Karthika Deepam శౌర్య‌ను కిడ్నాప్ చేసిన దుండగులు, కళ్లకు గంతలు కట్టి బంధించిన రౌడీలు.. ఏం జరిగిందంటే?

జాగింగ్‌కు వెళ్లిన శౌర్యను ఇంటికి మోసుకొచ్చిన నిరుపమ్‌ను చూసి సౌందర్య కంగారుపడింది. శౌర్యను చూసి ప్రేమ్ అంబులెన్స్‌కు ఫోన్ చేయాలా అంటే.. అవసరం లేదు. శౌర్య బాగానే ఉంది అని నిరుపమ్ సమాధానం చెప్పాడు. బాగానే మోసుకొచ్చావురా.. నీవు మామూలోడివి కాదురా అని ప్రేమ్ అన్నాడు. అయితే నాకు బాగానే ఉందంటూ శౌర్య చెప్పడంతో నీకు మెలుకవగానే ఉన్నావా? అయితే నడిచి రావొచ్చు కదా.. అంటే.. ఏం కాదులే. మాటలు అన్నీ వింటూనే ఉన్నాను అని అంది.

అయితే తెలిసి కూడా నటించావా? అంటే.. ఇక్కడ ఉన్నవాళ్లలో మహనటులు ఉన్నారు. వారికంటే నేను ఎక్కువ కాదు అంటూ లేచి నడిచి వెళ్లబోయింది. అయితే సాయం చేస్తానంటే.. నాకు ఒంటరిగా బతకడం తెలుసు. నేను నడిచిపోతానంటూ శౌర్య వెళ్లిపోయింది. కార్తీకదీపం సీరియల్ 1418 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

హిమతో ప్రేమ్ రొమాటిక్‌గా

హిమతో ప్రేమ్ రొమాటిక్‌గా

ఇదిలా ఉండగా, తన ఇంటి ఆవరణలో చెట్టు కింద తలస్నానం చేసి ధూపం వేసుకొంటూ కనిపించిన హిమను చూసి ప్రేమ్ థ్రిల్ అయ్యాడు. మెల్లగా వెళ్లి భుజంపై చేయి వేసి అమాంతం ఎత్తుకొని గిరిగిరా ప్రేమతో తిప్పాడు. అలా ఇద్దరూ ఒకరి కౌగిలిలో మరొకరు ఒదిగిపోయారు. అంతలోనే డాక్టర్ వచ్చి ప్రేమ్‌ను డిస్ట్రబ్ చేశాడు.

దాంతో ఇప్పటి వరకు జరిగిందంతా ఓ కలనా అని అనుకొంటే.. వెంటనే డాక్టర్ ఫిలమెంట్ వచ్చి.. పగటి కలలు కంటున్నావా అంటూ ప్రేమ్‌ను అడిగాడు. కలనా? నిజం అయితే బాగుండు అని అన్నాడు. ఇంతకు నీ పేరు ఏమిటి అంటే..నా పేరు ఫిలమెంట్.. నేను చేసేది ట్రీట్‌మెంట్ అంటే.. ఇక్కడే చాలా మంది డాక్టర్లు ఉన్నారు.. వెళ్లిపో అొంటే.. నాకు కాల్ వచ్చింది. జ్వాలా గది ఎక్కడో చూపించు అంటూ ప్రేమ్‌తో డాక్టర్ ఫిలమెంట్ వెళ్లారు.

డాక్టర్ ఫిలమెంట్ ఎంట్రీతో

డాక్టర్ ఫిలమెంట్ ఎంట్రీతో


డాక్టర్ ఫిలమెంట్‌ను చూసి ఇంటి సభ్యులందరూ ఆశ్చర్యపోయారు. జ్వాలా ఎక్కడా అని డాక్టర్ ఫిలమెంట్ అడిగితే.. ఆమె గదిని చూపించడంతో జ్వాలా వద్దకు వెళ్లాడు. ఏంటి జ్వాలా ఆరోగ్యం బాగాలేదా అంటే.. అవును అంది.. డాక్టర్ ఎక్స్‌ట్రా చేస్తే.. నీ ఫిలమెంట్ రాలిపోతుంది అని అన్నాడు. జ్వాలాతో మాటలు కలుపుతూ.. నాకు వెబ్ సిరీస్‌లో హీరో ఆఫర్ వచ్చింది. కానీ నా పక్కన హీరోయిన్‌గా ఉండాలని నా భార్య కోరింది. దాంతో ఆఫర్ పోయింది. నీకు యాక్టింగ్ పిచ్చి పోలేదా అంటూ డాక్టర్‌ను అయిన నేను యాక్టర్ కాలేనా అని సమాధానం చెప్పింది. డాక్టర్ ఫిలమెంట్ హడావిడికి కంగారుపడిపోయారు.

శౌర్య అపార్ధం చేసుకొన్నదంటూ

శౌర్య అపార్ధం చేసుకొన్నదంటూ


అయితే శౌర్య ఆరోగ్యంపై బెంగపడిన కుటుంబ సభ్యులందరూ కంగారుపడిపోయారు. నాకు బాగానే ఉంది. మీరు నా వద్ద ఉండటం అవసరం లేదు. మీరు బయటకు వెళ్లండి అంటూ శౌర్య గట్టిగా అరిచింది. అయితే శౌర్య మాటలకు బాధపడితే.. సౌందర్య ఊరడించింది. శౌర్య అంటే నాకు ఇష్టం. ఆమెకు బాగా లేకపోతే. నేను బాధపడుతుంటే.. మరో డాక్టర్‌తో ట్రీట్‌మెంట్ చేసుకొంటున్నది. నిరుపమ్, శౌర్యను కలుపాలని నేను ప్రయత్నిస్తుంటే..నన్ను అపార్ధం చేసుకొంటున్నదని హిమ బాధపడింది. అయితే అంతా సర్దుకుంటుందని సౌందర్య చెప్పింది.

డాక్టర్ సాబ్ గురించి ఎందుకీ ఆలోచన

డాక్టర్ సాబ్ గురించి ఎందుకీ ఆలోచన


శౌర్య తనతో ప్రవర్తిస్తున్న తీరుపై హిమ ఆలోచనల్లో పడింది. శౌర్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నది. నన్ను అర్దం చేసుకొంటే.. శౌర్య నాతో ఇలా ఉండదు. నా మాట శౌర్య వినడం లేదు. తను విన్నా లేకున్నా నిరుపమ్, శౌర్యను కలిపుతాను. అలాగే శౌర్య కూడా డాక్టర్ సాబ్ గురించి ఆలోచించింది. నన్ను చేతుల మీదుగా మోసుకొచ్చాడా? నేను ఎందుకు నిరుపమ్ గురించి పదే పదే ఆలోచిస్తున్నాను.

హిమ నాకు మోసం చేసింది. నా మీద ప్రేమ లేదని డాక్టర్ సాబ్ ముఖం మీదే చెప్పేశాడు. డాక్టర్ సాబ్ ఎందుకు గుర్తుకు వస్తున్నాడు. డాక్టర్ సాబ్‌ను చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. డాక్టర్ సాబ్‌ను ఇక్కడ నుంచి పంపించాలి. నా మనస మాట వినమని చెప్పాలని బయటకు వచ్చింది.

నటించే వారికి దూరంగా వెళ్తున్నా

నటించే వారికి దూరంగా వెళ్తున్నా

అయితే హాల్‌లో హిమతో అన్యోన్యంగా ఉండటం చూసి శౌర్య కోపంతో ఊగిపోయింది. మనసు బాగాలేకపోతే బయటకు వెళ్దామా అని అంటుంటడగా శౌర్య వెనుక నుంచి విన్నది. డాక్టర్ సాబ్‌ను బయటకు పంపించడం కంటే..నేను బయటకు వెళ్లడం మంచిందని బయటకు వెళ్తుంటే.. నటించే మనసులకు దూరంగా వెళ్లిపోతున్నా. నా కళ్లకు ఏం కనిపిస్తున్నదో నాకు జీర్ణించుకోవడం సాధ్యం కావడం లేదు అని శౌర్య చెప్పి బయటకు వెళ్లింది.

 శౌర్యను కిడ్నాప్ చేసిన రౌడీలు

శౌర్యను కిడ్నాప్ చేసిన రౌడీలు

ఇదిలా ఉండగా, తాజా కార్తీకదీపం ప్రోమోలో మరో ట్విస్టు కనిపించింది. డబ్బు దోచుకొని వెళ్తుండగా పోలీసులకు పట్టించిన దుండగులు శౌర్యను కిడ్నాప్ చేశారు.శౌర్యను బలవంతంగా కారులో ఎక్కించారు. ఇంటిలోకి తీసుకెళ్లి కళ్లకు గంతలు కట్టి కుర్చీకి కట్టేశారు. శౌర్య బయటకు వెళ్లడంతో కంగారు పడిన శౌర్య ఫోన్ చేసింది. ఫోన్ అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియాలో ఉండటంతో మరింత కంగారు పడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X