలా బాంబు పేల్చింది. దాంతో మమల్ని వదిలేసి వెళ్లిపోతావా? అని ఆనందరావు, సౌందర్య కంగారు పడితే.. నా పిన్ని, బాబాయి వచ్చిన తర్వాత ఈ ఊరు విడిచి వెళ్లిపోతాను అని జ్వాలా చెప్పింది.

    English summary
    Karthika Deepam July 2nd Episode number 1394
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X