For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam మోనిత నా భార్య. నాపై ఆశలు పెట్టుకొకు.. దీపకు కార్తీక్ షాక్

  |

  జ్వరానికి మాత్రలు ఇవ్వకుండా డాక్టర్‌తో నాటకం ఆడింది. ఇంటిలో వంటమనిషిగా చేరడానికే వంటలక్క కుట్ర పన్నిందని మోనిత చెప్పిన మాటలు పట్టుకొని దీప ఇంటికి వచ్చి కార్తీక్ గట్టిగా అరిచాడు. కార్తీక్ రాగానే.. డాక్టర్ బాబు ఇంటిలోకి రండి అంటే.. నీవే బయటకు రండి అని కార్తీక్ అరిచాడు. దాంతో వంటలక్క బయటకు రాగానే.. ఏం చేశావు. వంట మనిషిగా చేరడానికి నకిలీ డాక్టర్‌ను తీసుకొస్తావా? మోనిత వంట గదిలోకి వెళ్లవద్దని చెప్పిస్తావా? అని కార్తీక్ నిలదీశాడు. అయితే నీకు తెలియాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. నేను తప్పు చేయలేదు అని దీప అంది.. అయితే నేను ఈ విషయం మాట్లాడుతుంటే.. నీవు నా గతం గురించి మాట్లాడుతున్నావు. నీకు నా గతం గురించి తెలుసా అని కార్తీక్ ప్రశ్నించాడు. కార్తీకదీపం సీరియల్‌లో తాజా ఎపిసోడ్ 1458 లో ఏం జరిగిందంటే..

  నీ ఆలోచనలు మంచివి కాదు..

  నీ ఆలోచనలు మంచివి కాదు..

  వంటలక్క మౌనంగా ఉండటంతో.. నేనే నీ భార్యను. నీవు గుర్తుపట్టడం లేదు అని చెబుతావా? నీ ఆలోచనలు మంచివి కావు.. నీవు మంచిదానికి కావు అని మోనిత ఎప్పుడూ చెబుతూనే ఉంది. కానీ నేను పట్టించుకోకుండా నీతో మాట్లాడుతున్నాను. ఎక్కడో రోడ్డు మీద కనిపించావు. డాక్టర్ బాబు అంటూ నీ భార్యను అంటూ మొదలుపెట్టావు. అప్పుడే మోనిత హెచ్చరించింది. కానీ నేను నీ గురించి పట్టించుకోలేదు. కానీ నీవు మోనిత టిఫిన్‌లో విషం పెట్టావు అని కార్తీక్ అన్నాడు.

  నేను నిన్ను నమ్మాను. కానీ

  నేను నిన్ను నమ్మాను. కానీ


  దీప నుంచి మౌనంగా ఉండటంతో.. అప్పుడే నీతో మాట్లాడుకుండా ఉండాల్సింది. కానీ గుడిలో ప్రమాణం చేశావు కాబట్టి.. నేను నిన్ను నమ్మాను. కానీ నీవు ఇప్పుడు చేసిన పని చూస్తే.. మోనిత చెప్పిందే నిజమని నమ్మాల్సి వస్తుంది. నా కోసమే ఇదంతా చేస్తున్నావు కదా.. నాకు పెళ్లైంది. మోనిత నా భార్య. తెలిసి కూడా పరాయి భర్తను ఎలా కోరుకొంటున్నావు. ఏడవకు. ఏమీ తెలియని అమయాకురాలిగా కనిపిస్తావు. చేసే పనులు వేరు. అని కార్తీక్ అన్నాడు

   మళ్లీ పిచ్చిపనులు చేయకు.. అంటూ

  మళ్లీ పిచ్చిపనులు చేయకు.. అంటూ


  కార్తీక్ మాటలకు బాధపడుతూ.. నేను ఎప్పుడు తప్పుగా ప్రవర్తించలేదు అని దీప అంది. నేను అన్ని విషయాలు మరిచిపోతాను. నీ విషయాలు గుర్తు ఉంటాయి. నీకు వంటలక్కపై ఏదో ఉంది. అందుకే అన్నీ గుర్తు ఉంచుకొంటున్నావు అని మోనిత అనుమాన పడుతున్నది. అదే నాకు ప్రాబ్లెం కాదు. నీవు గుర్తు పెట్టుకో. మోనిత నా భార్య. నాపై ఆశలు పెట్టుకొకు. మళ్లీ పిచ్చిపనులు చేయకు. మళ్లీ మళ్లీ నాతో చెప్పించుకోకు అని కార్తీక్ చెప్పి వెళ్లిపోయాడు.

  ఆనంద్ తీసుకొచ్చే ప్లాన్‌లో

  ఆనంద్ తీసుకొచ్చే ప్లాన్‌లో


  ఇదిలా ఉండగా, తన కుమారుడు ఆనంద్‌ను తీసుకు రావడంపై మోనిత ఆలోచనల్లో పడింది. నేను ఆనంద్‌ను తీసుకొస్తే.. కార్తీక్, ఆనంద్ ఒకలోకమవుతారు. ఆ లోకంలో నేను ఉండిపోతాను. ఆనంద్ కోసం వెళ్లి తిరిగి వచ్చేలోపు.. దీప మాయ మాటలు చెప్పి వెనుకకు తీసుకెళ్తే.. అమ్మో.. ఇది డేంజర్. కార్తీక్‌ను నాతో తీసుకెళ్తే .. హైదరాబాద్‌లో అందరూ గుర్తుపడుతారు. ఇది ఇంకా డేంజర్. ఇలా కార్తీక్ నా చేజారిపోకుండా ఆనంద్‌ను తీసుకొచ్చే ప్లాన్ చేయాలి. లక్ష్మణ్‌తో తెప్పిస్తే.. ఊర్లో అందరికి తెలిసిపోతుంది. ఒకేఒక దారి ఉంది. ఈ రెండు రోజులు దీప ఉండకుండా చూడాలి. దీపను ఎక్కడికి పంపించాలి.. ఎలా పంపించాలి అని మోనిత ప్లాన్ వేసింది.

  ప్రేమతో నా కార్తీక్‌ను గెలుచుకొంటాను

  ప్రేమతో నా కార్తీక్‌ను గెలుచుకొంటాను

  కార్తీక్ తనను తిట్టిన దాని గురించి చిక్ మంగళూరు డాక్టర్, ఆయన తల్లితో చెప్పుకొని బాధపడింది. అయితే గతం మరిచిపోయిన వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తొందరపడితే మొత్తానికే ప్రమాదం అవుతుంది అని డాక్టర్ చెప్పాడు, దాంతో నేను, నాపిల్లలు కుటుంబాన్ని దగ్గర చేర్చేందుకు తొందరపడ్డాను. గతంలో నా ప్రేమతో కార్తీక్‌ను గెలుచుకొన్నాను. అదే ఇప్పుడు కూడా చేస్తానని చెప్పింది. ఇదిలా ఉండగా, మోనిత ఇంటి వద్దకు ఓ మహిళ వచ్చి.. దగ్గరలో ఆశ్రమం ఉంది. వారం రోజుల్లో గతం గుర్తు చేసేలా ట్రీట్‌మెంట్ చేస్తాం అని అంటే.. అలాగా.. వారం రోజుల్లో గతం గుర్తుకు తెస్తారా? ఇలా చెప్పి డబ్బులు గుంజే చాలా మందిని చూశాను అని మోనిత కోపంతో ఊగిపోయింది. ఈ సంఘటనను చూసిన దీప ఆలోచనల్లో పడింది.

  దీప మాటలు విని శౌర్య ఎమోషనల్

  దీప మాటలు విని శౌర్య ఎమోషనల్


  ఇదిలా ఉండగా, కార్తీకదీపం ప్రోమోలో.. శౌర్య పెంచుతున్న ఇంద్రుడు ఆటోను దీప ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే ఇంద్రుడు ఫోన్‌లో మాట్లాడుతుంటే.. అర్జెంట్‌ ఉంది. త్వరగా ఆటోను స్టార్ట్ చేయండి అంటూ దీప చెప్పింది. అయితే దీప మాటలు విని.. అమ్మ మాటల మాదిరిగా ఉన్నాయి అని మనసులో అనుకొన్నది. అయితే పిన్ని ఇంటికి కావాల్సిన వస్తువులు తెమ్మని చెప్పింది. వాటి గురించి చెబుతా రాసుకో అని శౌర్య అంటే.. నేను రాస్తాను. మీరు ఆటో స్టార్ట్ చేయండి అని చెప్పి.. ఫోన్ తీసుకొని దీప.. చెప్పు అంటే.. తన తల్లి మాటలు విని శౌర్య ఉద్వేగానికి గురైంది.

  English summary
  Karthika Deepam 15th September Episode number 1458.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X