twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam దొంగ నాటకాలు ఆపు..చావు తప్ప ఇంకా మిగిలిందేమిటి? హిమపై శౌర్య ఫైర్

    |

    తనను పెంచిన పిన్ని హాస్పిటల్‌లో చేరడంపై జ్వాలా కంగారుపడిపోయింది. టెన్షన్ పడకు బాబాయ్ అని జ్వాలా అంటే.. ఎన్నడూ పిన్ని కడుపు నొప్పితో బాధపడలేదు. ఏదైనా పెద్ద సర్జరీ చేస్తారా? అని బాబాయ్ అంటే.. అదేం లేదు. ఈ కేసు చూసేది పెద్ద డాక్టర్. మీరు టెన్షన్ పడకండి. అయితే హాస్పిటల్‌కు తీసుకొచ్చి నాకు ఫోన్ చేసారేంటి? అని జ్వాలా అలియాస్ శౌర్య అడిగింది. అప్పుడు మీ పిన్ని కడుపునొప్పి అని బాధపడుతుంటే.. నాకు బుర్ర పనిచేయలేదు.

    అందుకే ఈ హాస్పిటల్‌కు వచ్చాం అని బాబాయ్ చెప్పారు. అయితే ఆపరేషన్‌ థియేటర్ నుంచి బయటకు రాగానే పిన్నితో హిమ కూడా రావడం చూసి జ్వాలా షాక్ తిన్నది. హిమను చూసి.. ఇక్కడికి తీసుకొచ్చావేంటి అంటే.. ఆ సమయంలో హిమ వచ్చింది. వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాం అని బాబాయ్ చెప్పారు. అయితే తన పిన్నికి హిమ ట్రీట్‌మెంట్ చేయడంపై అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. కార్తీకదీపం సీరియల్‌లో 1403 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

    ప్రాణాలు తీసే వారితో ట్రీట్‌మెంటా?

    ప్రాణాలు తీసే వారితో ట్రీట్‌మెంటా?

    ప్రాణాలు తీసే వారితో ట్రీట్‌మెంటా అంటూ హాస్పిటల్ నుంచి కోపంతో జ్వాలా వెళ్లిపోతుంటే.. చేయిపట్టుకొని ఆగు.. నీతో మాట్లాడాలి అని హిమ లాగింది. ఆ సమయంలో హిమ చేతిపై ఉన్న H అక్షరం కనిపించింది. అలాగే తన చేతిపై ఉన్న S అక్షరం చూసి ఎమోషనల్ అయింది. ఏం మాట్లాడుతావు అని జ్వాలా కసురుకొన్నది. ఏ మాట్లాడుతావు? ఏంటీ పరువు పోతుందని .. చుట్టు చూస్తున్నావా? నీకు పరువు పోతే నాకు జీవితమే పోయింది. డాక్టర్ సాబ్‌ను నాకు దూరం చేశావు. ఇంకా నాతో ఏం మాట్లాడతావు అని జ్వాలా అంటే..

    తెరవెనుక చాలా జరిగిందన్న మాట

    తెరవెనుక చాలా జరిగిందన్న మాట

    నీకు తెలియంది చాలా ఉంది. నీవు సరిగా అర్ధం చేసుకోవడం లేదు హిమ అంటే.. తెర వెనుక చాలా జరిగిందన్న మాట.. ఏది జరిగినా నాకే మోసం జరిగింది అని జ్వాలా అంది.. అయితే జరిగిన విషయాలు చెప్పడానికి ఇంటికి వస్తే.. పిన్నికి కడుపునొప్పి అని తెలిసింది. నన్ను అర్ధం చేసుకో అని అంటే.. అయితే హిమ మాటలకు అడ్డుపడుతూ.. నాటకాలు ఆడటం.. అద్బుతంగా నటించడం నీకు అలవాటే కద.. నీవేంటో.. నిజస్వరూపం ఏంటో నాకు తెలుసు కదా.. శోభ అన్ని విషయాలు చెప్పింది అని జ్వాలా ఆవేశంగా మాట్లాడింది.

     శోభ మాటలు నమ్మెద్దు

    శోభ మాటలు నమ్మెద్దు

    శోభ చెప్పిన విషయాలు నమ్మొద్దు. ఆమె మోసకారి అని హిమ అంటే.. ఆకలితో ఉన్న అహింస గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో.. నీవు మోసం గురించి మాట్లాడితే అలా ఉంటుంది. ఇక నీ క్యాన్సర్ డ్రామాలు.. నీ దొంగ నాటకాలు ఆపు అని జ్వాలా కోపంతో ఊగిపోయింది. ఇంకా నీవు నాటకాలు వేస్తున్నావా? ఇంకా ఏమి మిగిలింది.. నా ప్రాణాలు తప్ప.. నీ చిరునవ్వు వెనుక కపటం, మోసాలు కనిపెట్టలేకపోయాను. నీకన్నా శోభనే నయం.. నిజాలు చెబుతుంది అని జ్వాలా అంది.

    నా జీవితాన్ని నాశనం చేయాలని..

    నా జీవితాన్ని నాశనం చేయాలని..

    నాకు క్యాన్సర్ అని చెబితే.. నిరుపమ్ మరిచిపోయి అంటూ హిమ చెబుతుంటే.. నన్ను మరిచిపోయి.. నిన్ను పని చేసుకొంటారనేది నీ ప్లాన్ కదా అని జ్వాలా ఎదురు ప్రశ్న వేసింది. అలా నీవు నా గురించి అలా ఎందుకు ఆలోచిస్తున్నావు అని హిమ అంటే.. నన్ను, నా జీవితాన్ని నాశనం చేయాలని అనుకొంటున్నావు కదా అని జ్వాలా చెప్పింది. దాంతో నీవు శోభ చెప్పే మాటలు నమ్మకు అని అంటే.. ఛీ నన్ను ముట్టుకోకు.. కంపరం పుడుతుంది అంటూ చేయి విదిలించుకొని బయటకు వెళ్లిపోయింది.

    శౌర్య మనసు మార్చుకొంటుందేమో

    శౌర్య మనసు మార్చుకొంటుందేమో

    అయితే ఇంట్లో నానమ్మ, తాతతో హిమ మాట్లాడుతూ.. శౌర్యకు కాల్ చేయి అని అంటే.. శౌర్య మనసు మార్చుకొంటుందేమోనని భయం ఉన్నట్టుంది అని ఆనందరావు అంటే.. అవును అని సౌందర్య సమాధానం చెప్పింది. అంతలోనే శౌర్య ఆటోలో రావడంతో మంగళ హారతితో స్వాగతం పలికారు. అయితే తనకు ఇలాంటివి నచ్చవు. నేను ఇంట్లో ఉంటున్నామని కొందరిపై కోపం తగ్గిపోదూ.. ఎవరైనా నా ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే.. ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని శౌర్య వార్నింగ్ ఇచ్చింది.

     కొత్త రకం డ్రామాలు ఆడుతున్నావా?

    కొత్త రకం డ్రామాలు ఆడుతున్నావా?

    ఇక ఇంట్లో హిమ, శౌర్య ఉన్న ఫోటోను గోడకు తగిలిస్తుంటే.. స్వప్న ఇంట్లోకి వస్తూ చప్పట్లు కొట్టింది. మీరు ఇదో కొత్తరకం డ్రామాను ఆడుతున్నారా? మమ్మీ.. డాడీ మీరు సూపర్..ఇప్పటి వరకు మీరు దానిని నెత్తిన పెట్టుకొన్నారు. ఇప్పుడు ఫోటోను తెచ్చి ఇంట్లో పెట్టుకొన్నారు అని స్వప్న అంటే.. అమ్మా నాన్నలతో ఇలాగేనా మాట్లాడుతావా అని స్వప్న ఫైర్ అయింది.

    మీరు మమ్మీ, డాడీలే.. కానీ ఆ గౌరవన్నీ ఎప్పుడు నిలుపుకొన్నారు? ఒక్కసారి మీరు వెనక్కి చూసి.. మీ పద్దతులు, మీ ప్రవర్తనను చూసుకోండి అని స్వప్న అంటే.. హిమ, నిరుపమ్ పెళ్లి జరుగుతుంది కదా. ఇంకా నీ బాధ ఏంటి అని ఆనందరావు ఘాటుగా సమాధానం చెప్పాడు.

    English summary
    Karthika Deepam July 13th Episode number 1403.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X