For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam శౌర్యను రక్షించిన నిరుపమ్.. కిడ్నాప్ ప్లాన్ చేసింది ఎవరంటే?

  |

  హిమతో నిరుపమ్‌ సన్నిహితంగా ఉండటం చూసి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆటోలో వెళ్తూ.. నేను డాక్టర్ సాబ్‌ను పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్లిపోవాలని అనుకొన్నాను. కానీ అంతా తలకిందులైంది అనుకొంటుండగా ఓ వ్యక్తి రోడ్డుపై అడ్డంగా పడి ఉన్నాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించగా.. ఇద్దరు గుండాలు దిగి తన వద్దకు రావడంతో.. నువ్వా అంటే.. గుర్తుపట్టిందిరో.. మమ్మల్ని పోలీసులకు పట్టిస్తే ఊరుకొంటామని అనుకొన్నావా? పగ తీర్చుకోవాలి కదా ఆటో పాప అంటూ మీదకు రావడంతో శౌర్య కర్రతో వారిని కొట్టింది. అయితే ముగ్గురు గుండాలు ఆమెను బలవంతంగా పట్టుకొని వాహనం ఎక్కించారు. కార్తీకదీపం సీరియల్ 1419 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే...

  కంగారు పడిన సౌందర్య

  కంగారు పడిన సౌందర్య

  శౌర్య ఇల్లు వదిలి వెళ్లడంతో హిమ, సౌందర్య, నిరుపమ్ కంగారుపడింది. ఫోన్ ట్రై చేస్తే అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా అంటూ సమాధానం వచ్చింది. శౌర్య పట్టుదల ఏంటో అందరికి తెలుసు. శౌర్య కోసం ఎంత చేశాను. నేను పడిన శ్రమ అంతా వృథా అయింది అని హిమ అంటే.. ఎందుకు అలా కంగారు పడుతావు. ఫోన్‌లో చార్జింగ్ అయిపోయి ఉంటుందేమో అని నిరుపమ్ అన్నాడు. అయితే పోలీసులకు కంప్లైయింట్ ఇద్దామని అంటే.. వద్దు శౌర్య మహా కోపిష్టి. మళ్లీ ఏమైనా గొడవ చేస్తుందేమోనని సౌందర్య అభ్యంతరం చెప్పింది. దాంతో శౌర్యను వెతికేందుకు నిరుపమ్, హిమ బయటకు వెళ్లారు.

  శౌర్యను గదిలో బంధించి.. శోభకు ఫోన్

  శౌర్యను గదిలో బంధించి.. శోభకు ఫోన్

  ఇక శౌర్యను వాహనంలో బలవంతంగా ఎత్తుకొచ్చిన దుండగులు ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ బంధించారు. కళ్లకు గంతలు కట్టి.. కుర్చీకి కట్టేశారు. ఆ తర్వాత ఓ వ్యక్తి వచ్చి.. మేడమ్ మీరు చెప్పినట్టే చేశాం అని చెబితే.. శోభ ఫోన్ ఎత్తి.. మంచి పని చేశారు. నేను చెప్పేంత వరకు అక్కడే ఉంచండి. నాకు ఓసారి వీడియో కాల్ చేసి చూపించండి అని డాక్టర్ శోభ అంటే.. కాల్ చేసి చూపించారు. దాంతో నన్ను చెంపదెబ్బ కొడుతావా? నీకు తగిన బుద్ది చెబుతాను అంటూ శోభ ఆనందపడింది. అయితే కట్లు విప్పి చూడండిరా.. మీ సంగతి చెబుతా అని శౌర్య వార్నింగ్ ఇచ్చింది.

  నిరుపమ్‌కు వివరాలు చెప్పిన ముష్టివాడు

  నిరుపమ్‌కు వివరాలు చెప్పిన ముష్టివాడు

  శౌర్య కోసం నిరుపమ్, హిమ వెతుకుంటే.. ఓ చోట శౌర్య ఆటో కనిపించింది. దాంతో ఆందోళన పడ్డాడు. పక్కనే ఉన్న ముష్టివాడు.. అమ్మాయిని ఎవరో ఎత్తుకెళ్లారు. ఊరు చివరన బంగళాకు తీసుకెళ్లారు. అక్కడే ఉంచారు అంటూ ముష్టివాడు చెబితే.. వెంటనే నిరుపమ్ ఆ దిశగా వెళ్లాడు. మరో కారులో ప్రేమ్, హిమ ఇద్దరు వెతుకుతూ కనిపించారు. వెంటనే నిరుపమ్‌కు కాల్ చేశారు. శౌర్య ఆటో కనిపించింది. ఆమె కనిపించలేదు. నేను ఒక ప్లేస్‌కు వెళ్తున్నాను అంటూ చెప్పాడు. దాంతో నీవు అక్కడికి వెళ్లి నాకు కాల్ చేయి అంటూ ప్రేమ్ చెప్పాడు. ఇదిలా ఉండగా, శౌర్యను బంధించిన ప్రదేశానికి నిరుపమ్ చేరుకొన్నాడు.

  నిరుపమ్, శౌర్య వద్దకు హిమ, ప్రేమ్

  నిరుపమ్, శౌర్య వద్దకు హిమ, ప్రేమ్

  శౌర్యను బంధించిన ప్రదేశానికి నిరుపమ్ రావడంతో దుండగులు కంగారు పడ్డారు. ఎవరో వచ్చి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో ముందు తలుపు తీసి చూడు.. ఎవరు వచ్చారో తెలుస్తుంది. తలుపు తీసి చూడగానే.. ఎవరు లేకపోవడంతో తలుపు మూసివేస్తుండగా.. నిరుపమ్ వెళ్లి డోర్స్‌ను గట్టిగా తన్నాడు. దాంతో వాళ్లు కిందపడటంతో శౌర్య కట్లు విప్పేందుకు నిరుపమ్ ప్రయత్నించాడు. ఆ తర్వాత దుండగులను కొట్టి.. శౌర్యను విడిపించాడు. ఆ తర్వాత నాకు థ్యాంక్స్ చెప్పవా? అంటే.. ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం పద అంటూ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు.. డోర్స్ క్లోజ్ చేసి ఉండటంతో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. శోభకు కాల్ చేసి విషయం చెప్పడంతో.. నిరుపమ్ వచ్చాడని తెలుసుకొన్న ఆమె కంగారు పడింది.

  అబద్ధం ఆడిన ప్రేమ్

  అబద్ధం ఆడిన ప్రేమ్

  ఇంతలో శౌర్య, నిరుపమ్ బందీ అయిన ఇంటి వద్దకు ప్రేమ్, హిమ ఇద్దరు చేరుకొన్నారు. ప్రేమ్, హిమను చూసి దుండగులు పారిపోయారు. దాంతో కంగారుపడిన ఇద్దరు నిరుపమ్, శౌర్య కోసం వెతకడం ప్రారంభించారు. ఇద్దరు కేకలు పెట్టడంతో తాము లోపల ఉన్నాం. శౌర్యను కిడ్నాప్ చేశారు అంటే.. ఎవరు కిడ్నాప్ చేశారు అంటూ హిమ ప్రశ్నించింది. దాంతో నాకు ఏం తెలుసు? ఎవరు కిడ్నాప్ చేశారో అంటూ సమాధానం చెప్పాడు. డోర్ తీయమంటే.. పెద్ద తాళం వేశారు అంటూ అబద్దం చెప్పారు.

  English summary
  Karthika Deepam August 1st Episode number 1419.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X